Sunday, March 3, 2013

విరిసిన మందారం!!








పూచింది పూచింది ఆ తోటలోన జంటమందారం
ఆకాశంలోని సూర్యబింబం తో పోటి పడుతూ ఎర్రమందారం
సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్ళతో పదహారేళ్ళపడచు కన్నెమందారం
ప్రియుని ఆగమనం కోసం వేచి వున్న ముగ్ధమందారం 
ఉదయరాగం ఆలపిస్తూ,కనువిందు చేసే సోయగాలపరువపు మందారం
పచ్చటి ఆకులమధ్య విచ్చిన కన్నుల తో కోటిఆశల నడుమ విరిసిన మందారం!!

1 comment:

  1. పచ్చటి ఆకులమధ్య విచ్చిన కన్నుల తో కోటిఆశల నడుమ విరిసిన మందారం!!

    baagundandi lovely.. పూర్వఫల్గుణి గారూ...

    ReplyDelete