ఈ వారం నవ్యలో( 06/06/2012)గంధం యాజ్ఞవల్క్యశర్మగారి "చదువు' కద చాల బావుంది.కార్పోరేట్ కభందహస్తాలలో పిల్లలు ఎలాచిక్కుకు పోతున్నారో చాల విపులం గ వివరంగ రాసారు. పెద్దవాళ్ళుఆలోచనా విధానం కూడా ఎలా మారుపులు చెందాయో కూడా రాసారు.
అంతా పోటి! ఆ పోటిలలో మన పిల్లలు వుండాలి లేకపోతె వాళ్ళని తక్కువ చేస్తారేమో అనిమాత్రమే ఆలోచిస్తున్నాం కాని వాళ్ళ మీద యెంత వత్తిడి తెస్తున్నాం అది ఆ చిన్ని మనసులు తట్టుకోగలవా అనే విచక్షణ మనం కోలుపోతున్నాం. దాని కి తోడూ చిన్నకుటుంబాలు అవడం తో పెద్దవాళ్ళు లేకపోవడం వెరసి కౌన్సెలింగ్ సెంట్రేర్లు వెలుస్తున్నాయి కాని దాని వల్ల ప్రయోజనం అంతంత మాత్రమే.
ఈ కధలో మాత్రం తాతగారు ముఖ్యపాత్రవహించి తన మనవడు భాద్యతని స్వీకరించి ఆతని మనసెరిగి అతనికి నచ్చిన చదువు ని ఎంచు కోవడానికి తగిన స్వతంత్రం,ఆలోచన కలగచేస్తాడు.
చాల బావుంది! ఈ రచయిత దే ఒక నవల కూడా వుంది పేరు మర్చిపోయాను. అప్పట్లో ట్యుటోరియల్ కాలేజీ గురుంచి.రాసారు. అది ఏమస్కో వారి ముద్రణ. ఇంచుమించు గ ఇదే కదావస్తువు. కాని పిల్లల గురుంచి కాదు.చదువు చెప్పే మాస్టర్స్ గురుంచి.
ఏది ఏమియినా ఈ నాటి విద్యవిదానం,తల్లితండ్రుల దృక్పధం లోకూడా మార్పు రావాలని రచయత భావం.
Andhra jyothy website lo Latest edition 30/5/2012 edition navya undi. Bahusaa next edition lo undochu meeru cheppina katha.
ReplyDeleteYeah! idi 06/06/2012 issue lo publish ayyindi.
Deleteకథ ఈ రోజే చదివానండి! చాలా బాగుంది. అందరం ఇంచు మించుగా ఏ దేశం లో ఉన్న ఇలాగే కొట్టుమిట్ట్లాడుతున్నాము.
DeleteAmma super!
ReplyDelete