అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!!!
భోగి పండగ అనగానే ముందు చిన్నతనము గుర్తుకొస్తుంది ,వెంటనే భోగిమంటలు గుర్తుకొస్తాయి,ఆ తరువాత పిండివంటలు గుర్తుకొస్తాయి ఆన్నికంటే ముందుగ
మా నాన్నమ్మ గుర్తుకొస్తారు. నాన్నమే కాదు మా చిన్ననాన్నమ్మకూడా గుర్తుకొస్తా రు.ఆప్పట్లో నాన్నమ్మ వాళ్ళు జుట్టు ఆది లేకుండా తెల్ల మల్లు పంచెలు కట్టుకొని వుండే వారు.
మేము కాకినాడ లో వున్నప్పుడు చాల బాగా ఎంజాయ్ చేసాము ప్రతి పండుగని మా చెల్లలు ముగ్గులో పోటి పడేది నేను గొబ్బిళ్లు పెట్టడము లో ను బంతి చెట్లు పెంచడము లోను కూడా.
ఆది ముందు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టడదము ,తరువాత ఇద్దరమూ కల్సి గొబ్బిళ్ళు పెట్టడము. అమ్మ ప్రసాదము చేసిది. తరువాత ఆందరుము కలిసి గొబ్బిళ్ళు చుట్టూ తిరుగుతో గొబ్బి
పాటలు పడే వాళ్ళము ఆలా అందరి ఇళ్ళలో ఒక రోజు ఫిక్స్ చేసుకునే .వాళ్ళము. ఇంకా భోగి రోజున తెల్లవారుజామునే లేచి భోగి మంటలోకి మా గొబ్బిదండలు+ పాత కర్ర సామాను. వేసేవాళ్ళము
తమ్ముళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు . అందుకే నాన్నగారు వాల్లిద్దరని లేపి తీసుకోచ్చేవారు ఆతరువాత ఇంకా తలంట్లు కార్యక్రం ఆది కుంకుడుకాయల తో ఆది కళ్ళలో పడి పెద్ద హడావుడి
.అప్పుడు తిండిమీద ధ్యాస కంటే ఆటల మీద ధ్యాస ఆంతాను. ఆలా ప్రతి పండగను ఎంజాయ్ చేసే వాళ్ళము.
అవిఆన్ని ఇప్పుడు చేసుకోవడాని కాలమాన పరిస్థితిలు సహకరించటం లేదు
అయిన కొంతమంది ఇంకా సంప్రదాయాల మర్చిపోకుండా ఉండడము కోసము. వాళ్ళ వంతు
ప్రయత్నాలు వాళ్ళు చెస్తూన్నరు..
లాస్ట్ వీక్ లో నేను రాజముండ్రి వెళ్ళాను. అక్కడనుంచి పొద్దునే మా అత్తయ్య నేను గొల్లల మామిడాడ వెళ్ళాము,అబ్బ!ఆ ప్రక్రుతి అందాలు చూస్తూ వుంటే రెండు కళ్ళు చాల్లవనిపించింధీ వో పక్క గోదావరి ఇంకో పక్కన
ఆకుపచ్చటి పంట చేలు వంశీ గారు,బాపు,కే.విశ్వనాథ్గారు .గుర్తోచ్చేసారు. ఇంకా "ఆయెండి,ఆయెండి"అంటూ గోదావరి యాస మాటలు, కడియపు లంక దగ్గర ఆ పూల రాసులు చూస్తె మనసు అంతా ఆనందనుభుతి తో నిండి పోయింది
ఈ భోగి పండుగ అందరికీ చక్కటి ఆనందము ,సంతోషము,అనుభవాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మరొక్కమారు
అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!
No comments:
Post a Comment