టీవీ లో చూపించిన ఒక యదార్ధ సంఘటన ఈ కవితకు ప్రేరణగా తీసుకొని రాసాను.
గెలిచిన మందారం : మణి వడ్లమాని 26/04/2013
అందాలతోటలో విరిసింది ఓ కన్నెమందారం!
కళ్ళనిండా మధురస్వప్నాలు ,మదినిండా తీయటి తలపులు
కొంగుల ముడివేసిన జీవనసహచరుడితో అడుగులోఅడుగు వేసుకుంటూ
కొత్తఆశలతో,కోటికోర్కేలతో ఆనందంగా మెట్టినింట అడుగుపెట్టింది!
కాని తన ఆశలుఅడియాస లేననీ,జీవితమంతా తోడువస్తాడు అనుకొన్న తనవాడే
కాటేసే కాలసర్పమని, తనుఅడుగుపెట్టిన ఈ కొత్త తోటలో అసలు పూలే లేవని
అన్ని ముళ్ళే వున్నాయని తెలిసి విస్తుపోయింది ఆ ముగ్ద మందారం!
తను జీవించి వున్నా తన వునికినే లేకుండా చేసినప్పుడు
ఇది అన్యాయమని,అక్రమమని ఆక్రోశించింది ఆ పగిలిన హృదయం
ఇంత పెద్ద లోకంలో తన అస్తిత్వాన్ని గుర్తించే వారేలేరా? అని అలమటించి పోయింది.
ఎవరు తనకి సాయపడరు, తోడుగా రారు అని గ్రహించి గుండె దిటవుచేసుకొని
పట్టుదలతో,దీక్షతో మొక్కవోని దైర్యంతో తన చిన్నారి చిట్టి మందారమే
తనకు కొండతబలం అని తెలిసికొని కష్టనష్టాలకు ఓర్చుకొంటూ ముందుకు సాగింది
జీవితమంతా పోరాడుతూ ఇన్ని రోజులు ఆ కన్నతల్లి ఒకటే ధ్యేయం తో పెంచింది తన చిన్నారిని
తన చిట్టిమందారం తనలా కాకూడదు చదువుకొని అందరికి వెలుగునిచ్చేవిఙ్ఞాన దీపిక కావాలని
తన తల్లి ఇచ్చిన ఆత్మస్త్యైర్యం తో,తనకాళ్ళమీద నిలబడే శక్తిని సంపాదించి తన కన్నతల్లికి బహుమతిగ
ఆమె కోల్పోయిన వునికిని చట్టం ద్వారసాధించి ఆమె ముందువుంచింది ఆ నవతరపు”మందారం”
తన పడ్డ శ్రమకి,కష్టము వృధా కాలేదని తనబిడ్డ ఇప్పడు తనలాంటి ఎంతోమంది కి ఆసరాగా నిలిచిందని
తెలిసి ఆనందం తో మురిసిపోయింది ఆ “గెలిచిన తల్లిమందారం”!!!
"ఆ తల్లికి భగవంతుడు ఇచ్చిన వర ప్రసాదం ఈ నవతరం మందారం"
ReplyDeleteటివి లో చూసిన సంఘటన కూడా మాతో షేర్ చేసుకోవాల్సిందండి మీరు
chaala bavundi
ReplyDelete