Friday, March 9, 2012

ఎందరో ఆకాశవాణి మహానుభావులు అందరికి వందనాలు

రేడియో!! అంటే ఇప్పుడు వచ్చేఇదిచాల హాట్ గురు,,ఉల్లాసంగ,ఉత్సాహం గ ,వినువినిపించు ఇత్యాది  ప్రకటన లు
లేకుండా వున్నారోజులు, అలా అనిమరి పాత రోజులు కాదు ఒక 20 ఏళ్ళ  క్రితం వరకు.ఎంత బావుండివో, పొద్దున్న
ఆకాశవాణి శుభోదయం ప్రసారం నుంచి రాత్రిఈ ప్రసారం ఇంతటితో సమాప్తం వరకు.


అప్పటి రోజులలో కూడా రేడియో వినడం మూలం గ విజ్ఞ్యానం పెరిగేది


అప్పుడు రేడియో లోఇంత సినిమా సంస్కృతి లేదు, ఆదివారం వచ్చిందిఅంటే ఒకసంక్షిప్త  శబ్ద చిత్రం వేసేవారు, రోజు
ఒక అరగంట మీరు కోరిన పాటలు వేసేవారు , మిగత కార్యక్రమాలు ఎంతో వినోదభరితం గ, ఇంకా అందరికిఉపయోగపడేవి గ ఉండేవి,


ఇంకాలలితా సంగీతం గురించి చెప్పాలంటే పాలగుమ్మివిశ్వనాధం గారు,   rajanikanta rao
 garu , v b kanakadurga garu, ఇంకా ఎందఱో మహానుభావులు అలాగే ఈ మాసపుపాట
 అనే ప్రోగ్రాం ,అలాగే రేడియో  నాటకాలు,నాటికలు వాటి
భేదం గురుంచి వివరం గ తెలియదు.కాని అన్ని ఆస్వాదించే వాళ్ళం నాకు తెలిసి బందా కనకలింగేశ్వర రావు గారు
నటించిన  " కీర్తిశేషులు" నాటకం ,మురారి పాత్ర,,ఇంకా రావికొందలరావుగారిఒక ప్రొఫెసర్ పాత్ర తో వున్నానాటకం,ఊరుమ్మడిబతుకులు ఇలా ఇంకాఎన్నోచారిత్రాత్మక నాటకాలు
ఎన్నో,ఇంకాహాస్యనాటక లు అందరికి ఎంతోవినోదాన్నిపంచేవే,హైదరాబాద్,విజయవాడ, వైజాగ్ మరియు
కడప, అందరి ప్రోగ్రామ్స్భలేఉండేవి నండూరిసుబ్బారావు,సీతారాత్న్నమ్మ, మ.నాగరత్నం,,శారదశ్రీనివాసన్,చిన్నక్క(రత్నప్రసాద్),రాంబాబు(ఆకెళ్ళ అనుకుంట)జీడిగుంట ఇలా
అందరు మెప్పించేవారు.


గణపతి గ నండూరి ఎంత బాగా నటించేవారో అతని తల్లిపాత్రలో సీతారాత్నమ్మకూడా.
తరువాత కూడా చాల మంది "అల్ ఇండియా రేడియో కి సేవ చేసినవారే,జ్యోత్స్న,ఇలియాస్,మట్టపల్లి
రావు,ఉమాపతి ఈయన గొంతు చాల గంభీరం గ వుండేది.


నేను రాసింది గోరంత చెప్పల్సినది కొండత ఏదోనా శక్తి మేరకుప్రయత్నం చేశాను

ఎందుకో ఒక్కసారి గ అందరు గురుకోచ్చారు, సరే మన బ్లాగర్ మేట్స్ తో నా
భావాలు పంచుకుందామని రాసాను


ఎందరో ఆకాశవాణి మహానుభావులు అందరికి వందనాలు!!!





8 comments:

  1. నిజంగా మధురానుభూతులు..
    పొద్దున్నే.. ఆకాశవాణి.. వార్తలు .. చదువుతున్నది, పణ్యాల రంగనాధరావు , లేదా కందుకూరి సూర్య నారాయణ.. వీరి గంభీర కంఠాలు వింటూ లేచేదాన్ని నిద్ర. మా నాన్నగారు భక్తి రంజని ఎంత గట్టిగా పెట్టినా సరే!
    అసలు ఇప్పుడు మా ఇంట్లో రేడియో లేదంటే సిగ్గుపడాల్సిన విషయం, నీ మెయిల్ చూడగానే రేపే వెళ్ళి కొనేసుకోవాలి అనిపిస్తోంది.
    పొద్దున్నే ఇంతటి చక్కని ఆలోచన ఇచ్చినందుకు ధన్యవాదాలు మణీ.
    ఫిన్ని.

    ReplyDelete
  2. రేడియో జ్ఞాపకాలు బాగున్నాయి . అప్పుడప్పుడు మీరు ఆ కాలం లో విన్న నాటకాలు, ఇతర విషయాల గురించి రాయండి బాగుంటాయి

    ReplyDelete
  3. పిన్ని ,మురళి గారు మీ స్పందన నాలో
    ఇంకా రాయలనే ఉత్సహాన్ని పెంచ్తోంది
    మీ ఇద్దరి స్పందనకు నా ధన్యవాదాలు!!

    ReplyDelete
  4. అవును, ఇలా గుర్తు చేసుకుంటుంటే బోలెడు జ్ఞాపకాలు. మా నాన్నగారి వాల్వ్ రేడియో పక్కన కూర్చుని నిచ్చెనలతో రేడియోల్లోకి దూరే బుల్లి మనుషులని మీద నిఘా మీదుగా, వారి సిగ్నేచర్ మ్యూజిక్ తో లేవటంతో పాటుగా, (మీరన్నవే కాక) బాలానందం, గురువారపు రాత్రి జాతీయ నాటకాలు, అమ్మవినే సిలోన్ రేడియో లో మంద్రస్థాయి జీరగొంతు, నేర్చుకున్న "తబ్బిబ్బయింది నా మనసు, తళుక్కుమన్నది నీ సొగసు" "ఏటిదాపున తోటలోపల ఎవరినే పిలిచేవు కోయిల ఎవరినే ..", వివిధభారతి శ్రోతల కోరిన పాటలు... ఇంకా సాగుతూనే ఉంటాయి నేను రాస్తూ పోతే.

    ReplyDelete
  5. ఉష గారికి నా పోస్ట్ మీకు నచ్చినదుకు థాంక్స్ !!
    తరువాత భాగం గా ఇంకొన్నిరాసాను ఇంకా అది
    పోస్ట్ చెయ్యాలి అందులో మీరు చెప్పిన వి వున్నాయి. అలాగే నాకు ఎంతో ఇష్టమైన
    పాట అది"ప్రేమకానుక" లో సుశీల గారు పాడినది.

    ReplyDelete
  6. Ammaa,

    Naaku chala gurthunnayi radio lo vacche programs , ippatiki charminar ad , EcTV ad , growmore ad... paatalu gurthunnai....anduke nenu ippudu vallalaga radio mirchi gatra vinanu...Rainbow vintanu

    ReplyDelete
  7. avunu sappu radio vente
    mansu ento ahladamo ga(pleasent) vuntundi

    ReplyDelete
  8. "ఆకాశవాణి వార్తలు చదువుతున్నది..."నాకు ఇంకా గుర్తే..
    గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete