Thursday, November 16, 2017

ఆకు పచ్చని మణి హారం తెలంగాణ మాగాణం



ఆకు పచ్చని మణి హారం  తెలంగాణ మాగాణం


మనిషికి  చెట్టూ చేమ మనుగడ ని ఇస్తాయి  అవి లేకపోతె  మనిషి బతుకు ఎడారే.  గతంలో ఎన్నడూ లేనంత  గా   తెలంగాణం పచ్చదనం  తో కల కల లాడుతోంది.  రెండు రోజుల క్రితం  మా ప్రయాణం  హైదరాబాదు నుండి  ధర్మ పురి వైపు  సాగింది. చల్లని  చెట్ల  నీడ ల మధ్య  ఉదయపు  పలహారం చేసి  సిద్ధిపేట మీదుగా  వెళుతుంటే మనసు శరీరం కూడా  ఆ పచ్చదనపు ఆహ్లాదాన్ని ఆస్వాదించాయి
సిద్ధిపేట ఊరు  కడిగిన ముత్యం  లా ఉంది.  కారణం అక్కడ  ఎవ్వరు ప్లాస్టిక్  ని  వాడరు.  అది దాటి ముందుకు  వెళ్ళినప్పుడు  సిరిసెల్ల  టెక్స్టైల్ పార్క్  మీదుగా  వెళ్ళాము. అక్కడ కారు  ఆపకుండా  వేగం  గ తీసుకెళ్ళిపోయారు మా వాళ్ళు  కారణం  ఎక్కడ  మేము చీరలు  కొనేసుకుంటా మేమో  అని భయం  అన్న మాట.
నిజానికి మా దృష్టి అంతా  ధర్మపురి గోదారి  మీదే ఉంది.  దారి పొడవున  రోడ్ల  పక్కన, కాలనీలలో, పొలం గట్లమీద, చెరువు గట్ల మీద, ఇళ్ళముందు , అన్ని  చోట్ల  మొక్కలు, చెట్లు చెరవులు నిండుగా  ఉండి కళ్ళకు  తృప్తిగా  అనిపించింది.   ధర్మపురి గోదావరి నీళ్ళు స్వచ్చంగా  నీల కాంతి తో  మధ్యాహ్న్నపు భానుడి  కిరణాలతో  తళతళ మంటూ  మెరిసి పోయింది.  నరసింహ స్వామి దర్సనం తరువాత  అక్కడే ఉన్న  పచ్చటి చెట్ల కింద  తెచ్చుకున్న  భోజనం  చేసుకొని  బాసర  వైపు  సాగింది మా ప్రయాణం.  .
కోరుట్ల లో ప్రభుత్వ పశు వైద్య  కళాశాల ఉంది.
జగిత్యాల్ ,కోరుట్ల ,ఆర్మూర్,నిజామాబాద్ దాటి బాసర్ వెళ్ళాము.
మధ్యలో  అభంగపట్నం దగ్గర  దారి తప్పి  కొంత దూరం  పంట పొలాల  మధ్య సాగింది  మా ప్రయాణం అక్కడ  మళ్ళి గోదావరమ్మ దర్సనం ఇక్కడ  కొంత  శాంత గోదావరి రూపం లో  నిశ్చలం  గా ఉంది.   ఆ రాత్రికి  బాసర  లో బస చేసి  మరునాడు  జ్ఞాన స్వరూపిణి ,వేద మాత అయిన  సరస్వతీ  దేవి దర్సనం  చేసుకొని   హైదరాబాదు  కి  తిరుగు ప్రయాణం అయ్యాము.
ఈ ప్రయాణం  లో అప్పుడప్పుడు  స్థానిక  వ్యక్తుల తో  మాట్లాడినప్పుడు. వాళ్ళ  లో చాల మంది  ప్రభుత్వం చేస్తున్న పనులు వల్ల   చాల  సంతోష ము గా  ఉన్నారని చెప్పారు .  ముఖ్యంగా  ఆరోగ్య వైద్య  సేవల  విషయం లో. అదో  మంచి  పరిణామం  అనిపించింది.

కదలి పోతున్న  కార్ లోంచి  ఫొటోస్  తీయ లేక పోయాము






No comments:

Post a Comment