మిత్రులందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు
శిరాకదంబంవారు ప్రచురించిన ఈ నా ఆడియో ఉగాది సందేశం'విజయ వాణి' ఈ క్రింది లింక్ లో...
https://sites.google.com/site/siraakadambam/home/02_027
రావమ్మా! రా! విజయ వాసంతలక్ష్మీ !
ఇదే స్వాగతం ! శుభస్వాగతం!
నీ కోసం నీ రాక కోసం ఎదురు చూస్తున్న
ప్రతి ఆకు, ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ, హర్షాతిరేకం తో, ఊయలలు ఊగుతున్నాయి !
గున్నమావిళ్ళ చిగుళ్ళు తిన్న కొయిలమ్మలు, తీయగా గళమెత్తి పాడుతున్నాయి !
వసంత శోభతో విరిసిన ప్రతి పువ్వు నూతన కాంతితో, సొగసుల వన్నెలు చిందిస్తున్నాయి !
ఆమని సోయగాల మెరుపులతో వనమంతా, ఇంద్రధనస్సులా మెరిసిపోతోంది !
చిలకమ్మల ముద్దుపలుకుల సన్నాయి పాటలతో, నీకు స్వాగతం పలుకుతున్నాయి !
వాసంత విజయమా! మధుర తరంగ సుమభామినిలా భాసిల్లుతూ, విజయం చేయవమ్మా !
విజయ దుందుభులు మోగిస్తూ, విజయ కేతనం ఎగురవేస్తూ, విజయశంఖారావం పూరిస్తూ
విజయోత్సాహం తో, జగతినంతా చైతన్యం చేస్తూ , రావమ్మా! రా! విజయ వాసంతలక్ష్మీ !
ఈ భవ్య విజయ ఉగాది భావితాశల పునాదీ !
అది సకల జనావళికి తెలుపుతూ దీవెనలు అందజేయవమ్మా !
పూర్వ ఫల్గుణి గారు,ఇప్పుడే విన్నానండి. అభినందనలు మీకు!
ReplyDelete"విజయ దుంధుభులు మోగిస్తూ, విజయ కేతనం ఎగరవేస్తూ, విజయ శంకారావం పూరిస్తూ,విజయోత్సాహం తో, జగతినంతా చైతన్యం చేస్తూ, రావమ్మా! రా!విజయవాసంతలక్ష్మి!" చాలా బాగుందండి.
మీకు కూడా విజయ సంవత్సర శుభాకాంక్షలు
ఫల్గుణిగారూ కాస్తంత ఆలస్యంగా విన్నాను. విజయాభినందనలు!మీ కవితారచన అలరించిందండీ
ReplyDelete