ఉదయభానుడి లేలేత కిరణాల స్పర్శ నును వెచ్చగా
తాకుతోంది
అప్పడే
విచ్చిన ఎఱ్ఱని మందారం తూర్పుదిక్కు తో పోటిపడుతోంది
జగతినంతా
మేలుకొలుపుతూ ఆకాశం ఉదయరాగం పాడుతోంది
మంచు
మేలిముసుగు తొలగించి ప్రకృతి ఆకుపచ్చని చీరచుట్టింది
పక్షులు
కిలకిలతో కోయిల కుహుకుహులతో భూపాలరాగం జతకట్టింది
ఉషోదయం,
ఉషోదయం సమస్త జగతి కి శుభోదయం, శుభోదయం!!
ఎంత అందంగా "Good Morning " చెప్పారో! మీకు కూడా శుభోదయం.
ReplyDeleteఏంతో వెతికానండి అంధ్రభూమి weekly online version ఉందేమో అని మీ కథ చదువుదామని. దొరకలేదు. ఫ్రెండ్ ని స్కాన్ చేసి పంపమన్నాను. పంపిన వెంటనే చదివి నేను అభిప్రాయం తెలుపుతాను.
పూర్వ ఫల్గుణి గారు, మీ ఇమైల్ నాకు నా బ్లాగ్ లొ ఇవ్వండి. నేను మీకు వెంటనే ఇమైల్ పంపుతాను.
ReplyDelete