Thursday, April 25, 2013

గెలిచిన మందారం


టీవీ లో  చూపించిన ఒక యదార్ధ సంఘటన ఈ కవితకు ప్రేరణగా తీసుకొని రాసాను.




గెలిచిన మందారం : మణి వడ్లమాని  26/04/2013





అందాలతోటలో విరిసింది ఓ  కన్నెమందారం!
కళ్ళనిండా   మధురస్వప్నాలు ,మదినిండా తీయటి తలపులు
కొంగుల ముడివేసిన జీవనసహచరుడితో  అడుగులోఅడుగు వేసుకుంటూ
కొత్తఆశలతో,కోటికోర్కేలతో  ఆనందంగా మెట్టినింట అడుగుపెట్టింది!
కాని తన ఆశలుఅడియాస లేననీ,జీవితమంతా తోడువస్తాడు అనుకొన్న తనవాడే
కాటేసే కాలసర్పమని, తనుఅడుగుపెట్టిన ఈ కొత్త తోటలో అసలు పూలే లేవని
అన్ని ముళ్ళే వున్నాయని  తెలిసి విస్తుపోయింది ఆ ముగ్ద మందారం!
తను జీవించి వున్నా తన వునికినే లేకుండా చేసినప్పుడు
ఇది అన్యాయమని,అక్రమమని ఆక్రోశించింది ఆ పగిలిన హృదయం
ఇంత పెద్ద లోకంలో తన అస్తిత్వాన్ని గుర్తించే వారేలేరా? అని అలమటించి పోయింది.
ఎవరు తనకి సాయపడరు, తోడుగా రారు అని గ్రహించి గుండె దిటవుచేసుకొని
పట్టుదలతో,దీక్షతో  మొక్కవోని దైర్యంతో తన చిన్నారి చిట్టి మందారమే
తనకు కొండతబలం అని తెలిసికొని కష్టనష్టాలకు ఓర్చుకొంటూ ముందుకు సాగింది
జీవితమంతా పోరాడుతూ ఇన్ని రోజులు ఆ కన్నతల్లి ఒకటే ధ్యేయం తో పెంచింది తన చిన్నారిని
తన చిట్టిమందారం తనలా కాకూడదు చదువుకొని అందరికి వెలుగునిచ్చేవిఙ్ఞాన దీపిక కావాలని
తన తల్లి ఇచ్చిన ఆత్మస్త్యైర్యం తో,తనకాళ్ళమీద నిలబడే శక్తిని సంపాదించి తన కన్నతల్లికి బహుమతిగ
ఆమె కోల్పోయిన వునికిని చట్టం ద్వారసాధించి ఆమె ముందువుంచింది ఆ నవతరపు”మందారం”
తన పడ్డ శ్రమకి,కష్టము వృధా కాలేదని  తనబిడ్డ ఇప్పడు  తనలాంటి ఎంతోమంది కి ఆసరాగా నిలిచిందని
తెలిసి ఆనందం తో మురిసిపోయింది ఆ  “గెలిచిన తల్లిమందారం”!!!

Wednesday, April 10, 2013

విజయనామ సంవత్సర శుభాకాంక్షలు(mani Vadlamani)శిరాకదంబంవారు ప్రచురించిన ఈ నా ఆడియో ఉగాది సందేశం'విజయ వాణి'


మిత్రులందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు

శిరాకదంబంవారు ప్రచురించిన ఈ నా ఆడియో ఉగాది సందేశం'విజయ వాణి' ఈ క్రింది లింక్ లో...

https://sites.google.com/site/siraakadambam/home/02_027

రావమ్మా! రా! విజయ వాసంతలక్ష్మీ !
ఇదే స్వాగతం ! శుభస్వాగతం!
నీ కోసం నీ రాక కోసం ఎదురు చూస్తున్న
ప్రతి ఆకు, ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ, హర్షాతిరేకం తో, ఊయలలు ఊగుతున్నాయి !
గున్నమావిళ్ళ చిగుళ్ళు తిన్న కొయిలమ్మలు, తీయగా గళమెత్తి పాడుతున్నాయి !
వసంత శోభతో విరిసిన ప్రతి పువ్వు నూతన కాంతితో, సొగసుల వన్నెలు చిందిస్తున్నాయి !
ఆమని సోయగాల మెరుపులతో వనమంతా, ఇంద్రధనస్సులా మెరిసిపోతోంది !
చిలకమ్మల ముద్దుపలుకుల సన్నాయి పాటలతో, నీకు స్వాగతం పలుకుతున్నాయి !
వాసంత విజయమా! మధుర తరంగ సుమభామినిలా భాసిల్లుతూ, విజయం చేయవమ్మా !
విజయ దుందుభులు మోగిస్తూ, విజయ కేతనం ఎగురవేస్తూ, విజయశంఖారావం పూరిస్తూ
విజయోత్సాహం తో, జగతినంతా చైతన్యం చేస్తూ , రావమ్మా! రా! విజయ వాసంతలక్ష్మీ !
ఈ భవ్య విజయ ఉగాది భావితాశల పునాదీ !
అది సకల జనావళికి తెలుపుతూ దీవెనలు అందజేయవమ్మా !

