వెన్నెలదారి venneladaari: ఒంటరిగా......
వర్మగారూ! ఇంచుమించుగా ఇదే భావాలూ తో నేను రాద్దామని అనుకున్నాను. అదేదో టెలిపతి లా మీరు అందుకొనిరాసారు . ప్రపంచం లో మనిషిని పోలిన మనషులు వున్నట్లు భావ సామీప్యం కూడా వుంటుందని నేను ,ప్రిన్స్ గారు కూడా అనుకోకుండా ఒకలాస్పందిచాము
చాలబావుంది
నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని. నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని, ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు " చలం
Wednesday, June 27, 2012
Saturday, June 23, 2012
వర్మగారు,మీ కవిత చాలబావుంది
వర్మగారు,మీ కవిత చాలబావుంది
తలపుల టపా లోని అక్షరాలు వెన్నెల ధార ని పానం చేసి కవితామృతాన్నిచవి చూపించాయి.
ఆ అమృతధారలో తడిసి ముద్దయ్యి నా మానసం విహంగం లా ఎక్కడికో సుదూర తీరాలకు సాగిపోతోంది
.......ఫల్గుణిhttp://venneladaari-v.blogspot.in/
Thursday, June 7, 2012
గొప్ప అనువాద నవల" యాజ్ఞసేనిని" గురుంచి నవలా పరిచయం
బ్లాగర్ మిత్రులందరికీ ,
నేను చదివిన ఒక గొప్ప అనువాద నవల 'యాజ్ఞసేని 'ని గురుంచి నవలా పరిచయం "
శిరాకదంబం అంతర్జాల పత్రిక లోని సాహిత్యం శీర్షిక పేజి లో ప్రచురితం అయినది.
ఇది సాహితి అభిమానులందరి తో పంచుకోవాలని ఒక చిన్న ఆశ .
విపులం గ ఈ క్రింది లింకులో చదవండి
https://sites.google.com/site/siraakadambam/literature/yajnaseninavalaparicayam-manivadlamani(పూర్వఫల్గుణి)
పూర్వఫల్గుణి
నేను చదివిన ఒక గొప్ప అనువాద నవల 'యాజ్ఞసేని 'ని గురుంచి నవలా పరిచయం "
శిరాకదంబం అంతర్జాల పత్రిక లోని సాహిత్యం శీర్షిక పేజి లో ప్రచురితం అయినది.
ఇది సాహితి అభిమానులందరి తో పంచుకోవాలని ఒక చిన్న ఆశ .
విపులం గ ఈ క్రింది లింకులో చదవండి
https://sites.google.com/site/siraakadambam/literature/yajnaseninavalaparicayam-manivadlamani(పూర్వఫల్గుణి)
పూర్వఫల్గుణి
Wednesday, May 30, 2012
గంధం యాజ్ఞవల్క్యశర్మగారి "చదువు' కద
ఈ వారం నవ్యలో( 06/06/2012)గంధం యాజ్ఞవల్క్యశర్మగారి "చదువు' కద చాల బావుంది.కార్పోరేట్ కభందహస్తాలలో పిల్లలు ఎలాచిక్కుకు పోతున్నారో చాల విపులం గ వివరంగ రాసారు. పెద్దవాళ్ళుఆలోచనా విధానం కూడా ఎలా మారుపులు చెందాయో కూడా రాసారు.
అంతా పోటి! ఆ పోటిలలో మన పిల్లలు వుండాలి లేకపోతె వాళ్ళని తక్కువ చేస్తారేమో అనిమాత్రమే ఆలోచిస్తున్నాం కాని వాళ్ళ మీద యెంత వత్తిడి తెస్తున్నాం అది ఆ చిన్ని మనసులు తట్టుకోగలవా అనే విచక్షణ మనం కోలుపోతున్నాం. దాని కి తోడూ చిన్నకుటుంబాలు అవడం తో పెద్దవాళ్ళు లేకపోవడం వెరసి కౌన్సెలింగ్ సెంట్రేర్లు వెలుస్తున్నాయి కాని దాని వల్ల ప్రయోజనం అంతంత మాత్రమే.
ఈ కధలో మాత్రం తాతగారు ముఖ్యపాత్రవహించి తన మనవడు భాద్యతని స్వీకరించి ఆతని మనసెరిగి అతనికి నచ్చిన చదువు ని ఎంచు కోవడానికి తగిన స్వతంత్రం,ఆలోచన కలగచేస్తాడు.
