Thursday, January 5, 2012

నా ముక్కోటి ముచ్చట్లు


నా ముక్కోటి ముచ్చట్లు
ఓం నమో నారాయణాయ!!!!



ముక్కోటిగురుంచి ముచ్చట గ   పేరూరు.అమలాపురం దగ్గర మా తాత
గారి వూరు ఆలాగే మాపెద్ద దొడ్డ(చిలకమ్మగారు),పెద్దనాన్నగారు వాళ్ళ ముక్కోటి కొన్ని
ఏళ్ళ నుంచి చేస్తూవుండేవారు.
 ఇంకా భజన అంటే కర్ర కృష్ణమూర్తి గారే అనిచెప్పుకునేవారు దేవుడిగుళ్ళోభజన,చాలబావుంటుంది,పెద్దనాన్నగారు లక్ష్మణ మూర్చ పాడుతూవుంటే అందరకి ఆరాముడే కళ్ళకి కనిపించే వాడుట.రాత్రితెల్లవార్లూ భజన్ కార్యక్రమం అయ్యాక మరునాడు దేవుడి గుళ్ళో అందరకి బోజనాలు!!! వావ్
ఎంతబావుంటుంది కదా!!

ఇంత మంచి కార్యక్రమన్ని మేమూ పాలుపంచుకున్నాం కదా
అని ఎంతో గొప్పగా అనిపిస్తుంది మాకు

ఇంకా అదే ఉత్సహం తోమా దొడ్డమ్మ గారిఅమ్మాయిలు(వాళ్ళు పదిమంది ఆడపిల్లలు కాని
మొక్కవోని ధైర్యవంతులు) జరిపిస్తున్నారు.


ఇంకో ముక్కోటి  ముచ్చట మా తాతగారు మా నాన్నగారి తండ్రి పెరి సూర్యనారయణమూర్తి గారు ముక్కోటి ఏకాదశి రోజున   ఈ
లోకం విడిచివెళ్లారు ఇంచుమించుగా 70 ఏళ్ళ క్రితం. ఒక్కసారి ఆయన్ని తలచుకొని మెముచూడని మా  తాతగారు ఆశిస్సులు మాకు ఎప్పుడు
 వుండాలని




2 comments:

  1. ఈ రోజు ఎక్కడ ఉన్నారు2012ఈ ముక్కొటి విశేశాలు ఏవిటి

    ReplyDelete
  2. కారణాంతలవాల్ల నేను మా దొడ్డమ్మ గారి ఊరు వెళ్ళడం జరగలేదు. ప్రతి ఏడాది లాగే ఈ సం కూడా రాత్రితెల్లవార్లూ భజన కార్యక్రమం వుంది మరునాడు దేవుడి గుళ్ళో అందరకి బోజనాలు!!! ఈ మాటు వాళ్ళ మనవలు అందరు దగ్గరుండి జరిపిస్తున్నారు. మీరు అడగి తెలిసుకున్నందుకు ధన్యవాదాలు.

    శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ఆయనను దర్శనం చేససుకొంటే సమస్త పాపాలు తొలిగి పోతాయని పెద్దలు చెబుతారు.

    శ్రీ మహావిష్ణువు షోడశనామస్తుతి

    ఔషధే చింతయే ద్విష్ణుం భోజనే చ జనార్ధనమ్,
    శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్.

    యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ ప్రజాపతిమ్,
    నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే.

    దుస్స్వస్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్,
    కాననే నారసింహం చ పావకే జలశాయినమ్.

    జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్,
    గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవమ్.

    షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్,
    సర్వపాప వినిర్ముక్తో విష్ణు లోకే మహీయతే.

    ReplyDelete