Wednesday, March 7, 2012

వో స్త్రీ ఆవేదన!! తల్లి కాలేని తల్లి ఆవేదన!!


వో   స్త్రీ  ఆవేదన!! తల్లి కాలేని  తల్లి ఆవేదన!!

అమ్మాయి పుట్టింది!  మహాలక్ష్మి అన్నారు!
అమ్మాయి బాగా చదవుతోంది!  సాక్షాతూ  చదువలసరస్వతి అన్నారు!
అమ్మాయి కి ఈడు  వచ్చి పెళ్లి జరిగింది! సాక్షాతూ ఆదిదంపతులు అన్నారు!
ఇంతవరకు అమ్మాయిలో అన్ని దేవతలను చూసారు!
అప్పుడు ఆమె  మౌన మూర్తి  వినటమే తప్ప  మాటలాడటం ఎరుగదు!
మరి  నేడు అందరు   ఆమెని రాక్షసి అని బరితెగెంచిదని!అంటున్నారు
కారణం ఇప్పుడు నోరు తెరచింది స్వతంత్ర జీవనం కావాలి అంటోది!
తనకు మాతృత్వం ఇవ్వన్ని వివాహబంధం వద్దు అంది!
అదేపురాణాల స్త్రీలు చేస్తే తప్పు పట్టని సమాజం ! తనకి ఎందుకు
న్యాయము చెయ్యరూ అని అడిగింది! అమ్మతనం కావాలని  కోరుకోవడం తప్పా అని ప్రశ్నించిది?
ఏదిన్యాయము ! ఏది ధర్మం అని క్రోసించింది   స్ర్తీ హృదయం!
ఎవరు ఆమెకి న్యాయము చెయ్యలేదు. వేరే దారి లేక మరణాన్ని ఆశ్రయించింది!
మండుతున్న మనసుతోపాటు  తనువు కూడా  అగ్నికి ఆహుతి అయ్యింది!
ఆహ!  నిజంగా నీవు  సతివే  సుమా  అని  అందరు వేనోళ్ళ పొగిడారు!
ఆమె మరణం  తో మరింత దివ్యత్వాన్ని పొందింది అని ఆనందించారు!
అంతే కానీ ఆమె నిండునూరేళ్లు అర్ధం లేకుండా ముగిసాయని ఎవరు అనలేదు.
ఎవరు అర్ధం చేసుకుంటారు   వో   స్త్రీ   నీ    గుండె లోతుల బాధని
ఎవరు అర్ధం చేసుకుంటారు తల్లీ  నీ ఆవేదనని? ఎవరు? ఎవరు???

No comments:

Post a Comment