http://www.jagritiweekly.com/ నేను రాసిన కాశి పట్నం చూడరా బాబు ధారావాహిక మొదటి బాగం జాగృతి వార పత్రికలో
నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని. నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని, ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు " చలం
Wednesday, December 20, 2017
Wednesday, November 22, 2017
నగరం నడిబొడ్డున ఆకు పచ్చని సమావేశం
సాహిత్యం అంటే లాభసాటి
వ్యవహారం కాదు సృజన అదో పెయిన్
ఫుల్ జాబ్ అన్న ఖదీర్ బాబు
ఇంటర్వ్యూ సారంగలో చదివిన తరువాత
తప్పకుండా ఇతన్ని ఎప్పుడన్నా
కలవాలి అనుకున్నాను. ఆ తరువాత
కొద్ది రోజులకే సాహిత్య ప్రస్థానం
వారు కధా కార్యశాల నిర్వహిస్తున్నారని షరీఫ్
పేస్బుక్ లో అందరికి
చెప్పి కొత్తగా కధలు రాయలను కునే వారు తప్పకుండా
పాలుపంచుకోండి అని చెప్పడం తో
వెళ్ళాను.
ఆ రోజున ఖదీర్ బాబు చెప్పిన కధలు
ఎలా రాయాలి అన్న కొన్ని వాక్యాలు నన్ను వెంటాడాయి. దేన్నైనా
చూసి అంటే ఒక సంఘటన కావచ్చు ,ఒక కధ ,కావచ్చు ,ఒక సినిమా ,లేదా ఒక షార్ట్ ఫిల్మ్ కావచ్చు
దాని నుంచి ప్రభావితం చెంది కధ
రాయచ్చు అన్న మాటలు నన్ను
బాగా ఆకట్టుకున్నాయి. కాని
అప్పుడు ఖదీర్ బాబు తో నాకు
అసలు పరిచయం లేదు.
ఆ ఏడాది పుస్తక ప్రదర్శనలో బియాండ్
కాఫీ పుస్తకం కొని
చదివాను . అందులో అతని ఉన్న
నెంబర్ కి ఫోన్ చేశాను
. కానీ ఎందు వల్లో అది కలవలేదు . కాని
ఫేస్బుక్ లో కధా గ్రూప్ ద్వారా
చాల మంది రచయతలు మిత్రులయ్యారు . వారి లో ముఖ్యంగా
అరిపిరాల సత్యప్రసాద్ , తనే మాకు
ఎక్కడెక్కడ సాహితీ సమావేశాలు
ఉన్నాయో చెప్పే వారు . అలాంటి ఒక
సందర్భం లో బహుశా
అది ప్రాతినిధ్య వారి
కదల ఆవిష్కరణ అనుకుంటా
అప్పుడు ఖదీర్ తో పరిచయం
ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ఫేస్బుక్
లో మిత్రుడయ్యారు.
తరువాత వచ్చిన మెట్రో కధలు అన్నీ చదివాను . అప్పటి నుంచి ఫోన్ చేసి కధల గురుంచి
చెప్పేదాన్ని .
అప్పుడే తను
నిర్వహించే కధల వర్క్ షాప్ గురించి తెలిసేది. చాల
ఇంటరెస్టింగ్ గా అనిపించేది. కధల ఇలా కూడా రాస్తారు ,కొత్త కధ , ఉత్తమ
తెలుగు వాన కదల పుస్తకావిష్కరణ సభలలో
పాల్గొనడం జరిగింది. ఆ సభల ద్వారా ఏంతో మంది
యువ రచయతల తో పరిచయం ఏర్పడింది
ఒక రోజున ఫోన్ చేసి ఈ మాటు కధల వర్క్ షాప్ హైదరబాద్
లో అంబేద్కర్ యూనివర్సిటీ లో ఉంటుంది అని తను
చెబుతున్నప్పుడే , నేను వస్తున్నాని చెప్పేసాను.
