Friday, November 25, 2011


పోలిస్వర్గం


రేపు పోలిస్వర్గం! దీని గురుంచి ఒక కధ వుంది మా అమ్మగారు చెప్పారు.
స్త్రీల వ్రతకదల పుస్తకం లోకూడావుంది


అనగా అనగా ఒక ఊరులో,అన్ని కులాల వాళ్ళు నివసిస్తూ వుంటారు అందులో చాకలి కులం
వారు వుంటారు. పోలి అనే ఆవిడ ఎప్పుడు దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో కొలుస్తూ వుంటుంది.
మిగత తోటికోడళ్ళు ,అత్తగారు ఆమెని చిన్న చూపు చూస్తారు. ఎప్పటి
లాగే వచ్చే కార్తిక మాసం ఆఖరిరోజున నది కి వెళ్లి దీపాలు వెలిగించాలని అనుకుంటుంది. కాని అత్తగారు
మిగిలిన కోడళ్ళు ఆమెకి చెప్పకుండా నది దగ్గరకి వెళ్ళిపోతారు. ఆమెకి
వత్తులు, నెయ్యి మొదలయిన సంబరాలు ఉంచకుండా చేస్తారు.
అప్పుడు ఆమె దేవుణ్ణి తలచుకుంటూ ఉన్నవాటి తో తయారు చేసుకొని నది కి వెళ్లిదీపాలు వదులుతుంది.
అది చూసి దేవతలుఆమెని బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పుష్పకవిమానం లోవస్తారు.
అది చూసిఊరులో వాళ్ళు ఆమె అత్తా,తోటికోడళ్ళు ఆహ ఎంత భాగ్యం, ఎంతపుణ్యం కదా! మన
పోలి బొంది తో స్వర్గం కి వెళ్ళింది అని ఆమె గురుంచి వేనోళ్ళ పోగుడుకుంటారు.


అప్పటి నుంచి ప్రతి కార్తిక మాసం చివరరి
రోజున
" పొలమ్మ స్వర్గం అందరు చేస్తున్నారు"

వెళ్ళిపోయవా ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా ప్రియ నేస్తం


వెళ్ళిపోయవా  ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా  ప్రియ  నేస్తం

మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం

ఏవి  ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!

ఏది  మామిడి చెట్టుకు కట్టిన  ఊయల ? ఊగుతూ     ఊగుతూ   తెగిన ఊయలని  వదలి వెళ్ళిపోయవా నేస్తం!

ఏటిలో  చేపలా   ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని  ఏటి పాలు చేసావా   నేస్తం

నువ్వు భౌతికం గ   లేకపోయనా  వో నేస్తం !  నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను  పలకరిస్తూనే వున్నాయి

ఈ  మట్టి  వాసనలో నిన్ను నేను  చూస్తున్నాను నేస్తం     ఈ గాలిలో గుసగుసలో నీ  పాట  వింటున్నాను నేస్తం

ఆ ఏటి తరగల మీద నురుగులో  నీ నవ్వు  చూస్తున్నాను నేస్తం   ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం

నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు   నేస్తం  నాతో నే వున్నావు  !! నా వూపిరిలోనే  లోనే వున్నావు   నేస్తం!!

Wednesday, November 23, 2011

రచయిత్రి బీనాదేవి గారి తో పరిచయ కార్యక్రమం




రచయిత్రి బీనాదేవి  గారి తో పరిచయ కార్యక్రమం చాల బావుంది
HYtv  ఛానల్ లో  ది బుక్    అనే సాహిత్యకార్యక్రమం
బహుశ  పరిచయం చేసినవారి పేరులక్ష్మి గారు అని అనుకుంటునాను.
నా  చిన్నప్పుడు ఆవిడ ' ఆంధ్రజ్యోతి' లో ఫుణ్యభూమి కళ్ళుతెరూ,అలాగే  రాధమ్మ పెళ్లి ఆగిపోయింది' లాంటి పుస్తకాలూ చదివానుఇప్పుడుఆవిడ వ్యాసాలు  నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారం గ నే  వుంటాయి.  మనసును హత్తుకునే లావుంటాయి.


