ఆంద్ర ప్రదేశ్ మాస (డిసెంబర్) పత్రిక లో నా కవిత"వెళ్లిపోయావా ప్రియ నేస్తం" ప్రచురించారు
ఇది నాకు ఆలస్యం గ తెలిసింది.
http://www.andhrapradeshpatrika.com/issues/2011/dec/page18.asp
ఇది నాకు ఆలస్యం గ తెలిసింది.
ప్రింట్ లో కొన్ని పదాలు సరిగా ప్రచురించలేదు. ఇది నా అసలు కవిత
వెళ్ళిపోయవా ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా ప్రియ నేస్తం
వెళ్ళిపోయవా ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా ప్రియ నేస్తం
మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం
ఏవి ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!
ఏది మామిడి చెట్టుకు కట్టిన ఊయల ? ఊగుతూ ఊగుతూ తెగిన ఊయలని వదలి వెళ్ళిపోయవా నేస్తం!
ఏటిలో చేపలా ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని ఏటి పాలు చేసావా నేస్తం
నువ్వు భౌతికం గ లేకపోయనా వో నేస్తం ! నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను పలకరిస్తూనే వున్నాయి
ఈ మట్టి వాసనలో నిన్ను నేను చూస్తున్నాను నేస్తం ఈ గాలిలో గుసగుసలో నీ పాట వింటున్నాను నేస్తం
ఆ ఏటి తరగల మీద నురుగులో నీ నవ్వు చూస్తున్నాను నేస్తం ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం
నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు నేస్తం నాతో నే వున్నావు !! నా వూపిరిలోనే లోనే వున్నావు నేస్తం!!
http://www.andhrapradeshpatrika.com/issues/2011/dec/page18.asp
చాలా బాగుంది. కాని ఎందుకో బాధగా కూడా అనిపించింది.
ReplyDeleteనచ్చినందుకు ధన్యవాదాలు ! నా అలాగే
ReplyDeleteస్పందిచినందుకుఅవును! ఎందుకంటె ఆ భాదని అనుభవించి రాసినది.
నిజం చెప్పాలంటే నా ఆవేదనే అక్షరరూపం దాల్చింది.
so nice..
ReplyDeleteనేస్తాన్ని అంత అపురూపంగా స్మరిస్తున్న మీకు మంచి ఓదార్పు లభించాలి.
ReplyDelete