Wednesday, November 22, 2017

నగరం నడిబొడ్డున ఆకు పచ్చని సమావేశం



సాహిత్యం అంటే  లాభసాటి  వ్యవహారం కాదు సృజన  అదో పెయిన్ ఫుల్ జాబ్  అన్న  ఖదీర్ బాబు  ఇంటర్వ్యూ  సారంగలో  చదివిన తరువాత  తప్పకుండా  ఇతన్ని  ఎప్పుడన్నా  కలవాలి అనుకున్నాను. ఆ తరువాత  కొద్ది రోజులకే సాహిత్య ప్రస్థానం  వారు  కధా కార్యశాల నిర్వహిస్తున్నారని   షరీఫ్   పేస్బుక్  లో  అందరికి  చెప్పి   కొత్తగా  కధలు రాయలను కునే వారు  తప్పకుండా  పాలుపంచుకోండి అని చెప్పడం తో   వెళ్ళాను.
ఆ రోజున  ఖదీర్ బాబు  చెప్పిన  కధలు  ఎలా రాయాలి  అన్న  కొన్ని వాక్యాలు   నన్ను వెంటాడాయి.  దేన్నైనా  చూసి  అంటే ఒక సంఘటన  కావచ్చు ,ఒక కధ ,కావచ్చు ,ఒక సినిమా ,లేదా  ఒక షార్ట్ ఫిల్మ్  కావచ్చు  దాని నుంచి  ప్రభావితం  చెంది  కధ  రాయచ్చు  అన్న మాటలు  నన్ను  బాగా   ఆకట్టుకున్నాయి.  కాని  అప్పుడు  ఖదీర్ బాబు తో  నాకు   అసలు  పరిచయం లేదు.
ఆ ఏడాది  పుస్తక ప్రదర్శనలో  బియాండ్  కాఫీ  పుస్తకం  కొని   చదివాను . అందులో  అతని  ఉన్న  నెంబర్ కి   ఫోన్ చేశాను  . కానీ ఎందు వల్లో అది కలవలేదు . కాని  ఫేస్బుక్  లో కధా  గ్రూప్  ద్వారా  చాల మంది   రచయతలు  మిత్రులయ్యారు . వారి లో  ముఖ్యంగా  అరిపిరాల సత్యప్రసాద్ , తనే  మాకు ఎక్కడెక్కడ  సాహితీ  సమావేశాలు  ఉన్నాయో చెప్పే వారు . అలాంటి  ఒక సందర్భం  లో  బహుశా  అది  ప్రాతినిధ్య  వారి  కదల  ఆవిష్కరణ  అనుకుంటా  అప్పుడు  ఖదీర్  తో పరిచయం  ఏర్పడింది.  ఇక అప్పటి నుంచి  ఫేస్బుక్  లో మిత్రుడయ్యారు.
తరువాత  వచ్చిన మెట్రో కధలు  అన్నీ చదివాను . అప్పటి నుంచి ఫోన్ చేసి  కధల గురుంచి  చెప్పేదాన్ని .
అప్పుడే తను నిర్వహించే  కధల  వర్క్ షాప్ గురించి తెలిసేది.  చాల  ఇంటరెస్టింగ్  గా అనిపించేది.  కధల ఇలా కూడా రాస్తారు ,కొత్త కధ , ఉత్తమ తెలుగు వాన కదల  పుస్తకావిష్కరణ  సభలలో  పాల్గొనడం జరిగింది.  ఆ సభల ద్వారా  ఏంతో మంది   యువ రచయతల తో పరిచయం  ఏర్పడింది
ఒక రోజున ఫోన్ చేసి  ఈ మాటు కధల వర్క్ షాప్  హైదరబాద్  లో అంబేద్కర్   యూనివర్సిటీ లో  ఉంటుంది  అని తను  చెబుతున్నప్పుడే , నేను వస్తున్నాని   చెప్పేసాను.
అప్పుడు  చెప్పారు   ,సుందరి నాగమణి  ని  కూడా వస్తోందని . ఇంకేంటి  ఇద్దరం  బోలెడు కబుర్లు చెప్పుకొని  పిక్నిక్  వెళుతున్నట్లు గా సరదాగా వెళ్లాం
ఇద్దరము కాబ్  బుక్ చేసుకొని సరిగ్గా ఉదయం  8.30 కల్లా  అక్కడున్నాము. మీట్ అండ్ గ్గ్రీట్ అయ్యాక   బ్రేక్ ఫాస్ట్  చేసుకొని  అందరం  సమావేశం అయ్యాము .
