Wednesday, March 28, 2012

శ్రీ రమణ గారి "మిధునం" కధ, తనికెళ్ళ గారి :దృశ్య రూపం


శ్రీ రమణ గారి "మిధునం" కధ
తనికెళ్ళ గారి  :దృశ్య రూపం(సినిమా) గా  గాన
గంధర్వుడే కాదు ,నట గంధర్వుడు అయినా  మన బాలసుబ్రమణ్యం, శ్రీమతి లక్ష్మి ముఖ్య
పాత్రధారులు గా వేస్తె అది ఇంక ఎంత బావుంటుందో
గుత్తి వంకాయ కూరలగా, కొత్తావకాయ లాగా,ఆవపెట్టిన పనస పొట్టు కూరలగా,ఆంధ్రశాకంబరి లేహ్యం అదేనండి మన
గోంగూర పచ్చడిలగా అరటి ఆకులో కమ్మటి పెరుగు తో
మన తెలుగుంటి భోజనం లా వుంటుంది. నమ్మండి!!!!




Friday, March 23, 2012

శిరా కదంబం వారు నిర్వహించిన౧ ఉగాది స్వరాలలో నా స్వరం కూడా గళం విప్పింది

 బ్లాగర్ మితులకి

నందన నామ సం శుభాకాంక్షలు!!


శిరా కదంబం వారు నిర్వహించిన౧ ఉగాది స్వరాలలో నా స్వరం కూడా కలిసింది









మణి మూర్తి వడ్లమాని


http://sirakadambam.blogspot.in







































» 
శిరా కదంబం :   ' శ్రీ నందన ' ఉగాది స్వరాలు.. 

Thursday, March 22, 2012

నందనం, ఆనంద వాసంత నందనం అందుకో మా ఆనంద వందనం 
చేకొనుమా! ఈ ఆనంద వాసంత అభినందనం"

అందరికీ ఉగాది శుభాకాంక్షలు
 

Sunday, March 18, 2012

http://www.andhrapradeshpatrika.com/issues/2011/dec/page18.asp

ఆంద్ర ప్రదేశ్ మాస (డిసెంబర్) పత్రిక లో నా కవిత"వెళ్లిపోయావా ప్రియ నేస్తం" ప్రచురించారు
ఇది నాకు  ఆలస్యం గ తెలిసింది.
ప్రింట్ లో కొన్ని పదాలు సరిగా ప్రచురించలేదు. ఇది నా అసలు కవిత


వెళ్ళిపోయవా  ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా  ప్రియ  నేస్తం


వెళ్ళిపోయవా  ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా  ప్రియ  నేస్తం

మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం

ఏవి  ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!

ఏది  మామిడి చెట్టుకు కట్టిన  ఊయల ? ఊగుతూ     ఊగుతూ   తెగిన ఊయలని  వదలి వెళ్ళిపోయవా నేస్తం!

ఏటిలో  చేపలా   ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని  ఏటి పాలు చేసావా   నేస్తం

నువ్వు భౌతికం గ   లేకపోయనా  వో నేస్తం !  నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను  పలకరిస్తూనే వున్నాయి

ఈ  మట్టి  వాసనలో నిన్ను నేను  చూస్తున్నాను నేస్తం     ఈ గాలిలో గుసగుసలో నీ  పాట  వింటున్నాను నేస్తం

ఆ ఏటి తరగల మీద నురుగులో  నీ నవ్వు  చూస్తున్నాను నేస్తం   ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం

నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు   నేస్తం  నాతో నే వున్నావు  !! నా వూపిరిలోనే  లోనే వున్నావు   నేస్తం!!












http://www.andhrapradeshpatrika.com/issues/2011/dec/page18.asp 

Friday, March 9, 2012

ఎందరో ఆకాశవాణి మహానుభావులు అందరికి వందనాలు

రేడియో!! అంటే ఇప్పుడు వచ్చేఇదిచాల హాట్ గురు,,ఉల్లాసంగ,ఉత్సాహం గ ,వినువినిపించు ఇత్యాది  ప్రకటన లు
లేకుండా వున్నారోజులు, అలా అనిమరి పాత రోజులు కాదు ఒక 20 ఏళ్ళ  క్రితం వరకు.ఎంత బావుండివో, పొద్దున్న
ఆకాశవాణి శుభోదయం ప్రసారం నుంచి రాత్రిఈ ప్రసారం ఇంతటితో సమాప్తం వరకు.


అప్పటి రోజులలో కూడా రేడియో వినడం మూలం గ విజ్ఞ్యానం పెరిగేది


అప్పుడు రేడియో లోఇంత సినిమా సంస్కృతి లేదు, ఆదివారం వచ్చిందిఅంటే ఒకసంక్షిప్త  శబ్ద చిత్రం వేసేవారు, రోజు
ఒక అరగంట మీరు కోరిన పాటలు వేసేవారు , మిగత కార్యక్రమాలు ఎంతో వినోదభరితం గ, ఇంకా అందరికిఉపయోగపడేవి గ ఉండేవి,