అప్పుడు చెప్పారు ,సుందరి
నాగమణి ని కూడా వస్తోందని . ఇంకేంటి ఇద్దరం
బోలెడు కబుర్లు చెప్పుకొని
పిక్నిక్ వెళుతున్నట్లు గా సరదాగా
వెళ్లాం
ఇద్దరము కాబ్ బుక్ చేసుకొని సరిగ్గా ఉదయం 8.30 కల్లా అక్కడున్నాము. మీట్ అండ్ గ్గ్రీట్ అయ్యాక బ్రేక్ ఫాస్ట్ చేసుకొని
అందరం సమావేశం అయ్యాము .
అక్కడ పద్మని, రమణ మూర్తి
గారిని,అనిల్ గారిని కలిసి
బోలెడు కబుర్లు చెప్పుకున్నాము.
అపర్ణ ,జ్యోతి ,రెహనా,చైతన్య లతతో సరదా కబుర్లు ,మల్లికార్జున్ ,కరుణ ,కృష్ణ,నాగేంద్ర
,భగవంతం ఇలా ఎంతమందో , సురేశ గారి భార్య
పద్మ వారి పుస్తకపరిచయాలు fb లో చదువుతూ
ఉంటాను.
మొదటి సెషన్ లో పాల్గొన్న
అందరు రచయతల intro జరిగింది. అంతకంటే ముందు సమావేశాన్ని గురుంచి అరిపిరాల చెపారు. ఆ తరువాత యూనివర్సిటీ VC గారు
మాట్లాడారు వారు సృజన
పత్రికకు ఎడిటర్ గ కూడా వ్యహరించారని చెప్పారు. రచయతల పరిచయాలు అయ్యాసరికి లంచ్
సమయం అయింది. సాయత్రం
ఐదు గంటల వరకు సమావేశం లో కొంతమంది రచయితలు టం అనుభవాలను
చెప్పారు. ఆ తరువాత అందరము గ్రూప్
ఫోటో ని తీసుకున్నాము . ఆరుగంటలకి
వేడి వేడి ఉల్లి దోశలు తిని
అనంతరం రాత్రి 9.30
వరకు మళ్ళా సమావేశం
సాగింది . రాత్రి డిన్నర్ తరువాత సరదాగా
పాటలు ,standup commedy తో అలరించారు . mahesh katti,koduri vijayakumar,
karuna,bhagavantam,రిషి శ్రీనివాస్ .
మరునాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత మళ్ళి
సెషన్స్ మొదలయ్యాయి . అవి ఒంటి గంట వరకు
నడిచింది. మళ్ళి లంచ్ బ్రేక్ అయ్యాక సాయంత్రం
ఐదు వరకు సమావేశం నడిచింది.
ప్రతి సమావేశం
తరువాత దాని సారంశాన్ని
సురేష్ గారు చక్కగా సమన్వయము చేసేవారు .
ఈ రైటర్స్ మీట్ 2017 లో చాల మంది
యువ రచయతలు పాలు పంచుకున్నారు. అది తెలుగుసాహిత్య లోకానికి ఒక
ప్రోత్శాహ కర పరిణామం అనిపించింది. అలాగే
స్టార్ ప్రొడ్యూసర్ ఎన్నో మంచి
చిత్రాలు తీసిన మురారి గారిని కలవడం
కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఈ వయసు లో కూడా ఆయన అంత చలాకీ గా ఉండటం
చాల గొప్పవిషయం.
నగరం నడిబొడ్డున పచ్చని చెట్ల మధ్య ,ఆకుపచ్చని జ్ఞాపకం లాంటి ఈ సమావేశం .ఇందులో పాలుపంచుకున్న నాకు కూడా ఇది ఒక హరితానుభవమే.
అయితే ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడం ,బాధ్యత వహించడం
చాల కష్టమైన పని , ఆ బారాన్ని మోసిన సారధులు ,నాకు తలిసిన వాళ్ళు మహీ,ఖదీర్,పద్మ,కరుణ( టీ తీసుకు రావడానికి
,రూమ్స్ ఏర్పాటు చేయడం లో ) నాకు తలిసిన
పేర్లు ,ఇంకా ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా మా లాంటి వాళ్ళు ఎక్కడా కష్టపడకుండా ఉండేలా చూసుకున్నారు .
