Saturday, February 26, 2011

జ్ఞ్యాపకములు


జ్ఞ్యాపకములు


ఆంధ్ర షెల్లీ  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన  జ్ఞ్యాపకం
అసలు జ్ఞ్యాపకాలు లేని జీవితాలు  మనం వుహించలేము. ఒక మనిషి జీవితంలో  ఎన్నో,ఎన్నోన్నో జ్ఞ్యాపకాలు
నిజముగా అవన్నీ అక్షర నిక్షిప్తం చేస్తే    కొన్ని లక్షల కోట్లలో పుస్తకాలూ ఉండేవేమో అన్న ఒక చిత్రమైన వుహ. అలాంటి  మరపురాని అమూల్యం అయిన ఒక జ్ఞ్యాపకం





తొలి వియోగిని నేనే!

తొలి ప్రేయసిని నేనే!
ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!!! .......    అది తను సృష్టించుకున్న ప్రేయసి ఊర్వశి నుంచి
కవి!భావకవి!మనవాడు! మనతెలుగువాడు!ప్రపంచం మొత్తం గర్వించ తగిన మహానుభావుడు!!!!!!       
అంతటి మహాకవిని  నేను కలిసాను అని తలుచుకుంటే చాల గర్వం గా అనిపిస్తుంది.
ఎప్పుడో నా చిన్ననాటి సంగతి, చిన్నదే కానీ చాల గొప్పది అది ఈ నాటి సాహితి మిత్రులోతో పంచుకుందామని,
 దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ని నేను  నా చిన్నతనంలో బహుశ  నాకు   పది ,పదకొండు సం  ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ  ఒక కాలేజీ ప్రినిసిపాల్ గారు వుండేవారు బహుసా P.R. College  అనుకుంట ఆయన
పేరు కూడా సరిగా  గుర్తు లేదు సీతారామరావు గారు అన్నట్లు  లీలగాజ్ఞ్యాపకం. ,ఇక్కడ మానాన్నగారి గురించి  కొంత చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష  చాలవుండేది.మా నాన్నగారి  గురువు  పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం  గురుంచి అందులో ఉద్యోగపర్వం  గురుంచి  తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద  అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి  శ్రీ  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి  వచ్చారు. అ విషయం మా నాన్నగారికి ముందే .చెప్పారు.నాన్నగారి  తో పాటు  నేను కూడా    వెళ్ళాను , మా నాన్నగారు ఆయనకి  నమస్కారం  చేసారు       నాకు  లీలగా గుర్తు  వుంది  ఆయన రూపం తెల్లటి మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు.  అంతే  అంతకు మించి గుర్తు లేదు.  కానీ అప్పటికే  ఆ మహాకవి  గొంతు  మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు ,అలాగే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
అంతటి మహానుభావుడిని  చూసాను  అదే ఒక  పెద్ద  రివార్డ్ అని తరువాతతెలిసింది
 ఇది నాకు  ఒక  అరుదయిన  ఎంతో  విలువయిన   జ్ఞ్యాపకం.
  



3 comments:

  1. అంతటి మహా కవిని ప్రత్యక్షంగా చూసిన మీరు ధన్యులు.

    అన్నట్టు మీది కాకినాడా? కెవ్వ్వ్వ్వ్వ్వ్ ......
    అయితే మీరు నా ఈ పోస్ట్ చదివి తీరాల్సిందే
    http://blogavadgeetha.blogspot.com/2010/06/blog-post_12.html

    ReplyDelete
  2. అరె! వహ్వా! మీరు online లో నే వున్నారా! thank u andi కాకినాడ లో చాల చిన్నప్పుడు వుండేవాళ్ళం.
    మీ బ్లాగ్ లు ఆన్ని చదివి నా స్పందన తెలియ చేస్తాను

    ReplyDelete
  3. అన్నిటి కంటే మీ బ్లాగ్ లో నాకు చాలబాఆఆఆఆఆఆఆఆఆగ నచ్చినది అరుదైనవి...అపురూపమైవి.

    కొన్ని ఆనుభూతులు మనకే వున్నాయి అని ఒక చిన్నపాటి గర్వం వుంది చూసారు!అది
    కాస్త చక్కా యెగిరి పోయింది. మీ బ్లాగ్ చూసాక!
    అలాగే నా లాగే ప్రతి చిన్న ఆనుభూతి ని అనుభవించి ఆనందిచే వారు వున్నారని సంతోషం గ కూడా
    వుంది

    ReplyDelete