Sunday, January 30, 2011

మనవాళ్ళు


నిన్న అనగా 27 /01  / 2011  శ్రీ త్యాగరాయ గాన సభ లో కళాసుబ్బారావు వేదిక లో లేఖిని వారి సహకారము తో  భానుమతి గంటి గారి  పుస్తకావిష్కరణ జరిగింది. అంతమంది   రచయత్రిలని చూడగానే ఒక్కసారి మళ్ళితెలుగు మహిళా రచయత్రిలు శకము మొదలయందేమో అన్నట్లు గా అనిపించింది.ఒక పాఠకురాలి  గా    నాస్పందనని మీ అందరితో  పంచుకుందామని .ఇంతకు
ముందు మన ద్రావిడలలో  రచయత్రిలు  అతికొద్ది మంది మాత్రమే వుండేవారు. కానీ నిన్న సభలో చూసిన తరువాత  చాల ఆనందం
వేసేంది. ఇద్దరు భానుమతి ద్వయం . ఇద్దరు ఇద్దరే  .<span>మనవాళ్ళు</span> ఆలా అందరిచేత  పొగడబడడము మాములు
 విషయము కాదు.వారిలో ఎంతో వస్తువు దాగివుంది. కధలు అన్ని చాల సామజికసృహతో రాసినవి,.ఎంతో ప్రామాణికం గ వున్నవి
కధలు గానీ  ,నవలలు గానీ మన చుట్టూవున్న సమాజాన్నిచూసి రాసినవే. పాత్రలుకూడా అన్నితెలిసినట్లు వుంటాయి
ఇవన్నికూడాజీవితాలనించి .వచ్చినివే. అందుకే అవి అంత సహజముగా వున్నాయి.
ఇద్దరుభానుమతి లకు(మంథ&గంటి) గాని, పప్పు అరుణ గానీ వీరికంటే ముందుతరము వారు,గంటి వెంకటరమణ,.వేదుల శకుంతల  గారు అందరూ మనవాళ్ళు. అందరు ఎన్నో రచనలు చేసినవారు

 అందరికీ శుభాబినందనములు

Tuesday, January 25, 2011

మనమంతా భారతీయులం

.  అందరకి   62  వ గణతంత్ర దిన శుభాకాంక్షలు.
 మన దేశము ఆన్ని మతముల వారిని సమానముగా చూస్తూంది.
 మనగుణము .పరమతసహనము.
ఎన్నో మతాలు ,విభిన్న సంశ్ర్కృతులు. అయిన ఒక్క తాటి మీద కట్టేసే మాట
మనమంతా  భారతీయులం ,మన అందరి జాతి ఒక్కటే.
జైహింద్

Very heart touching one , you feel the real  Patriotism
The Silent Indian National Anthem
http://www.youtube.com/
















































Thursday, January 13, 2011

అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు

అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!!!

భోగి పండగ అనగానే  ముందు చిన్నతనము గుర్తుకొస్తుంది ,వెంటనే  భోగిమంటలు గుర్తుకొస్తాయి,ఆ తరువాత పిండివంటలు గుర్తుకొస్తాయి ఆన్నికంటే ముందుగ
మా నాన్నమ్మ గుర్తుకొస్తారు. నాన్నమే కాదు మా చిన్ననాన్నమ్మకూడా గుర్తుకొస్తారు.ఆప్పట్లో నాన్నమ్మ వాళ్ళు జుట్టు ఆది లేకుండా తెల్ల మల్లు పంచెలు కట్టుకొని వుండే వారు.
మేము కాకినాడ లో వున్నప్పుడు చాల బాగా ఎంజాయ్ చేసాము ప్రతి పండుగని మా చెల్లలు ముగ్గులో పోటి పడేది నేను గొబ్బిళ్లు పెట్టడము లో ను బంతి చెట్లు పెంచడము లోను కూడా.
ఆది ముందు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టడదము ,తరువాత ఇద్దరమూ కల్సి గొబ్బిళ్ళు  పెట్టడము. అమ్మ ప్రసాదము చేసిది. తరువాత ఆందరుము కలిసి గొబ్బిళ్ళు చుట్టూ తిరుగుతో గొబ్బి
పాటలు పడే వాళ్ళము ఆలా అందరి ఇళ్ళలో ఒక రోజు ఫిక్స్ చేసుకునే .వాళ్ళము. ఇంకా భోగి రోజున తెల్లవారుజామునే లేచి భోగి మంటలోకి మా గొబ్బిదండలు+ పాత కర్ర సామాను. వేసేవాళ్ళము
తమ్ముళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు . అందుకే నాన్నగారు వాల్లిద్దరని లేపి తీసుకోచ్చేవారు  ఆతరువాత ఇంకా తలంట్లు కార్యక్రం ఆది కుంకుడుకాయల తో  ఆది కళ్ళలో పడి పెద్ద హడావుడి
.అప్పుడు తిండిమీద ధ్యాస కంటే ఆటల మీద ధ్యాస ఆంతాను. ఆలా ప్రతి పండగను ఎంజాయ్ చేసే వాళ్ళము.