అందరిని ఒక్క చోట సంఘటిత
పరచడానికి ఖదీర్ గారు ,అతనితో పాటు
అను నిత్యం ఉండే వారి స్నేహ బృందం చాల కష్టపడ్డారు
ఇది ఒక చక్కటి
అనుభవం నిజానికి నాకు తెలియని
ఎన్నో కోణాలు ,మరెన్నో విషయాల గురించి తెలుసుకున్నాను
మళ్ళి సారి సమావేశానికి మీ రు ఉండకపోవచ్చు అన్న ఖదీర్
మాటలతో నేను ఏకీభవించను.
మళ్ళా మళ్ళా ఇలాంటి సమావేశాలలో పాలుపంచుకుంటూనే ఉంటానని ..
చెబుతూ .
Thursday, November 16, 2017
జీవితం: కు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణంమనిషికి చెట్టూ చే...
జీవితం: కు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణంమనిషికి చెట్టూ చే...: కు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణం మనిషికి చెట్టూ చేమ మనుగడ ని ఇస్తాయి అవి లేకపోతె మనిషి బతుకు ఎడారే. గతంలో ఎన్నడూ లేనంత గా తెలంగాణం పచ్చ...
ఆకు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణం
ఆకు
పచ్చని మణి హారం తెలంగాణ మాగాణం
మనిషికి చెట్టూ చేమ మనుగడ ని ఇస్తాయి అవి లేకపోతె
మనిషి బతుకు ఎడారే. గతంలో ఎన్నడూ
లేనంత గా తెలంగాణం పచ్చదనం తో కల కల లాడుతోంది. రెండు రోజుల క్రితం మా ప్రయాణం హైదరాబాదు నుండి ధర్మ పురి వైపు సాగింది. చల్లని చెట్ల నీడ ల మధ్య ఉదయపు పలహారం చేసి సిద్ధిపేట మీదుగా వెళుతుంటే మనసు శరీరం కూడా ఆ పచ్చదనపు ఆహ్లాదాన్ని ఆస్వాదించాయి
సిద్ధిపేట ఊరు కడిగిన ముత్యం లా ఉంది.
కారణం అక్కడ ఎవ్వరు ప్లాస్టిక్ ని వాడరు. అది దాటి ముందుకు వెళ్ళినప్పుడు సిరిసెల్ల
టెక్స్టైల్ పార్క్ మీదుగా వెళ్ళాము. అక్కడ కారు ఆపకుండా వేగం గ
తీసుకెళ్ళిపోయారు మా వాళ్ళు కారణం ఎక్కడ మేము చీరలు కొనేసుకుంటా మేమో అని భయం అన్న మాట.
నిజానికి మా దృష్టి
అంతా ధర్మపురి గోదారి మీదే ఉంది.
దారి పొడవున రోడ్ల పక్కన,
కాలనీలలో, పొలం గట్లమీద, చెరువు గట్ల మీద, ఇళ్ళముందు
, అన్ని
చోట్ల మొక్కలు, చెట్లు చెరవులు
నిండుగా ఉండి కళ్ళకు తృప్తిగా అనిపించింది.
ధర్మపురి గోదావరి నీళ్ళు స్వచ్చంగా నీల కాంతి తో మధ్యాహ్న్నపు భానుడి కిరణాలతో తళతళ మంటూ మెరిసి పోయింది. నరసింహ స్వామి దర్సనం తరువాత అక్కడే ఉన్న పచ్చటి చెట్ల కింద తెచ్చుకున్న భోజనం చేసుకొని బాసర వైపు సాగింది మా ప్రయాణం. .
కోరుట్ల
లో ప్రభుత్వ పశు వైద్య కళాశాల ఉంది.
