Monday, February 14, 2011

పుస్తకాలు చదవండి



పుస్తకాలు చదవండి




చదవండి! అవే మనతో చివరివరకు వుండే స్నేహితులు.ఎందుకంటే ఒక పుస్తకం చదివితే కలిగే అనుభూతి ని మాటలలో వర్ణించలేము.పుస్తకాలు కొని చదవలేని వారికి ఇప్పుడు ఇంకా సులువుయిన సాధనం ,కంప్యూటర్ ఇది లేని ఇల్లులేదుంటే అతిశయోక్తి కానేకాదు అందులో ఇంటర్నెట్ ఫసిలిటి కూడా ఉంటోంది.

మొన్న ఎవరోఅంటున్నారు కొంచెము కష్టమైన ఒక్కసారి దాని గురుంచి తెలుసుకొని అలవాటు పడితే ప్రపంచం అంతా మన

చేతిలో . ఉంటుందని.




ఆమాట అక్షరసత్యం.




అమ్మ ఆదిగురువు,తరువాత స్కూల్ లో పాఠాలు నేర్పిన గురువులు ,ఇంకా మిగిలిన జీవితం అంతా పుస్తకాలే గురువులు స్నేహితులు అన్నీను.

కొన్ని విషయాలు ప్రక్రుతి నేర్పిస్తే,మరికొన్ని పుస్తకాల ద్వార తెలిసుకోవచ్చు. ఇంగ్లిష్ నవలు చదివితే తెలియని విషయలు తెలుస్తాయి

నిజమే కానీ అంత ఇంగ్లిష్ అర్ధం కాకపోతే . ఎంతో మంది గొప్పగొప్ప పుస్తకాలనితెలుగులోకి అనువాదాలు(Translations) చేసారు.

అందులో ముఖ్యం గ మాలతి చందూర్ . ఆవిడ Translations చదివితే ప్రపంచం గురుంచి వారి జీవనసరళి అంతా తెలుస్తుంది.

ఆ పుస్తకాలు చదివితే మానసిక వికాసం కూడాపెరుగుతుంది.

పొత్తూరి విజయలక్ష్మి గారు అన్నట్లు నవ్వడంకోసం Laughing Club కివెళ్లక్కరలేదు. ఓ మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతిసం,పానుగంటి లక్ష్మి నరసింహం సారంగధర నాటక ప్రదర్సన,భమిడిపాటి రాధాకృష్ణ ,తెనాలి రామకృష్ణుడు
సమయస్పూర్తి కధలుఅలాగే దయిర్య సాహసాలతో కూడిన రాజుల కధాలు ఇలా ఎన్నో వున్నాయి


ఇంకా మనసార నవ్వుకునే హాస్య పుస్తకాలు చాలావున్నాయి. మన దగ్గర


ఎందఱో చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలని చొప్పదంటు ప్రశ్నలని అంటారు అవి Dr. మహీధర నళిని మోహన్ గారు పిల్లల కోసం రాసారు.

మనం ఒక విధముగా ఇంట్లో అన్ని ఉంచుకొని వీధిలో వెతుకుతున్నాం. ఎంతో విఙ్గానదాయక పుస్తకాలు రాసారు.

చందమామ కధలు సరేసరి. కాని ఇప్పుడు పిల్లలకి పుస్తకాల చదివే అంతా తీరికలేదు,ఓపికలేదు

ఇప్పుడు వాళ్ళు Face Book నే బాగా ఫాలో ఆవుతున్నారు. అందుకే చాలామంది దానిద్వారా నే వాళ్ళని ఆకట్టుకొని మంచి విషయాలు .నేర్పుతున్నారు

ఈ మధ్య ప్రవాసాంధ్రుల కోసం WEB MAGAZINES చాల వచ్చాయి దానిమూలంగా కూడా మనందరిలో చదవాలి అన్నఉత్సాహం .పెరిగింది . ఇది నిజంగా మంచి మార్పు చదువరులు ఎక్కువ ఐతే ,రాసేవాళ్ళు ఇంకాఇనుమడించిన ఉత్సాహం తో రాస్తారు.


.మొన్న నేను విశాలంధ్ర పబ్లికేషన్స్ కే వెడితే వాళ్ళుఅంటున్నారు. చదివే అలవాటు పోలేదు .ఇంకా పుస్తకాలు అలా ప్రింట్ చేసుతునేవున్నం.









1 comment:

  1. చదవడం ఓ యోగం !మీ అలవాటు గొప్పది.నేనంతే !చదువుతూ అలా గంటలు గడిపేస్తాను.

    ReplyDelete