Friday, January 27, 2012

వసంత పంచమి - సరస్వతీ పూజ

 వసంత పంచమి - సరస్వతీ పూజ

"యా కుందేందు తుషార హార-ధవళా,

యా శుభ్ర – వస్త్రాన్వితా
యా వీణ వర దండ మండితకర
యా శ్వేత పద్మాసన
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రితిభిర్ దేవై-సదా వందిత
సా మాం పాతు సరస్వతి భగవతీ నిశేష జాడ్యాపహా"
___________________________________________
సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. ఈ రోజు సరస్వతీ పూజకు ప్రశస్తంగా చెబుతారు దీనిని వసంత పంచమి అంటారు.
ఇంతటి  వేదమాతను ఏదో చదువుకునే పిల్లలు మాత్రమే కాదు పెద్దలు
కూడా చక్కగా పూజించాలి.ముఖ్యం గ చాల మంది స్త్రీలు లలిత చదువుతున్నం, లేదా ఈవాళ మా ఇంట్లో పారాయణ అంటూ మొదలుపెట్టి' లలిత చదవి,లక్ష్మిని ఇంకాఅష్టలక్ష్మి ఇలా చా ల అష్టకాలు చదువుతారు కానీ"ఎవరు సరస్వతి శ్లోకం తోమొదలుపెట్టారు
మంగళహారతి పాడేస్తారు  శ్రీ మహాకాళి,మహాలక్ష్మి,మహాసరస్వతి అనిఅంటారు కాని ఆవిడను స్తోత్రం చెయ్యరు.ఇదిమహా అపరాధం. ఈ రోజు నుంచి సరస్వతీ పూజ అందరు తప్పకుండ
చెయ్యండి.
  ఆ శారద మాత అందరి ఫై తన కరుణని ప్రసాదిస్తుంది

జ్ఞానము,వివేకం, వాక్కుని  ప్రసాదిస్తుంది.


‎.వాగ్దేవి కి కోపం వచ్చిందిఒక చిన్నగల్పిక రాసాను చాల రోజులక్రితం అది మళ్ళి మీకోసం మరోసారి!!


(అది బ్రహ్మ లోకం, బ్రహ్మ మాములుగా తన ధ్యానం లో వున్నాడు

.సరస్వతి దేవి బంగారు చాయ తో తెల్లటి వస్ర్తాలు ధరించి, పద్మాసనం లో కూర్చొని,వీణాపాణి,పుస్తక ధారిణి అయి నెమిలి,హంస పక్కనే వుండగా సామగానం చేస్తూ వుంటే మునులందరూ కూడా అ శారదాదేవిని కొనియాడుతూ కీర్తిస్తూ, సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి,విద్యారంభం కరిష్యామి అంటూ,జ్ఞాన్నాన్ని,తెలివిని,ముఖ్యముగా
వాక్కుని ప్రసాదించే అమ్మవు.ముగ్గరుమ్మల మూలపు అమ్మవ్వు ఆని వేనోళ్ళ ప్రస్టుతి చేయగా,
ఆ శారదాదేవి ప్రసన్నరాలు కాకా పోగా,చాల కోపం తో కన్నులు ఎర్రబారగా బ్రహ్మ వేపు చూస్తూ నాధా నేటి నుంచి నన్నుకొలవని ప్రజలందరినీ మూడులు గ ,వాక్సుద్ధి లేనివారిగా,తెలివిలేనివారిగా కమ్మనిశాపము ఇస్తున్నానని చెప్పింది. అందరు బ్ర్మహతో సహా తల్లి ఎందుకు నీ ఆగ్రహం ఈ సమస్తలోకాలు నీ కరుణ లేకుండా ముఖ్యం గ వాక్కు,తెలివి లేకపోతె అందరు అల్లాడిపోతారు తల్లి,కారణం లేకుండా ఆగ్రాహించకు అనగా.

"ఆవాగ్దేవిఇలా పలికింది! ఇది చూడండి ఆని భూలోకం లో ఒక నగరంలో ఆరోజు శుక్రవారం కావటం తో
అందరూ స్రీలు ఒక్క చోట చేరి లలితసహ్రసనామ పారాయణ మరియు లక్ష్నిస్తోత్రం  ఇంకా వివిధ అష్థకములు చదివారు. అదిగో అని బ్రహ్మమొదలగు వారందరికీ చూపిస్తూ అందులో ఏ ఒక్కరైన నన్నుస్తుతించారా? అని ప్రశ్నవేసినది. లేదుకదా. వీరుందరూ విద్యావంతులే

అందరికి నేను కావాలి నా ద్వార వచ్చే చదువుకావాలి,వారివాస్వప్రయోజనాలకి కోసం !కానీ నన్ను మాత్రం కొలవారుఒకవేళ కొలిచిన అది గుంపులో గోవిందలా.మాత్రమే! అంతేకాని నన్నుకూడా లక్ష్మితో పాటు,లలితతోపాటు సమముగాచూడరు. విడిగా సోత్రం చెయ్యరు అలాంటివారికి బుద్ధిరావలింటే ఇదేమార్గం అంటూ శాపముఇవ్వసాగింది."

       అమ్మా వద్దూ వద్దూ , అంటూ పెద్దగా అరుస్తూ వుంటే మా వారువచ్చి ఏమోయి ఏమిటి అలా వద్దూ వద్దూ అంటూపలవరిస్తున్నావు అంటూనిద్రలేపారు అమ్మయ్య ఇది అంతా కలా అని వెంటనే ఆయనతో చెప్పాను, అప్పుడు అయన దానిదేముంది ఈవాళ నించి మీరందరు 'సరస్వతిదేవిని" కూడా పారాయణచెయ్యండి. ఎందుకు నీకుఆవిడ కలలో కనిపించిందో ఇది ఒక అందుకు మంచిదే అని అన్నారు. అదే మొన్న శ్రీవిద్య వాళ్ళఇంట్లో పారాయణరోజున పిల్లలు అడిగారు మమ్మీ చిన్నలిల్లలే సరస్వతిపూజ చెయ్యలా? మీరు చేయ్యక్కరలేదా అని. ఆ విషయంమనసులో వుండిపోయిదేమో! అది ఇలా కల రూపంలో వచ్చి వుంటుంది అని ,ఒకరకం గ ఇది మంచిదే మాకళ్లు తెరిపించింది.తప్పకుండ ఈవాళ్ళనుంచి అందరం ఆ శారదదేవిని ఆ చదువుల తల్లిని కూడా కొలుస్తాం అనుకుంటూ దినచర్య ప్రారంబిచాను.)




No comments:

Post a Comment