ఇంకాలలితా సంగీతం గురించి చెప్పాలంటే పాలగుమ్మివిశ్వనాధం గారు,   rajanikanta rao
 garu , v b kanakadurga garu, ఇంకా ఎందఱో మహానుభావులు అలాగే ఈ మాసపుపాట
 అనే ప్రోగ్రాం ,అలాగే రేడియో  నాటకాలు,నాటికలు వాటి
భేదం గురుంచి వివరం గ తెలియదు.కాని అన్ని ఆస్వాదించే వాళ్ళం నాకు తెలిసి బందా కనకలింగేశ్వర రావు గారు
నటించిన  " కీర్తిశేషులు" నాటకం ,మురారి పాత్ర,,ఇంకా రావికొందలరావుగారిఒక ప్రొఫెసర్ పాత్ర తో వున్నానాటకం,ఊరుమ్మడిబతుకులు ఇలా ఇంకాఎన్నోచారిత్రాత్మక నాటకాలు
ఎన్నో,ఇంకాహాస్యనాటక లు అందరికి ఎంతోవినోదాన్నిపంచేవే,హైదరాబాద్,విజయవాడ, వైజాగ్ మరియు
కడప, అందరి ప్రోగ్రామ్స్భలేఉండేవి నండూరిసుబ్బారావు,సీతారాత్న్నమ్మ, మ.నాగరత్నం,,శారదశ్రీనివాసన్,చిన్నక్క(రత్నప్రసాద్),రాంబాబు(ఆకెళ్ళ అనుకుంట)జీడిగుంట ఇలా
అందరు మెప్పించేవారు.


గణపతి గ నండూరి ఎంత బాగా నటించేవారో అతని తల్లిపాత్రలో సీతారాత్నమ్మకూడా.
తరువాత కూడా చాల మంది "అల్ ఇండియా రేడియో కి సేవ చేసినవారే,జ్యోత్స్న,ఇలియాస్,మట్టపల్లి
రావు,ఉమాపతి ఈయన గొంతు చాల గంభీరం గ వుండేది.


నేను రాసింది గోరంత చెప్పల్సినది కొండత ఏదోనా శక్తి మేరకుప్రయత్నం చేశాను

ఎందుకో ఒక్కసారి గ అందరు గురుకోచ్చారు, సరే మన బ్లాగర్ మేట్స్ తో నా
భావాలు పంచుకుందామని రాసాను


ఎందరో ఆకాశవాణి మహానుభావులు అందరికి వందనాలు!!!





Wednesday, March 7, 2012

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

ప్రపంచం  లోకెల్లాఅందమైనవారు, అంతకన్నా అందమైన మనసు వున్నవారు
 అన్నిరంగలాలోను అభినివేశం వున్నవారు, మొక్కవోని దైర్య సాహసాలుకలవారు,
 తనవారికోసం నిలబడే ధీసాలులు వారు,కష్టాలను,కన్నీళ్లను లెక్కచెయ్యని వారు,
 స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు,మానవత్వానికి విలువనిచ్చేవారు ఇన్ని మాటలెల వారు
 ఈ సృష్టి కే  సృష్టికర్తలు   ఎవరు ఇంకెవరు ఆడువారు
 తల్లిలా,చెల్లిలా,చెలిలా నెచ్చెలిలా,కూతురిలా ఇలా
 ఎన్నో ఎనెన్నో రూపాలను సంతరించుకుంటూ వున్నారు
 అలాంటి ఎందరో స్త్రీ లకి  అబినందనలు
                     అందరకి  ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం  శుభాకాంక్షలు

వో స్త్రీ ఆవేదన!! తల్లి కాలేని తల్లి ఆవేదన!!


వో   స్త్రీ  ఆవేదన!! తల్లి కాలేని  తల్లి ఆవేదన!!

అమ్మాయి పుట్టింది!  మహాలక్ష్మి అన్నారు!
అమ్మాయి బాగా చదవుతోంది!  సాక్షాతూ  చదువలసరస్వతి అన్నారు!
అమ్మాయి కి ఈడు  వచ్చి పెళ్లి జరిగింది! సాక్షాతూ ఆదిదంపతులు అన్నారు!
ఇంతవరకు అమ్మాయిలో అన్ని దేవతలను చూసారు!
అప్పుడు ఆమె  మౌన మూర్తి  వినటమే తప్ప  మాటలాడటం ఎరుగదు!
మరి  నేడు అందరు   ఆమెని రాక్షసి అని బరితెగెంచిదని!అంటున్నారు
కారణం ఇప్పుడు నోరు తెరచింది స్వతంత్ర జీవనం కావాలి అంటోది!
తనకు మాతృత్వం ఇవ్వన్ని వివాహబంధం వద్దు అంది!
అదేపురాణాల స్త్రీలు చేస్తే తప్పు పట్టని సమాజం ! తనకి ఎందుకు
న్యాయము చెయ్యరూ అని అడిగింది! అమ్మతనం కావాలని  కోరుకోవడం తప్పా అని ప్రశ్నించిది?
ఏదిన్యాయము ! ఏది ధర్మం అని క్రోసించింది   స్ర్తీ హృదయం!
ఎవరు ఆమెకి న్యాయము చెయ్యలేదు. వేరే దారి లేక మరణాన్ని ఆశ్రయించింది!
మండుతున్న మనసుతోపాటు  తనువు కూడా  అగ్నికి ఆహుతి అయ్యింది!
ఆహ!  నిజంగా నీవు  సతివే  సుమా  అని  అందరు వేనోళ్ళ పొగిడారు!
ఆమె మరణం  తో మరింత దివ్యత్వాన్ని పొందింది అని ఆనందించారు!
అంతే కానీ ఆమె నిండునూరేళ్లు అర్ధం లేకుండా ముగిసాయని ఎవరు అనలేదు.
ఎవరు అర్ధం చేసుకుంటారు   వో   స్త్రీ   నీ    గుండె లోతుల బాధని
ఎవరు అర్ధం చేసుకుంటారు తల్లీ  నీ ఆవేదనని? ఎవరు? ఎవరు???

Monday, March 5, 2012

Thursday, March 1, 2012