జగిత్యాల్
,కోరుట్ల ,ఆర్మూర్,నిజామాబాద్ దాటి బాసర్ వెళ్ళాము.
మధ్యలో అభంగపట్నం దగ్గర దారి తప్పి
కొంత దూరం పంట పొలాల మధ్య సాగింది మా ప్రయాణం అక్కడ మళ్ళి గోదావరమ్మ దర్సనం ఇక్కడ కొంత శాంత గోదావరి రూపం లో నిశ్చలం గా ఉంది.
ఆ రాత్రికి బాసర లో
బస చేసి మరునాడు జ్ఞాన స్వరూపిణి ,వేద మాత అయిన సరస్వతీ దేవి దర్సనం చేసుకొని హైదరాబాదు కి తిరుగు ప్రయాణం అయ్యాము.
ఈ ప్రయాణం
లో అప్పుడప్పుడు స్థానిక వ్యక్తుల తో మాట్లాడినప్పుడు. వాళ్ళ లో చాల మంది ప్రభుత్వం చేస్తున్న పనులు వల్ల చాల సంతోష ము గా ఉన్నారని చెప్పారు . ముఖ్యంగా ఆరోగ్య వైద్య సేవల విషయం లో. అదో మంచి పరిణామం అనిపించింది.
కదలి
పోతున్న కార్ లోంచి ఫొటోస్ తీయ లేక పోయాము
Saturday, October 21, 2017
ఉత్తమ వాన కధలు , నా భావాలు
ఉత్తమ వాన కధలు , నా భావాలు
వాన కధల కి ఓ సంకలనం ఏంటి? పైగా దీనికితోడు ఉత్తమ తెలుగు అనే విశేషణం? అనే కుతుహులం ఎక్కువైంది.
ఇంతలో పుస్తకావిష్కరణ కి పిలుపు కూడా వచ్చింది.
నేస్తం సుందరీ నాగమణి(రచయిత్రి), పెద్దమ్మాయి స్వప్న కలిసి వెళ్ళాము.
అక్కడికి చేరుకునే లోపల “వాన కు తడిసిన మట్టి సుగంధంలాంటి జ్ఞాపకాలు తెరలుతెరలుగా గుప్పున వచ్చి మనసుని చుట్టేసాయి.
“చిన్నతనం లో అమ్మమ్మ ఊరి కి వెళ్ళినప్పుడు వచ్చిన వాన చిన్న నాటి జ్ఞాపకాల పరిమళాల ని గుర్తు తెస్తే , డిగ్రీ చదివేటప్పుడు, శాంతినికేతనం లాంటిది మా కాలేజీ అని పైకి అంటూ అబ్బే వట్టి పూరి పాకలు అని లోపల తిట్టుకుంటూ, బెంచిల మీదికి గొంగళిపురుగు లు వస్తున్నాయి అని విసుక్కున్నా, చెట్ల మధ్య నుంచి కురుస్తున్న వానను చూసి ఆనంద పడే బరువు,భాద్యతల లేని అల్లరి వయసు జ్ఞాపకాలు కొన్నయితే, దివిసీమ ఉప్పెనకు ,గాలివానలో నాన్నగారు రైలు పెట్టెలో చిక్కడిపొతే ,ఆ భయంకరమైన కాళరాత్రి జ్ఞాపకం ఇప్పటికీ వణుకు తెప్పించేది గా ఉంటుంది..
సంసారబంధం ఏర్పడిన తరువాత ఇద్దరి పిల్లలలు శ్రీవారి తో స్కూటర్ మీద హైకోర్ట్ నుంచి మదీనా వైపు వస్తుండగా కురిసిన భారీ కుండపోత వానకి, దారి కనపడక నాలా అంచు దగ్గర ఆగిపోయినప్పుడు ఆ నాటి వానలో కొట్టుకు పోయి ఉంటె అనే ప్రశ్న, జీవితం లో మర్చిపోలేని జ్ఞాపకం.”
ఇంతలో పుస్తకావిష్కరణ కి పిలుపు కూడా వచ్చింది.
