Wednesday, March 9, 2011

ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా నేస్తం!


వెళ్ళిపోయవా నేస్తం! వెళ్ళిపోయవా నేస్తం

మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం

ఏవి  ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!

ఏది  మామిడి చెట్టుకు కట్టిన  ఊయల ? ఊగుతూ     ఊగుతూ   తెగిన ఊయలని  వదలి వెళ్ళిపోయవా నేస్తం!

ఏటిలో  చేపలా   ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని  ఏటి పాలు చేసావా   నేస్తం

నువ్వు భౌతికం గ   లేకపోయనా  వో నేస్తం !  నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను  పలకరిస్తూనే వున్నాయి

ఈ  మట్టి  వాసనలో నిన్ను నేను  చూస్తున్నాను నేస్తం     ఈ గాలిలో గుసగుసలో నీ  పాట  వింటున్నాను నేస్తం

ఆ ఏటి తరగల మీద నురుగులో  నీ నవ్వు  చూస్తున్నాను నేస్తం   ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం

నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు   నేస్తం  నాతో నే వున్నావు  !! నా వూపిరిలోనే  లోనే వున్నావు   నేస్తం!!




Tuesday, March 8, 2011

ఆవేదన



అమ్మాయి పుట్టింది!  మహాలక్ష్మి అన్నారు!

అమ్మాయి బాగా చదవుతోంది!  సాక్షాతూ  చదువలసరస్వతి అన్నారు!

అమ్మాయి కి ఈడు  వచ్చి పెళ్లి జరిగింది! సాక్షాతూ ఆదిదంపతులు అన్నారు!

ఇంతవరకు అమ్మాయిలో అన్ని దేవతలను చూసారు!

అప్పుడు ఆమె  మౌన మూర్తి  వినటమే తప్ప  మాటలాడటం ఎరుగదు!

మరి  నేడు అందరు   ఆమెని రాక్షసి అని బరితెగెంచిదని!అంటున్నారు 


కారణం ఇప్పుడు నోరు తెరచింది స్వతంత్ర జీవనం కావాలి అంటోది!

తనకు మాతృత్వం ఇవ్వన్ని వివాహబంధం వద్దు అంది!

అదేపురాణాల స్త్రీలు ఏమి చేసిన తప్పు పట్టని సమాజం ! తనకి ఎందుకు

న్యాయము చెయ్యరూ అని అడిగింది! అమ్మతనం కావాలని  కోరుకోవడం తప్పా అని ప్రశ్నించిది?

ఏదిన్యాయము ! ఏది ధర్మం అని అక్రోసించింది  ఆ స్ర్తీ హృదయం!


ఎవరు ఆమెకి న్యాయము చెయ్యలేదు. వేరే దారి లేక మరణాన్ని ఆశ్రయించింది!

మండుతున్న మనసుతోపాటు  తనువు కూడా  అగ్నికి ఆహుతి అయ్యింది!

ఆహ!  నిజంగా నీవు  సతివే  సుమా  అని  అందరు వేనోళ్ళ పొగిడారు!

ఆమె మరణం  తో మరింత దివ్యత్వాన్ని పొందింది అని ఆనందించారు!

అంతే కానీ ఆమె నిండునూరేళ్లు అర్ధం లేకుండా ముగిసాయని ఎవరు అనలేదు.

ఎవరు అర్ధం చేసుకుంటారు   వో   స్త్రీ   నీ    గుండె లోతుల బాధని, 
  
ఎవరు అర్ధం చేసుకుంటారు తల్లీ  నీ ఆవేదనని? ఎవరు? ఎవరు???


Tuesday, March 1, 2011

బ్లాగర్   స్నేహితులందరికీ, మహాశివరాత్రి శుభాకాంక్షలు!!!


నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై - న - కారాయ నమశ్శివాయ || 


హరహరమహాదేవ!  ఆ శివుడు కరుణించి  ఆ  కైలాసమానససరోవరం యాత్ర  చేయిస్తే   మనసుకి  చాల త్రప్తిగా వుంటుంది