చాల బావుంది! ఈ రచయిత దే ఒక నవల కూడా వుంది పేరు మర్చిపోయాను. అప్పట్లో ట్యుటోరియల్ కాలేజీ గురుంచి.రాసారు. అది ఏమస్కో వారి ముద్రణ. ఇంచుమించు గ ఇదే కదావస్తువు. కాని పిల్లల గురుంచి కాదు.చదువు చెప్పే మాస్టర్స్ గురుంచి.
ఏది ఏమియినా ఈ నాటి విద్యవిదానం,తల్లితండ్రుల దృక్పధం లోకూడా మార్పు రావాలని రచయత భావం.
Thursday, May 10, 2012
మాతృమూర్తి "రాధ"
బ్లాగర్ మిత్రులందరికీ
మాతృదినోత్సవ సందర్భం గా నా మదిలో కలిగిన భావాలకి అక్షర రూపం
శిరా కదంబం అంతర్జాల పత్రికలో "సాహిత్యం పేజి లో 'మాతృమూర్తి "రాధ" గురుంచి చిన్న వ్యాసం ప్రచురించారు.
చదివి మీ అభిప్రాయం తెలుపగలరు
http://sirakadambam.blogspot.in
Thursday, May 3, 2012
వెన్నెల ధార
నా కవితను ప్రచురించిన "కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు .
వెన్నెల ధార
వెన్నెల ధార! !
జగతి
అంతా కురిసే వెండి వెన్నెల ధార!!
అంబరం
నుంచి
వర్షిస్తున్న ఆనంద అమృతధార !!
జలతారు
పరదాలు
చాటు
న ఆ వెన్నల రేడు కురిపించే ఆ కౌముది ధారలో
ఆమె మోము న వున్న చిరు చెమట చినుకులుకాస్త ముత్యములై మెరయు
చున్నవి
ఆమె కన్నుల కాటుక
నిశిధి ని పోలియుండగా కనుపాపల కాంతి మిలమిల మెరిసే తారకలు
వలెవున్నవి
ఆమె కనుదోయి
రాకా చంద్రుని చూసి వికసించిన కలువలేమో అన్నట్లు వున్నవి
ఆమె చెక్కిళ్ళ నిగ్గుటద్దాల
లో ఆ జాబిల్లి తొంగితొంగి చూస్తున్నాడు
ఆమె అధరాల ఫై
తోణికిసులాడుతున్న మధువులొలికించె చల్లనివెన్నెల
ఆమె నాగినివలె హొయలు
పోతోంది తెల్లని చిక్కటివెన్నెలమొగలిపూల పానుపు వలెవుంది
ఆమె జడలోని
విరిసిన మల్లెలు,ఆ రేరాజు అందంతో పోటి పడుతున్నాయి
ఆమె వదనం పున్నమి
చంద్రుని వెండి వెన్నల లా చంద్రకాంతులు వెదజల్లుతున్నది
ఆమె దివినుండిభువికి దిగిన అచ్చెర కన్య వలెవున్నది
ఆమె మూర్తిభవించిన
ప్రేమదేవత లావుంది
ఆమె దోశిళ్ళనుండి
జాలువారుతున్న వెన్నల ధార
ఆనందంగా ఆ అమృత
ధార ని పానం చేశాను
జగమంతా
నిదురిస్తున్నవేళ పుచ్చపువ్వులాంటి వెన్నలలో
ఆమె ఒడిలో నేను !
అలౌకికమైన స్వాప్నిక స్తితి!
అస్తిత్వం వుందా నాకు!
ఆమె నేనా? నేనే ఆమెనా?ఏమో?
మానసం విహంగలా
ఎగిరిపోతోంది ! అనిర్వచనీయం ఆ అనుభూతి
అంతా
ప్రేమమయం! అంతా ఆనందమయం!
వెన్నెల! వెన్నెల! ఎటు చూసిన కురిసే వెన్నెల ధార
Tuesday, May 1, 2012
ఈ నెల కౌముది లో నా కవిత" వెన్నెలధార"
పబ్లిష్అయింది.(mani Vadlamani)
http://koumudi.net/Monthly/2012/may/index.html
పబ్లిష్అయింది.(mani Vadlamani)
http://koumudi.net/Monthly/2012/may/index.html
Subscribe to:
Posts (Atom)