నేస్తం సుందరీ నాగమణి(రచయిత్రి), పెద్దమ్మాయి స్వప్న కలిసి వెళ్ళాము.
అక్కడికి చేరుకునే లోపల “వాన కు తడిసిన మట్టి సుగంధంలాంటి జ్ఞాపకాలు తెరలుతెరలుగా గుప్పున వచ్చి మనసుని చుట్టేసాయి.
“చిన్నతనం లో అమ్మమ్మ ఊరి కి వెళ్ళినప్పుడు వచ్చిన వాన చిన్న నాటి జ్ఞాపకాల పరిమళాల ని గుర్తు తెస్తే , డిగ్రీ చదివేటప్పుడు, శాంతినికేతనం లాంటిది మా కాలేజీ అని పైకి అంటూ అబ్బే వట్టి పూరి పాకలు అని లోపల తిట్టుకుంటూ, బెంచిల మీదికి గొంగళిపురుగు లు వస్తున్నాయి అని విసుక్కున్నా, చెట్ల మధ్య నుంచి కురుస్తున్న వానను చూసి ఆనంద పడే బరువు,భాద్యతల లేని అల్లరి వయసు జ్ఞాపకాలు కొన్నయితే, దివిసీమ ఉప్పెనకు ,గాలివానలో నాన్నగారు రైలు పెట్టెలో చిక్కడిపొతే ,ఆ భయంకరమైన కాళరాత్రి జ్ఞాపకం ఇప్పటికీ వణుకు తెప్పించేది గా ఉంటుంది..
సంసారబంధం ఏర్పడిన తరువాత ఇద్దరి పిల్లలలు శ్రీవారి తో స్కూటర్ మీద హైకోర్ట్ నుంచి మదీనా వైపు వస్తుండగా కురిసిన భారీ కుండపోత వానకి, దారి కనపడక నాలా అంచు దగ్గర ఆగిపోయినప్పుడు ఆ నాటి వానలో కొట్టుకు పోయి ఉంటె అనే ప్రశ్న, జీవితం లో మర్చిపోలేని జ్ఞాపకం.”
ఇలా దారంతా అవి ప్రవహిస్తూనే ఉన్నాయి.
వాన కధల పుస్తకం ఆవిష్కరణ జరిగింది. అందులో కధల గురించి ప్రస్తావన చేస్తునప్పుడు. మొదటి కధ పాల గుమ్మి పద్మ రాజు గారి “ గాలి వాన” ఆ మాట వినగానే చటుక్కున నాన్నగారు మెదిలారు ఎందుకంటె ఆ కధ వెనుక కధను గురించి నాన్నగారు ఓ అపురూపమైన జ్ఞాపకం చెప్పారు. నాన్నగారు - ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. పెద్ద నాన్నగారు పాలగుమ్మి పద్మరాజు గారు ఇరువురు కూడా భీమవరం కాలేజి లో సహద్యాయులు. పక్క పక్క ఇళ్ళలోనే వుండే వారు. బహుశా ఈ సంఘటన బహుశా 1949-50 ల -మధ్య జరిగింది అనుకుంటా. అప్పుడు వచ్చిన అతి పెద్ద గాలివానలో వారు నివసిస్తున్న ఇంటి గోడ కూలి వారి శ్రీమతి గారికి దెబ్బతగలటం తో ఒక ఏడాది పాటు ఆవిడ కోలుకోలేకపోయారు. ఆ గాలివాన ఉదృతం చూసిన ఆయన తనకు కలిగిన ఆ భయంకరమైన అనుభవం నుంచే అక్షరరూపం ఇచ్చారని చెప్పేవారు.
ఈ సంకలనం లో ఇరవయి కధలు మొత్తం . మొదటి కధ తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనమైన కద తో మొదలయి. ఓ సాయంత్రపు అదృష్టం అనే కధ తో ముగుస్తుంది. చివరి కధను సంకలన కర్త అయిన ఖదీర్ బాబు వ్రాసారు. ఓ వర్షం కురిసిన సాయంత్రం నుంచి మరునాడు ఉదయం వరకు జరిగిన జీవితం గురించి అతను అని చెప్పబడే పాత్రధారి యొక్క మనస్థితి ని దృశ్యంగా చూపించారు.