అక్కడ పద్మని, రమణ మూర్తి గారిని,అనిల్  గారిని  కలిసి  బోలెడు కబుర్లు  చెప్పుకున్నాము. అపర్ణ ,జ్యోతి ,రెహనా,చైతన్య  లతతో  సరదా కబుర్లు ,మల్లికార్జున్ ,కరుణ ,కృష్ణ,నాగేంద్ర ,భగవంతం ఇలా ఎంతమందో , సురేశ గారి భార్య  పద్మ  వారి పుస్తకపరిచయాలు  fb లో చదువుతూ  ఉంటాను. 
మొదటి సెషన్  లో పాల్గొన్న  అందరు రచయతల intro జరిగింది.  అంతకంటే  ముందు సమావేశాన్ని గురుంచి  అరిపిరాల  చెపారు. ఆ తరువాత యూనివర్సిటీ  VC గారు  మాట్లాడారు  వారు సృజన పత్రికకు  ఎడిటర్  గ కూడా వ్యహరించారని  చెప్పారు. రచయతల పరిచయాలు  అయ్యాసరికి  లంచ్  సమయం  అయింది.    సాయత్రం  ఐదు  గంటల వరకు  సమావేశం లో కొంతమంది రచయితలు  టం అనుభవాలను  చెప్పారు.   ఆ తరువాత  అందరము గ్రూప్  ఫోటో ని తీసుకున్నాము . ఆరుగంటలకి  వేడి వేడి  ఉల్లి దోశలు తిని
అనంతరం  రాత్రి 9.30  వరకు  మళ్ళా  సమావేశం  సాగింది . రాత్రి డిన్నర్  తరువాత  సరదాగా  పాటలు ,standup commedy తో అలరించారు . mahesh katti,koduri vijayakumar, karuna,bhagavantam,రిషి శ్రీనివాస్ .
మరునాడు ఉదయం  బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత  మళ్ళి  సెషన్స్ మొదలయ్యాయి . అవి ఒంటి గంట వరకు  నడిచింది. మళ్ళి  లంచ్ బ్రేక్  అయ్యాక  సాయంత్రం  ఐదు వరకు  సమావేశం  నడిచింది.
ప్రతి  సమావేశం  తరువాత   దాని   సారంశాన్ని  సురేష్  గారు చక్కగా  సమన్వయము చేసేవారు  .
ఈ రైటర్స్ మీట్ 2017  లో చాల మంది  యువ రచయతలు  పాలు పంచుకున్నారు. అది  తెలుగుసాహిత్య లోకానికి   ఒక ప్రోత్శాహ కర  పరిణామం అనిపించింది.  అలాగే  స్టార్ ప్రొడ్యూసర్  ఎన్నో మంచి చిత్రాలు తీసిన  మురారి  గారిని కలవడం  కూడా చాలా  ఆనందంగా  అనిపించింది. ఈ వయసు లో కూడా ఆయన  అంత  చలాకీ  గా ఉండటం  చాల గొప్పవిషయం.
నగరం నడిబొడ్డున  పచ్చని చెట్ల మధ్య ,ఆకుపచ్చని జ్ఞాపకం లాంటి  ఈ సమావేశం .ఇందులో పాలుపంచుకున్న  నాకు కూడా ఇది ఒక హరితానుభవమే.
అయితే  ఇంత పెద్ద సమావేశాన్ని  నిర్వహించడం ,బాధ్యత  వహించడం  చాల  కష్టమైన  పని , ఆ బారాన్ని మోసిన  సారధులు ,నాకు తలిసిన వాళ్ళు  మహీ,ఖదీర్,పద్మ,కరుణ( టీ తీసుకు రావడానికి ,రూమ్స్  ఏర్పాటు చేయడం లో ) నాకు తలిసిన పేర్లు ,ఇంకా ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా మా లాంటి వాళ్ళు  ఎక్కడా కష్టపడకుండా ఉండేలా చూసుకున్నారు .
అందరిని ఒక్క చోట సంఘటిత పరచడానికి  ఖదీర్ గారు ,అతనితో  పాటు  అను నిత్యం ఉండే  వారి స్నేహ బృందం  చాల కష్టపడ్డారు
ఇది  ఒక  చక్కటి  అనుభవం   నిజానికి  నాకు తెలియని  ఎన్నో  కోణాలు ,మరెన్నో  విషయాల గురించి తెలుసుకున్నాను
మళ్ళి సారి  సమావేశానికి మీ రు ఉండకపోవచ్చు  అన్న ఖదీర్  మాటలతో  నేను ఏకీభవించను.
మళ్ళా మళ్ళా ఇలాంటి  సమావేశాలలో   పాలుపంచుకుంటూనే  ఉంటానని ..  చెబుతూ  .