బీనాదేవి  అనేకలం పేరుతో జంటగా రచనలు చేసిన దంపతులు బి.నరసింగ రావు, బాలాత్రిపురసుందరీ దేవి. వీరునవలలతో పాటు, ఎన్నో కథలనూ రాశారు. నరసింగరావు గారి హఠాన్మరణం తర్వాత, సాహితీ లోకమంతా 'బీనాదేవిఅంటే  బి.నరసింగ రావు గారే రాస్తారుఅని అపోహ పడ్డారు. తరువాత  కానీ చాల మందికి తెలియలేదు  ఆవిడే  స్వయం గరాసారు     తన సంకలనం'కథలు-కబుర్లు' ముందుమాటలో నేనే రచనలు చేస్తున్నాననీ  బాలాత్రిపురసుందరి దేవిఆవిడఅసలు పేరు 'బీనాదేవి' పేరుతోనే ఈ పుస్తకాన్ని వెలువరించారావి


ఈ రోజు ది బుక్    అనే సాహిత్యకార్యక్రమం ద్వార ఆవిడ పరిచయం నిజం గ చాల అభినందనీయం.

Monday, November 21, 2011

జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): జ్ఞ్యాపకములు

జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): జ్ఞ్యాపకములు: జ్ఞ్యాపకములు ఆంధ్ర షెల్లీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన జ్ఞ్యాప కం అసలు జ్ఞ్యాపకాలు లేని జీవితాలు ...

Tuesday, November 8, 2011


మన(????)కృష్ణ వంశి

ఏంటో ఆనందంగా
 మా తమ్ముడి 20 వ  పెళ్లి రోజు అని మన గోదావరి,మన గోంగూర,మన వంకాయ ఇంకా సరే ఎర్రటి మన ఆవకాయ మన ఘంటసాల గారు ,మన మాయాబజార్ తో సరి తూగే మన creative
కృష్ణ వంశి!!{ పాపమూ సమించు గాక)   అనిమొగుడు సినిమాకి వెళ్ళాము

 కానిఎందుకు వెళ్లమో తెలెయని ఒక అర్ధం కాని  పిచ్చిమానసికస్థితికి లోను అయ్యి మేము మా చెప్పు తో  మమ్మల్ని కొట్టుకొని  లెంపలేసుకున్నాము ఇంకా జీవితం లో కృష్ణ వంశి సినిమాకి రాకూడదని  ఒక
 ఘోరమైన శపధం చేసుకున్నాము


తెలుగుతనం ,సంప్రదాయం. అంటూ   ఆడియో ఫంక్షన్ రోజునమొగుడు అంటే అంటూ చాల పెద్ద మాటలు చెప్పిన
 మన(????)కృష్ణ వంశి! అది లేదు కదా క్యాలెండరు గిరల్స్  సంప్రదాయనికి మాత్రం చాఆఆఆఆఆఆఆఆఆఆల
న్యాయం చేకూర్చాడు.రోజా,రాజేంద్రప్రసాద్,నరేష్ వీళ్ళుకూడా  తమ
 తమనెలవులు తప్పారు


దేవుడా  ఎందుకు  ఎందుకు  ఎందుకు  మనతెలుగు సినిమా మంచి డైరెక్టర్ లు అందరు తమ పేరు ని,
 అస్తిత్వం కోల్పోతున్నారు? మొన్న బాపుగారు,నిన్న విశ్వనాధ్  గారు ఈ రోజు కృష్ణ వంశి

అమ్మతెలుగు సినిమా తల్లి నీకు గతించిన వైభవం మళ్ళి వచ్చేనా?


ఇదినిజం గ తెలుగు చిత్రసీమ మొత్తం  ఆలోచించదగ్గ విషయం