ముందు తరం రాసిన కధల తో పాటు ఈ తరం కధలు కూడా చదువరలను తమ రచ(వా)నా చాతుర్యపు జల్లులలో ముంచెత్తుతారు
నాకెంతో ఇష్టమయిన తిలక్ కధ ‘ఊరి చివరి ఇల్లు, అదో అపూర్వ అనుభవం”
వల వలా కురుస్తోంది, జలజలా కురుస్తోంది వాన, కృష్ణ అంతా చినుకులు ,పులకరింతలు అంటూ తలమునకలుగా తడిపిన ‘రెండు గంగలు’ కధ ఎన్ని సార్లు చదివినా తనివితీరదు . bs రాములు గారి పాలు కధ పెత్తందారి తనం చూపించేదిగా ఉంది , కళ్ళలోంచి వాన కురిపిస్తుంది,
పేగుకాలిన వాసన మరో అద్భుతమైన కధ, శ్రీకాంత్ రాసిన 'నిశ్శబ్దపు పాట ' కథలో నదిలో ప్రయాణించే ఒక కాగితపు పడవ ,కొత్త గా ఉంది , అజయప్రసాద్ రాసిన 'మృగశిర 'కథలో రావిశాస్త్రి 'వర్షం', మహేంద్ర రాసిన 'అతడి పేరు మనిషి', అద్దేపల్లి ప్రభు 'అతడు మనిషి' కథల్లో ని మనుషులు మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంటుంది .సం వే రమేశ్ గారి ‘ఉత్తరపొద్దు’ కధ ఆసక్తి కరంగా ఉంది.
పూడూరి రాజిరెడ్డి కధ ‘నగరం లో వాన’ వచనకవిత్వం లా సాగిపోతుంది. అడవి నేపధ్యం లో సాగిన ‘మృగశిర ‘ కధ, కుప్పిలిపద్మ కధ ‘గోడ’ లో ఒక లాలిత్యం కనిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని కధలు మనసుకి హత్తుకునేలా ఉంటె మరికొన్ని తమ వెంట తీసుకొని వెళతాయి.
ముందు తరం రాసిన కధల తో పాటు ఈ తరం కధలు కూడా చదువరలను తమ రచ(వా)నా చాతుర్యపు జల్లులలో ముంచెత్తుతారు
నాకెంతో ఇష్టమయిన తిలక్ కధ ‘ఊరి చివరి ఇల్లు, అదో అపూర్వ అనుభవం”
వల వలా కురుస్తోంది, జలజలా కురుస్తోంది వాన, కృష్ణ అంతా చినుకులు ,పులకరింతలు అంటూ తలమునకలుగా తడిపిన ‘రెండు గంగలు’ కధ ఎన్ని సార్లు చదివినా తనివితీరదు . bs రాములు గారి పాలు కధ పెత్తందారి తనం చూపించేదిగా ఉంది , కళ్ళలోంచి వాన కురిపిస్తుంది,
పేగుకాలిన వాసన మరో అద్భుతమైన కధ, శ్రీకాంత్ రాసిన 'నిశ్శబ్దపు పాట ' కథలో నదిలో ప్రయాణించే ఒక కాగితపు పడవ ,కొత్త గా ఉంది , అజయప్రసాద్ రాసిన 'మృగశిర 'కథలో రావిశాస్త్రి 'వర్షం', మహేంద్ర రాసిన 'అతడి పేరు మనిషి', అద్దేపల్లి ప్రభు 'అతడు మనిషి' కథల్లో ని మనుషులు మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంటుంది .సం వే రమేశ్ గారి ‘ఉత్తరపొద్దు’ కధ ఆసక్తి కరంగా ఉంది.
