.వాగ్దేవి కి కోపం వచ్చింది
అది బ్రహ్మ లోకం, బ్రహ్మ మాములుగా తన ధ్యానం లో వున్నాడు
.సరస్వతి దేవి బంగారు చాయ తో తెల్లటి వస్ర్తాలు ధరించి, పద్మాసనం లో కూర్చొని,వీణాపాణి,పుస్తక ధారిణి అయి నెమిలి,హంస పక్కనే వుండగా సామగానం చేస్తూ వుంటే మునులందరూ కూడా అ శారదాదేవిని కొనియాడుతూ కీర్తిస్తూ, సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి,విద్యారంభం కరిష్యామి అంటూ,జ్ఞాన్నాన్ని,తెలివిని,ము
వాక్కుని ప్రసాదించే అమ్మవు.ముగ్గరుమ్మల మూలపు అమ్మవ్వు ఆని వేనోళ్ళ ప్రస్టుతి చేయగా,
ఆ శారదాదేవి ప్రసన్నరాలు కాకా పోగా,చాల కోపం తో కన్నులు ఎర్రబారగా బ్రహ్మ వేపు చూస్తూ నాధా నేటి నుంచి నన్నుకొలవని ప్రజలందరినీ మూడులు గ ,వాక్సుద్ధి లేనివారిగా,తెలివిలేనివారిగా కమ్మనిశాపము ఇస్తున్నానని చెప్పింది. అందరు బ్ర్మహతో సహా తల్లి ఎందుకు నీ ఆగ్రహం ఈ సమస్తలోకాలు నీ కరుణ లేకుండా ముఖ్యం గ వాక్కు,తెలివి లేకపోతె అందరు అల్లాడిపోతారు తల్లి,కారణం లేకుండా ఆగ్రాహించకు అనగా.
"ఆవాగ్దేవిఇలా పలికింది! ఇది చూడండి ఆని భూలోకం లో ఒక నగరంలో ఆరోజు శుక్రవారం కావటం తో
అందరూ స్రీలు ఒక్క చోట చేరి లలితసహ్రసనామ పారాయణ మరియు లక్ష్నిస్తోత్రం ఇంకా వివిధ అష్థకములు చదివారు.దివ్యద్రిష్టితో అదిగో అని బ్రహ్మమొదలగు వారందరికీ చూపిస్తూ అందులో ఏ ఒక్కరైన నన్నుస్తుతించారా? అని ప్రశ్నవేసినది. లేదుకదా. వీరుందరూ విద్యవతులే అందరికి నేను కావాలి నా ద్వార వచ్చే చదువుకావాలి,వారివాస్వప్రయోజనా
అమ్మా వద్దూ వద్దూ , అంటూ పెద్దగా అరుస్తూ వుంటే మా వారువచ్చి ఏమోయి ఏమిటి అలా వద్దూ వద్దూ అంటూపలవరిస్తున్నావు అంటూనిద్రలేపారు.వెంటనే నాకొచ్చిన కలని ఆయనతో చెప్పాను, అప్పుడు అయన దానిదేముంది ఈవాళ నించి మీరందరు 'సరస్వతిదేవిని" కూడా పారాయణచెయ్యండి. ఎందుకు నీకుఆవిడ కలలో కనిపించిందో ఇది ఒక అందుకు మంచిదే అని అన్నారు. అదే మొన్న శ్రీవిద్య వాళ్ళఇంట్లో పారాయణరోజున పిల్లలు అడిగారు మమ్మీ చిన్నలిల్లలే సరస్వతిపూజ చెయ్యలా? మీరు చేయ్యక్కరలేదా అని. ఆ విషయంమనసులో వుండిపోయిదేమో! అది ఇలా కల రూపంలో వచ్చి వుంటుంది అని ,ఒకరకం గ ఇది మంచిదే మా
కళ్లు తెరిపించింది.తప్పకుండ ఈవాళ్ళనుంచి అందరం ఆ శారదదేవిని ఆ చదువుల తల్లిని కూడా కొలుస్తాం అనుకుంటూ దినచర్య ప్రారంబిచాను.
ఇది నమ్మండి నమ్మకపోండి కాని ఆ వాగ్దేవికి మాత్రం కోపం తెప్పించకండి!!!
ఇది నమ్మండి నమ్మకపోండి కాని ఆ వాగ్దేవికి మాత్రం కోపం తెప్పించకండి!!!
. జ్ఞ్యాపకములు
.
