Saturday, February 26, 2011

జ్ఞ్యాపకములు


జ్ఞ్యాపకములు


ఆంధ్ర షెల్లీ  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన  జ్ఞ్యాపకం
అసలు జ్ఞ్యాపకాలు లేని జీవితాలు  మనం వుహించలేము. ఒక మనిషి జీవితంలో  ఎన్నో,ఎన్నోన్నో జ్ఞ్యాపకాలు
నిజముగా అవన్నీ అక్షర నిక్షిప్తం చేస్తే    కొన్ని లక్షల కోట్లలో పుస్తకాలూ ఉండేవేమో అన్న ఒక చిత్రమైన వుహ. అలాంటి  మరపురాని అమూల్యం అయిన ఒక జ్ఞ్యాపకం





తొలి వియోగిని నేనే!

తొలి ప్రేయసిని నేనే!
ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!!! .......    అది తను సృష్టించుకున్న ప్రేయసి ఊర్వశి నుంచి
కవి!భావకవి!మనవాడు! మనతెలుగువాడు!ప్రపంచం మొత్తం గర్వించ తగిన మహానుభావుడు!!!!!!       
అంతటి మహాకవిని  నేను కలిసాను అని తలుచుకుంటే చాల గర్వం గా అనిపిస్తుంది.
ఎప్పుడో నా చిన్ననాటి సంగతి, చిన్నదే కానీ చాల గొప్పది అది ఈ నాటి సాహితి మిత్రులోతో పంచుకుందామని,
 దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ని నేను  నా చిన్నతనంలో బహుశ  నాకు   పది ,పదకొండు సం  ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ  ఒక కాలేజీ ప్రినిసిపాల్ గారు వుండేవారు బహుసా P.R. College  అనుకుంట ఆయన
పేరు కూడా సరిగా  గుర్తు లేదు సీతారామరావు గారు అన్నట్లు  లీలగాజ్ఞ్యాపకం. ,ఇక్కడ మానాన్నగారి గురించి  కొంత చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష  చాలవుండేది.మా నాన్నగారి  గురువు  పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం  గురుంచి అందులో ఉద్యోగపర్వం  గురుంచి  తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద  అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి  శ్రీ  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి  వచ్చారు. అ విషయం మా నాన్నగారికి ముందే .చెప్పారు.నాన్నగారి  తో పాటు  నేను కూడా    వెళ్ళాను , మా నాన్నగారు ఆయనకి  నమస్కారం  చేసారు       నాకు  లీలగా గుర్తు  వుంది  ఆయన రూపం తెల్లటి మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు.  అంతే  అంతకు మించి గుర్తు లేదు.  కానీ అప్పటికే  ఆ మహాకవి  గొంతు  మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు ,అలాగే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
అంతటి మహానుభావుడిని  చూసాను  అదే ఒక  పెద్ద  రివార్డ్ అని తరువాతతెలిసింది
 ఇది నాకు  ఒక  అరుదయిన  ఎంతో  విలువయిన   జ్ఞ్యాపకం.
  



Friday, February 25, 2011

. జ్ఞ్యాపకములు,వాగ్దేవి కి కోపం వచ్చింది,



.వాగ్దేవి కి కోపం వచ్చింది


అది బ్రహ్మ లోకం, బ్రహ్మ మాములుగా తన ధ్యానం లో వున్నాడు

.సరస్వతి దేవి బంగారు చాయ తో తెల్లటి వస్ర్తాలు ధరించి, పద్మాసనం లో కూర్చొని,వీణాపాణి,పుస్తక ధారిణి అయి నెమిలి,హంస పక్కనే వుండగా సామగానం చేస్తూ వుంటే మునులందరూ కూడా అ శారదాదేవిని కొనియాడుతూ కీర్తిస్తూ, సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి,విద్యారంభం కరిష్యామి అంటూ,జ్ఞాన్నాన్ని,తెలివిని,ముఖ్యముగా
వాక్కుని ప్రసాదించే అమ్మవు.ముగ్గరుమ్మల మూలపు అమ్మవ్వు ఆని వేనోళ్ళ ప్రస్టుతి చేయగా,

ఆ శారదాదేవి ప్రసన్నరాలు కాకా పోగా,చాల కోపం తో కన్నులు ఎర్రబారగా బ్రహ్మ వేపు చూస్తూ నాధా నేటి నుంచి నన్నుకొలవని ప్రజలందరినీ మూడులు గ ,వాక్సుద్ధి లేనివారిగా,తెలివిలేనివారిగా కమ్మనిశాపము ఇస్తున్నానని చెప్పింది. అందరు బ్ర్మహతో సహా తల్లి ఎందుకు నీ ఆగ్రహం ఈ సమస్తలోకాలు నీ కరుణ లేకుండా ముఖ్యం గ వాక్కు,తెలివి లేకపోతె అందరు అల్లాడిపోతారు తల్లి,కారణం లేకుండా ఆగ్రాహించకు అనగా.

