ఉదయభానుడి లేలేత కిరణాల స్పర్శ నును వెచ్చగా
తాకుతోంది
అప్పడే
విచ్చిన ఎఱ్ఱని మందారం తూర్పుదిక్కు తో పోటిపడుతోంది
జగతినంతా
మేలుకొలుపుతూ ఆకాశం ఉదయరాగం పాడుతోంది
మంచు
మేలిముసుగు తొలగించి ప్రకృతి ఆకుపచ్చని చీరచుట్టింది
పక్షులు
కిలకిలతో కోయిల కుహుకుహులతో భూపాలరాగం జతకట్టింది
ఉషోదయం,
ఉషోదయం సమస్త జగతి కి శుభోదయం, శుభోదయం!!