Wednesday, April 3, 2013

నా కధ 'అర్ధనారీశ్వరం' ఆంధ్రభూమి ఏప్రిల్ మాస పత్రిక లో .......ధన్యవాదాలు....మణి వడ్లమాని

ఆంధ్రభూమి ఏప్రిల్ మాస పత్రికలో 53 va page lo

(April- 13) నా కధ 'అర్ధనారీశ్వరం' ప్రచురించారు. చదివి మీ అభిప్రాయం తెలుపుగలరు 





Thursday, March 14, 2013

ఉషోదయం!







  
ఉదయభానుడి లేలేత కిరణాల స్పర్శ నును వెచ్చగా తాకుతోంది
 అప్పడే విచ్చిన ఎఱ్ఱని మందారం తూర్పుదిక్కు తో పోటిపడుతోంది
 జగతినంతా మేలుకొలుపుతూ ఆకాశం ఉదయరాగం  పాడుతోంది
 మంచు మేలిముసుగు తొలగించి ప్రకృతి ఆకుపచ్చని చీరచుట్టింది
    పక్షులు కిలకిలతో కోయిల కుహుకుహులతో భూపాలరాగం జతకట్టింది
  ఉషోదయం, ఉషోదయం సమస్త జగతి కి శుభోదయం, శుభోదయం!!

Sunday, March 3, 2013

విరిసిన మందారం!!








పూచింది పూచింది ఆ తోటలోన జంటమందారం
ఆకాశంలోని సూర్యబింబం తో పోటి పడుతూ ఎర్రమందారం
సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్ళతో పదహారేళ్ళపడచు కన్నెమందారం
ప్రియుని ఆగమనం కోసం వేచి వున్న ముగ్ధమందారం 
ఉదయరాగం ఆలపిస్తూ,కనువిందు చేసే సోయగాలపరువపు మందారం
పచ్చటి ఆకులమధ్య విచ్చిన కన్నుల తో కోటిఆశల నడుమ విరిసిన మందారం!!

Sunday, February 10, 2013

'ఆంధ్రభూమి సచిత్రవార పత్రిక లో ' నా కధ 'ఆమె-నేను-ప్రేమ' కధను ప్రచురించారు.

ఈ వారం(21/02/2013) 'ఆంధ్రభూమి సచిత్రవార పత్రిక లో ' నా కధ 'ఆమె-నేను-ప్రేమ' కధను ప్రచురించారు.చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగలరు

Friday, February 8, 2013

కడలి సినిమా ! బావుంది..కొత్త స్టొరీ లైన్.భిన్నం గా వుంది

కడలి సినిమా ! బావుంది. నాకు బాగా నచ్చింది. అందులో సినిమా అంతా కూడా సముద్రమే అది చాల ఇష్టం

Really its a Feel Gud movie.. అందరు బాగా చేసారు ముఖ్యంగా 'అరవింద స్వామి'' అర్జున్' గురుంచి 


చెప్పక్కర్లేదు నటన చాల బావుంది.'గౌతమ్ కార్తిక్' కూడా చాల బాగా చేసాడు. చిన్నప్పటి కుర్రాళ్ళు కూడా బాగా

 చేసారు. తులసిని మరి అంత తీసి పారేయకూడదు. పాటలు. బావున్నాయి. తీయడం కూడా బావుంది.

మొత్తానికి సినిమా లో నాకు నచ్చినది.కొత్త స్టొరీ లైన్ .ఎప్పటి కంటే భిన్నం గా వుంది జీవితాన్ని ఎప్పుడు కూడా 


కడలి తోనే పోలుస్తారుకదా! అలంటి ఒక కధ లాంటి జీవితం. 


మణిరత్నం is 
మణిరత్నం