                  


Thursday, November 16, 2017

జీవితం: కు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణంమనిషికి చెట్టూ చే...

జీవితం: కు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణంమనిషికి చెట్టూ చే...: కు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణం మనిషికి చెట్టూ చేమ మనుగడ ని ఇస్తాయి అవి లేకపోతె మనిషి బతుకు ఎడారే. గతంలో ఎన్నడూ లేనంత గా తెలంగాణం పచ్చ...

ఆకు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణం



ఆకు పచ్చని మణి హారం  తెలంగాణ మాగాణం


మనిషికి  చెట్టూ చేమ మనుగడ ని ఇస్తాయి  అవి లేకపోతె  మనిషి బతుకు ఎడారే.  గతంలో ఎన్నడూ లేనంత  గా   తెలంగాణం పచ్చదనం  తో కల కల లాడుతోంది.  రెండు రోజుల క్రితం  మా ప్రయాణం  హైదరాబాదు నుండి  ధర్మ పురి వైపు  సాగింది. చల్లని  చెట్ల  నీడ ల మధ్య  ఉదయపు  పలహారం చేసి  సిద్ధిపేట మీదుగా  వెళుతుంటే మనసు శరీరం కూడా  ఆ పచ్చదనపు ఆహ్లాదాన్ని ఆస్వాదించాయి
సిద్ధిపేట ఊరు  కడిగిన ముత్యం  లా ఉంది.  కారణం అక్కడ  ఎవ్వరు ప్లాస్టిక్  ని  వాడరు.  అది దాటి ముందుకు  వెళ్ళినప్పుడు  సిరిసెల్ల  టెక్స్టైల్ పార్క్  మీదుగా  వెళ్ళాము. అక్కడ కారు  ఆపకుండా  వేగం  గ తీసుకెళ్ళిపోయారు మా వాళ్ళు  కారణం  ఎక్కడ  మేము చీరలు  కొనేసుకుంటా మేమో  అని భయం  అన్న మాట.
నిజానికి మా దృష్టి అంతా  ధర్మపురి గోదారి  మీదే ఉంది.  దారి పొడవున  రోడ్ల  పక్కన, కాలనీలలో, పొలం గట్లమీద, చెరువు గట్ల మీద, ఇళ్ళముందు , అన్ని  చోట్ల  మొక్కలు, చెట్లు చెరవులు నిండుగా  ఉండి కళ్ళకు  తృప్తిగా  అనిపించింది.   ధర్మపురి గోదావరి నీళ్ళు స్వచ్చంగా  నీల కాంతి తో  మధ్యాహ్న్నపు భానుడి  కిరణాలతో  తళతళ మంటూ  మెరిసి పోయింది.  నరసింహ స్వామి దర్సనం తరువాత  అక్కడే ఉన్న  పచ్చటి చెట్ల కింద  తెచ్చుకున్న  భోజనం  చేసుకొని  బాసర  వైపు  సాగింది మా ప్రయాణం.  .
కోరుట్ల లో ప్రభుత్వ పశు వైద్య  కళాశాల ఉంది.
జగిత్యాల్ ,కోరుట్ల ,ఆర్మూర్,నిజామాబాద్ దాటి బాసర్ వెళ్ళాము.
మధ్యలో  అభంగపట్నం దగ్గర  దారి తప్పి  కొంత దూరం  పంట పొలాల  మధ్య సాగింది  మా ప్రయాణం అక్కడ  మళ్ళి గోదావరమ్మ దర్సనం ఇక్కడ  కొంత  శాంత గోదావరి రూపం లో  నిశ్చలం  గా ఉంది.   ఆ రాత్రికి  బాసర  లో బస చేసి  మరునాడు  జ్ఞాన స్వరూపిణి ,వేద మాత అయిన  సరస్వతీ  దేవి దర్సనం  చేసుకొని   హైదరాబాదు  కి  తిరుగు ప్రయాణం అయ్యాము.
ఈ ప్రయాణం  లో అప్పుడప్పుడు  స్థానిక  వ్యక్తుల తో  మాట్లాడినప్పుడు. వాళ్ళ  లో చాల మంది  ప్రభుత్వం చేస్తున్న పనులు వల్ల   చాల  సంతోష ము గా  ఉన్నారని చెప్పారు .  ముఖ్యంగా  ఆరోగ్య వైద్య  సేవల  విషయం లో. అదో  మంచి  పరిణామం  అనిపించింది.

కదలి పోతున్న  కార్ లోంచి  ఫొటోస్  తీయ లేక పోయాము