"ఆవాగ్దేవిఇలా పలికింది! ఇది చూడండి ఆని భూలోకం లో ఒక నగరంలో ఆరోజు శుక్రవారం కావటం తో
అందరూ స్రీలు ఒక్క చోట చేరి లలితసహ్రసనామ పారాయణ మరియు లక్ష్నిస్తోత్రం  ఇంకా వివిధ అష్థకములు చదివారు.దివ్యద్రిష్టితో అదిగో అని బ్రహ్మమొదలగు వారందరికీ చూపిస్తూ అందులో ఏ ఒక్కరైన నన్నుస్తుతించారా? అని ప్రశ్నవేసినది. లేదుకదా. వీరుందరూ విద్యవతులే అందరికి నేను కావాలి నా ద్వార వచ్చే చదువుకావాలి,వారివాస్వప్రయోజనాలకి కోసం !కానీ నన్ను మాత్రం కొలవారుఒకవేళ కొలిచిన అది గుంపులో గోవిందలా.మాత్రమే! అంతేకాని నన్నుకూడా లక్ష్మితో పాటు,లలితతోపాటు సమముగాచూడరు. విడిగా సోత్రం చెయ్యరు అలాంటివారికి బుద్ధిరావలింటే ఇదేమార్గం అంటూ శాపముఇవ్వసాగింది."

       అమ్మా వద్దూ వద్దూ , అంటూ పెద్దగా అరుస్తూ వుంటే మా వారువచ్చి ఏమోయి ఏమిటి అలా వద్దూ వద్దూ అంటూపలవరిస్తున్నావు అంటూనిద్రలేపారు.వెంటనే నాకొచ్చిన కలని ఆయనతో చెప్పాను, అప్పుడు అయన దానిదేముంది ఈవాళ నించి మీరందరు 'సరస్వతిదేవిని" కూడా పారాయణచెయ్యండి. ఎందుకు నీకుఆవిడ కలలో కనిపించిందో ఇది ఒక అందుకు మంచిదే అని అన్నారు. అదే మొన్న శ్రీవిద్య వాళ్ళఇంట్లో పారాయణరోజున పిల్లలు అడిగారు మమ్మీ చిన్నలిల్లలే సరస్వతిపూజ చెయ్యలా? మీరు చేయ్యక్కరలేదా అని. ఆ విషయంమనసులో వుండిపోయిదేమో! అది ఇలా కల రూపంలో వచ్చి వుంటుంది అని ,ఒకరకం గ ఇది మంచిదే మా
కళ్లు తెరిపించింది.తప్పకుండ ఈవాళ్ళనుంచి అందరం ఆ శారదదేవిని ఆ చదువుల తల్లిని కూడా కొలుస్తాం అనుకుంటూ దినచర్య ప్రారంబిచాను.





ఇది నమ్మండి నమ్మకపోండి కాని ఆ వాగ్దేవికి మాత్రం కోపం తెప్పించకండి!!!





. జ్ఞ్యాపకములు




.
జ్ఞ్యాపకాలు లేని జీవితాలు  మనం వుహించలేము. ఒక మనిషి జీవితంలో  ఎన్నో,ఎన్నోన్నో జ్ఞ్యాపకాలు
నిజముగా అవన్నీ అక్షర నిక్షిప్తం చేస్తే    కొన్ని లక్షల కోట్లలో పుస్తకాలూ ఉండేవేమో అన్న ఒక  చిత్రమైన వుహ.
ఆ  ఆలోచనలోంచి .కొన్ని జ్ఞ్యాపకాలు.