అవిఆన్ని ఇప్పుడు  చేసుకోవడాని కాలమాన పరిస్థితిలు సహకరించటం లేదు

అయిన కొంతమంది ఇంకా సంప్రదాయాల మర్చిపోకుండా ఉండడము కోసము. వాళ్ళ వంతు
ప్రయత్నాలు వాళ్ళు చెస్తూన్నరు..

లాస్ట్   వీక్ లో నేను రాజముండ్రి వెళ్ళాను. అక్కడనుంచి పొద్దునే మా అత్తయ్య నేను గొల్లల మామిడాడ వెళ్ళాము,అబ్బ!ఆ ప్రక్రుతి అందాలు చూస్తూ వుంటే రెండు కళ్ళు చాల్లవనిపించింధీ వో పక్క గోదావరి ఇంకో పక్కన 
ఆకుపచ్చటి పంట చేలు వంశీ గారు,బాపు,కే.విశ్వనాథ్గారు .గుర్తోచ్చేసారు. ఇంకా "ఆయెండి,ఆయెండి"అంటూ గోదావరి యాస   మాటలు, కడియపు లంక దగ్గర ఆ పూల రాసులు చూస్తె  మనసు అంతా   ఆనందనుభుతి తో నిండి పోయింది

ఈ  భోగి పండుగ అందరికీ  చక్కటి  ఆనందము ,సంతోషము,అనుభవాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మరొక్కమారు


అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!

Wednesday, January 12, 2011

సంక్రాంతి శోభ

 సంక్రాంతి శోభ
వచ్చింది ,వచ్చింది
.సంక్రాంతి పండగ వచ్చింది,  
కొత్త చెరుకుగడ తీపి రుచిని ఆన్దిచింది
 గాదెల నిండా ధాన్య రాసులుని నింపింది
హరిదాసుల కీర్తనలు, డుడుబసవన్నల రాగాలని వినిపించింది
అందమైన రంగవల్లుల్ని ఇంటిముందు తీర్చిదిద్దింది
  ఆ రతనాల ముగ్గులో వున్న,  ఆ గొబ్బిళల లో   బంతి,చేమంతి పూల తో ,సంక్రాంతి(పౌష్య)లక్ష్మి
అందముగా కుర్చోనివుంది
అందరి కి సక్రాంతి పండుగశోభని,  సంబరాలని తెచ్చింది
వచ్చింది ,వచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది!

MY Life(Naa Jeevatam): 148th Birth Anniversary of Swami Vivekananda

MY Life(Naa Jeevatam): 148th Birth Anniversary of Swami Vivekananda: ". ఈ రోజు స్వామి వివేకానంద పుట్టినరోజు. On the eve of Swami Vivekananda's Birthday 148th Birth Anniversary of Swami Vivekananda C..."

148th Birth Anniversary of Swami Vivekananda

. ఈ రోజు స్వామి వివేకానంద పుట్టినరోజు. On the eve of Swami Vivekananda's Birthday 

Swami Vivekananda quotes

148th Birth Anniversary of Swami Vivekananda


Come out into the universe of Light. Everything in the universe is yours, stretch out your arms and embrace it with love. If you every felt you wanted to do that, you have felt God.