నిన్న అనగా 27 /01 / 2011 శ్రీ త్యాగరాయ గాన సభ లో కళాసుబ్బారావు వేదిక లో లేఖిని వారి సహకారము తో భానుమతి గంటి గారి పుస్తకావిష్కరణ జరిగింది. అంతమంది రచయత్రిలని చూడగానే ఒక్కసారి మళ్ళితెలుగు మహిళా రచయత్రిలు శకము మొదలయందేమో అన్నట్లు గా అనిపించింది.ఒక పాఠకురాలి గా నాస్పందనని మీ అందరితో పంచుకుందామని .ఇంతకు
ముందు మన ద్రావిడలలో రచయత్రిలు అతికొద్ది మంది మాత్రమే వుండేవారు. కానీ నిన్న సభలో చూసిన తరువాత చాల ఆనందం
వేసేంది. ఇద్దరు భానుమతి ద్వయం . ఇద్దరు ఇద్దరే .<span>మనవాళ్ళు</span> ఆలా అందరిచేత పొగడబడడము మాములు
విషయము కాదు.వారిలో ఎంతో వస్తువు దాగివుంది. కధలు అన్ని చాల సామజికసృహతో రాసినవి,.ఎంతో ప్రామాణికం గ వున్నవి
కధలు గానీ ,నవలలు గానీ మన చుట్టూవున్న సమాజాన్నిచూసి రాసినవే. పాత్రలుకూడా అన్నితెలిసినట్లు వుంటాయి
ఇవన్నికూడాజీవితాలనించి .వచ్చినివే. అందుకే అవి అంత సహజముగా వున్నాయి.
ఇద్దరుభానుమతి లకు(మంథ&గంటి) గాని, పప్పు అరుణ గానీ వీరికంటే ముందుతరము వారు,గంటి వెంకటరమణ,.వేదుల శకుంతల గారు అందరూ మనవాళ్ళు. అందరు ఎన్నో రచనలు చేసినవారు
అందరికీ శుభాబినందనములు
No comments:
Post a Comment