వెళ్ళిపోయవా ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా ప్రియ నే స్తం
మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం
ఏవి ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!
ఏది మామిడి చెట్టుకు కట్టిన ఊయల ? ఊగుతూ ఊగుతూ తెగిన ఊయలని వదలి వెళ్ళిపోయవా నేస్తం!
ఏటిలో చేపలా ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని ఏటి పాలు చేసావా నేస్తం
నువ్వు భౌతికం గ లేకపోయనా వో నేస్తం ! నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను పలకరిస్తూనే వున్నాయి
ఈ మట్టి వాసనలో నిన్ను నేను చూస్తున్నాను నేస్తం ఈ గాలిలో గుసగుసలో నీ పాట వింటున్నాను నేస్తం
ఆ ఏటి తరగల మీద నురుగులో నీ నవ్వు చూస్తున్నాను నేస్తం ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం
నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు నేస్తం నాతో నే వున్నావు !! నా వూపిరిలోనే లోనే వున్నావు నేస్తం!!
No comments:
Post a Comment