 ఆంధ్ర షెల్లీ  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన అరుదయిన  జ్ఞ్యాపకం
"ప్రేయసి, ప్రేయసి, ! ప్రియుడనే  ప్రేయసి!
వేయి కన్నులు దాల్చి వెదుకుచున్ననే!
                                     దేవులపల్లి వేకంట కృష్ణశాస్త్రి
అని ప్రేయసి ని వెదుకుచున్న కవి  హృదయం అది
అంతటి మహాకవిని చూసిన  నాకన్నులు ఎంత భాగ్యం చేసుకున్నాయో కదా!
అ నాటి సంగతి, చిన్నదే కానీ చాల గొప్పది ఈ నాటి సాహితి మిత్రులోతో అది పంచుకుందామని

 దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ని నేను
 నా చిన్నతనంలో బహుశ  నాకు  
 పది ,పదకొండు సం  ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ  ఒక
 కాలేజీ ప్రినిసిపాల్ గారు వుండేవారు పేరు సరిగా  గుర్తు లేదు సీతారామరావు గారు అన్నట్లు జ్ఞ్యాపకం.
ఇప్పుడు ,ఇక్కడ మానాన్నగారి గురించి  కొంత
 చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష  చాలవుండేది.మా నాన్నగారి  గురువు  పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం  గురుంచి అందులో ఉద్యోగపర్వం  గురుంచి  తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద  అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి  శ్రీ  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి  వచ్చారు. అ విషయం మా నాన్నగారి
కి ముందే .చెప్పారు.నాన్నగారి  తో పాటు  నేను కూడా    వెళ్ళాను , మా నాన్నగారు
 ఆయనకి  నమస్కారం  చేసారు       నాకు  లీలగా గుర్తు  వుంది  ఆయన రూపం తల్లటి
 మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు.  తెల్ల అంతే  అంతకు మించి గుర్తు లేదు.  కానీ అప్పటికే  ఆ మహాకవి  గొంతు  మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు అంతే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.


 అంతటి మహానుభావుడిని  చూసాను  అదే ఒక  పెద్ద  రివార్డ్ అని తరువాతతెలిసింది
 ఇది నాకు  ఒక  అరుదయిన  ఎంతో  జ్ఞ్యాపకం .,విలువయిన   జ్ఞ్యాపకం.
  మళ్ళి కలుస్తానండోయి మరన్ని జ్ఞ్యాపకములతో!









Monday, February 14, 2011

పుస్తకాలు చదవండి



పుస్తకాలు చదవండి




చదవండి! అవే మనతో చివరివరకు వుండే స్నేహితులు.ఎందుకంటే ఒక పుస్తకం చదివితే కలిగే అనుభూతి ని మాటలలో వర్ణించలేము.పుస్తకాలు కొని చదవలేని వారికి ఇప్పుడు ఇంకా సులువుయిన సాధనం ,కంప్యూటర్ ఇది లేని ఇల్లులేదుంటే అతిశయోక్తి కానేకాదు అందులో ఇంటర్నెట్ ఫసిలిటి కూడా ఉంటోంది.

మొన్న ఎవరోఅంటున్నారు కొంచెము కష్టమైన ఒక్కసారి దాని గురుంచి తెలుసుకొని అలవాటు పడితే ప్రపంచం అంతా మన

చేతిలో . ఉంటుందని.




ఆమాట అక్షరసత్యం.




అమ్మ ఆదిగురువు,తరువాత స్కూల్ లో పాఠాలు నేర్పిన గురువులు ,ఇంకా మిగిలిన జీవితం అంతా పుస్తకాలే గురువులు స్నేహితులు అన్నీను.

కొన్ని విషయాలు ప్రక్రుతి నేర్పిస్తే,మరికొన్ని పుస్తకాల ద్వార తెలిసుకోవచ్చు. ఇంగ్లిష్ నవలు చదివితే తెలియని విషయలు తెలుస్తాయి

నిజమే కానీ అంత ఇంగ్లిష్ అర్ధం కాకపోతే . ఎంతో మంది గొప్పగొప్ప పుస్తకాలనితెలుగులోకి అనువాదాలు(Translations) చేసారు.

అందులో ముఖ్యం గ మాలతి చందూర్ . ఆవిడ Translations చదివితే ప్రపంచం గురుంచి వారి జీవనసరళి అంతా తెలుస్తుంది.

ఆ పుస్తకాలు చదివితే మానసిక వికాసం కూడాపెరుగుతుంది.