పూడూరి రాజిరెడ్డి కధ ‘నగరం లో వాన’ వచనకవిత్వం లా సాగిపోతుంది. అడవి నేపధ్యం లో సాగిన ‘మృగశిర ‘ కధ, కుప్పిలిపద్మ కధ ‘గోడ’ లో ఒక లాలిత్యం కనిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని కధలు మనసుకి హత్తుకునేలా ఉంటె మరికొన్ని తమ వెంట తీసుకొని వెళతాయి.
సంపాదకుడు ఖదీర్ చెప్పినట్లు కళకళ , జలజల మనే ఈ ఉత్తమ తెలుగు వానకధల లోకి గొడుగు తొడుగు లేకుండా వెళ్లి తడిసి ముద్దయి, మళ్ళి మళ్ళి తడవాలని అదేనండి మరో వానకధల సంకలనం కోసం ఎదురు చూస్తూ...
మణి వడ్లమాని
Thursday, July 4, 2013
Thursday, April 25, 2013
గెలిచిన మందారం
టీవీ లో చూపించిన ఒక యదార్ధ సంఘటన ఈ కవితకు ప్రేరణగా తీసుకొని రాసాను.
గెలిచిన మందారం : మణి వడ్లమాని 26/04/2013
అందాలతోటలో విరిసింది ఓ కన్నెమందారం!
కళ్ళనిండా మధురస్వప్నాలు ,మదినిండా తీయటి తలపులు
కొంగుల ముడివేసిన జీవనసహచరుడితో అడుగులోఅడుగు వేసుకుంటూ
కొత్తఆశలతో,కోటికోర్కేలతో ఆనందంగా మెట్టినింట అడుగుపెట్టింది!
కాని తన ఆశలుఅడియాస లేననీ,జీవితమంతా తోడువస్తాడు అనుకొన్న తనవాడే
కాటేసే కాలసర్పమని, తనుఅడుగుపెట్టిన ఈ కొత్త తోటలో అసలు పూలే లేవని
అన్ని ముళ్ళే వున్నాయని తెలిసి విస్తుపోయింది ఆ ముగ్ద మందారం!
తను జీవించి వున్నా తన వునికినే లేకుండా చేసినప్పుడు
ఇది అన్యాయమని,అక్రమమని ఆక్రోశించింది ఆ పగిలిన హృదయం
ఇంత పెద్ద లోకంలో తన అస్తిత్వాన్ని గుర్తించే వారేలేరా? అని అలమటించి పోయింది.
ఎవరు తనకి సాయపడరు, తోడుగా రారు అని గ్రహించి గుండె దిటవుచేసుకొని
పట్టుదలతో,దీక్షతో మొక్కవోని దైర్యంతో తన చిన్నారి చిట్టి మందారమే
తనకు కొండతబలం అని తెలిసికొని కష్టనష్టాలకు ఓర్చుకొంటూ ముందుకు సాగింది
జీవితమంతా పోరాడుతూ ఇన్ని రోజులు ఆ కన్నతల్లి ఒకటే ధ్యేయం తో పెంచింది తన చిన్నారిని
తన చిట్టిమందారం తనలా కాకూడదు చదువుకొని అందరికి వెలుగునిచ్చేవిఙ్ఞాన దీపిక కావాలని
తన తల్లి ఇచ్చిన ఆత్మస్త్యైర్యం తో,తనకాళ్ళమీద నిలబడే శక్తిని సంపాదించి తన కన్నతల్లికి బహుమతిగ
ఆమె కోల్పోయిన వునికిని చట్టం ద్వారసాధించి ఆమె ముందువుంచింది ఆ నవతరపు”మందారం”
తన పడ్డ శ్రమకి,కష్టము వృధా కాలేదని తనబిడ్డ ఇప్పడు తనలాంటి ఎంతోమంది కి ఆసరాగా నిలిచిందని
తెలిసి ఆనందం తో మురిసిపోయింది ఆ “గెలిచిన తల్లిమందారం”!!!
Subscribe to:
Posts (Atom)