జ్ఞ్యాపకాలు లేని జీవితాలు మనం వుహించలేము. ఒక మనిషి జీవితంలో ఎన్నో,ఎన్నోన్నో జ్ఞ్యాపకాలు
నిజముగా అవన్నీ అక్షర నిక్షిప్తం చేస్తే కొన్ని లక్షల కోట్లలో పుస్తకాలూ ఉండేవేమో అన్న ఒక చిత్రమైన వుహ.
ఆ ఆలోచనలోంచి .కొన్ని జ్ఞ్యాపకాలు.
ఆంధ్ర షెల్లీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన అరుదయిన జ్ఞ్యాపకం
"ప్రేయసి, ప్రేయసి, ! ప్రియుడనే ప్రేయసి!
వేయి కన్నులు దాల్చి వెదుకుచున్ననే!
దేవులపల్లి వేకంట కృష్ణశాస్త్రి
అని ప్రేయసి ని వెదుకుచున్న కవి హృదయం అది
అంతటి మహాకవిని చూసిన నాకన్నులు ఎంత భాగ్యం చేసుకున్నాయో కదా!
అ నాటి సంగతి, చిన్నదే కానీ చాల గొప్పది ఈ నాటి సాహితి మిత్రులోతో అది పంచుకుందామని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ని నేను
నా చిన్నతనంలో బహుశ నాకు
పది ,పదకొండు సం ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ ఒక
నా చిన్నతనంలో బహుశ నాకు
పది ,పదకొండు సం ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ ఒక
కాలేజీ ప్రినిసిపాల్ గారు వుండేవారు పేరు సరిగా గుర్తు లేదు సీతారామరావు గారు అన్నట్లు జ్ఞ్యాపకం.
ఇప్పుడు ,ఇక్కడ మానాన్నగారి గురించి కొంత
చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష చాలవుండేది.మా నాన్నగారి గురువు పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం గురుంచి అందులో ఉద్యోగపర్వం గురుంచి తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వచ్చారు. అ విషయం మా నాన్నగారి
చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష చాలవుండేది.మా నాన్నగారి గురువు పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం గురుంచి అందులో ఉద్యోగపర్వం గురుంచి తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వచ్చారు. అ విషయం మా నాన్నగారి
కి ముందే .చెప్పారు.నాన్నగారి తో పాటు నేను కూడా వెళ్ళాను , మా నాన్నగారు
ఆయనకి నమస్కారం చేసారు నాకు లీలగా గుర్తు వుంది ఆయన రూపం తల్లటి
మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు. తెల్ల అంతే అంతకు మించి గుర్తు లేదు. కానీ అప్పటికే ఆ మహాకవి గొంతు మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు అంతే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు. తెల్ల అంతే అంతకు మించి గుర్తు లేదు. కానీ అప్పటికే ఆ మహాకవి గొంతు మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు అంతే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
అంతటి మహానుభావుడిని చూసాను అదే ఒక పెద్ద రివార్డ్ అని తరువాతతెలిసింది
ఇది నాకు ఒక అరుదయిన ఎంతో జ్ఞ్యాపకం .,విలువయిన జ్ఞ్యాపకం.
సరస్వతీ మయం దృష్ట్యా
ReplyDeleteవీణా పుస్తక ధారిణీం
హంసవాహ సమాయుక్తా
విద్యా దానకరీ మమ
ప్రధమం భారతీ దేవి
ద్వితీయం సరస్వతీ
తృతీయం శారదాదేవి
చతుర్ధం హంసవాహినీం
పంచమం జగతీఖ్యాతా:
షష్ఠం వాగీశ్వరీ తధా కుమారీ
సప్తమం ప్రోక్తా
అష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధి ధాత్రీచ:
దశమం వరదాయినీ
ఏకాదశే క్షుద్రఘంటే
ద్వాదశం భువనేశ్వరీ
బ్రాహ్మీ ద్వాదశి నామాని త్రిసంధ్యం య:పఠేన్నిత్యం
సర్వ సిద్ధి కరీ తస్య ప్రసన్న పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ
ఇతి: శ్రీ సరస్వతి ద్వాదశి నామం సంపూర్ణం
(ఒక బ్లాగరున్నాడు. వాడు రోజూ ఇది చదువుతాడని ఆవిడకి చెప్పండి. పాపం ఆవిడ కోపం కొంచమైనా తగ్గుతుంది :) )
శంకర్ గారు! చాల బాగా సమాధానం ఇచ్చారు.
ReplyDeleteమీరు బాగా సంస్క్రుతాంధ్రలు చదవుకున్నవారిలావున్నారు
మీ పరిచయం నిజంగా దారానికి పూలవాసన అబ్బినట్లే!!