పొత్తూరి విజయలక్ష్మి గారు అన్నట్లు నవ్వడంకోసం Laughing Club కివెళ్లక్కరలేదు. ఓ మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతిసం,పానుగంటి లక్ష్మి నరసింహం సారంగధర నాటక ప్రదర్సన,భమిడిపాటి రాధాకృష్ణ ,తెనాలి రామకృష్ణుడు
సమయస్పూర్తి కధలుఅలాగే దయిర్య సాహసాలతో కూడిన రాజుల కధాలు ఇలా ఎన్నో వున్నాయి


ఇంకా మనసార నవ్వుకునే హాస్య పుస్తకాలు చాలావున్నాయి. మన దగ్గర


ఎందఱో చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలని చొప్పదంటు ప్రశ్నలని అంటారు అవి Dr. మహీధర నళిని మోహన్ గారు పిల్లల కోసం రాసారు.

మనం ఒక విధముగా ఇంట్లో అన్ని ఉంచుకొని వీధిలో వెతుకుతున్నాం. ఎంతో విఙ్గానదాయక పుస్తకాలు రాసారు.

చందమామ కధలు సరేసరి. కాని ఇప్పుడు పిల్లలకి పుస్తకాల చదివే అంతా తీరికలేదు,ఓపికలేదు

ఇప్పుడు వాళ్ళు Face Book నే బాగా ఫాలో ఆవుతున్నారు. అందుకే చాలామంది దానిద్వారా నే వాళ్ళని ఆకట్టుకొని మంచి విషయాలు .నేర్పుతున్నారు

ఈ మధ్య ప్రవాసాంధ్రుల కోసం WEB MAGAZINES చాల వచ్చాయి దానిమూలంగా కూడా మనందరిలో చదవాలి అన్నఉత్సాహం .పెరిగింది . ఇది నిజంగా మంచి మార్పు చదువరులు ఎక్కువ ఐతే ,రాసేవాళ్ళు ఇంకాఇనుమడించిన ఉత్సాహం తో రాస్తారు.


.మొన్న నేను విశాలంధ్ర పబ్లికేషన్స్ కే వెడితే వాళ్ళుఅంటున్నారు. చదివే అలవాటు పోలేదు .ఇంకా పుస్తకాలు అలా ప్రింట్ చేసుతునేవున్నం.












!అఖిల భారత రచయిత్రుల మహా సభలు
అఖిల భారత రచయిత్రుల మహా సభలు
శుక్రవారం, మరియు శనివారం రవింద్రభారతి లో చాల చక్క గ ఎంతో సమయపాలన తో సాగాయి. నిజముగా ఇది అందరి సమష్టి విజయం
అందరు మహారచయత్రిలు పెద్ద వారు అయిపోయారు
కానీవారి వదనాలలో ఎంతో ఉత్సహంతో, ఇంకా ఏదో చెయ్యాలి అన్న తపన కనిపించింది.
అలాగే ఇపుడిప్పుడే రచానా ప్రపంచములో శరవేగముతో దూసుకుపోతున్న కొత్త తరము రచయిత్రుల సందడి కూడా చాల ఆనందం గ .అనిపించిది సాహితి ప్రియులకి.

అక్కడ అంతమంది రచయిత్రుల ని ఒక్కసారిగా
చూసేసరికి నా మది ఆనందోతో నిండిపోయంది,
సి. ఆనంద రాం, యుద్దనపూడి సులోచన రాణి,డి.కామేశ్వరి,నందుల సుశీల.DR

పరిమళసోమేశ్వర్,ఇంకో ఎందఱో చిన్నప్పటి నుంచి వీరందరినీ చూడాలనే కోరిక తీరింది
అది ఇద్దరూ ఒకే పేరుతొవున్న వర్ధమాన రచయిత్రు లు (భానుమతిల) ద్వారా .

బ్రహ్మ్మలోకం లో విరంచి ధ్యానం లో వుండగా శారదాదేవి నాధా నేను అఖిల భారత రచయిత్రుల మహా సభల భూలోకం వెళ్ళుతున్నాఅని ఒక లేఖ రాసి వచ్చినది". అది మొదలు విరించి ఆమె రాక కోసము ఎదురు చూడసాగాడు. సరస్వతిలేని బ్రహ్మ్మలోకం కళావిహినం కదా! కానీ ఈ రెండురోజులు సరస్వతిదేవి నిత్య సాహిత్యగోష్టులతో ఎంతో ఆనందబరిత ఆయనది. రెందోరోజులుమాత్రమేనా మరి రెండురోజులున్న బాగుండేది అని తలపోస్తూభులోకమును విడువలేక విడువలేక తనలోకమునకువెళ్ళినది

అది ఒక చిన్న కల్పనా వూహ మాత్రమే.
ఇలాంటి సభలు ఇంకా ఇంకా జరగాలని ఆశిస్తూ!!!!!