Thursday, May 3, 2012

వెన్నెల ధార


బ్లాగర్  మిత్రులందరికీ ,ఈ నెల  "కౌముది అంతర్జాల "  పత్రికలో  నా కవిత  "వెన్నెల ధార' ప్రచురితమయినది 
నా కవితను  ప్రచురించిన   "కిరణ్ ప్రభ  గారికి  ధన్యవాదములు .




                                 వెన్నెల ధార



వెన్నెల ధార! ! జగతి  అంతా కురిసే  వెండి వెన్నెల ధార!!
అంబరం నుంచి  వర్షిస్తున్న ఆనంద అమృతధార  !!
జలతారు పరదాలు చాటు   వెన్నల రేడు కురిపించే   కౌముది ధారలో
ఆమె మోము వున్న చిరు చెమట చినుకులుకాస్త ముత్యములై మెరయు చున్నవి
ఆమె కన్నుల కాటుక నిశిధి ని పోలియుండగా కనుపాపల కాంతి  మిలమిల మెరిసే తారకలు వలెవున్నవి
ఆమె కనుదోయి రాకా చంద్రుని చూసి వికసించిన కలువలేమో అన్నట్లు వున్నవి
ఆమె చెక్కిళ్ళ నిగ్గుటద్దాల లో  ఆ జాబిల్లి తొంగితొంగి చూస్తున్నాడు
ఆమె అధరాల ఫై  తోణికిసులాడుతున్న మధువులొలికించె చల్లనివెన్నెల
ఆమె నాగినివలె హొయలు పోతోంది తెల్లని చిక్కటివెన్నెలమొగలిపూల పానుపు వలెవుంది
ఆమె జడలోని విరిసిన మల్లెలు,ఆ రేరాజు అందంతో పోటి పడుతున్నాయి
ఆమె వదనం పున్నమి చంద్రుని వెండి వెన్నల లా చంద్రకాంతులు వెదజల్లుతున్నది
ఆమె దివినుండిభువికి దిగిన అచ్చెర కన్య వలెవున్నది
ఆమె మూర్తిభవించిన ప్రేమదేవత లావుంది
ఆమె దోశిళ్ళనుండి జాలువారుతున్న  వెన్నల ధార 
ఆనందంగా ఆ అమృత ధార ని పానం చేశాను
జగమంతా నిదురిస్తున్నవేళ  పుచ్చపువ్వులాంటి వెన్నలలో
ఆమె ఒడిలో నేను !  అలౌకికమైన స్వాప్నిక స్తితి!  
అస్తిత్వం వుందా నాకు! ఆమె నేనా? నేనే ఆమెనా?ఏమో?
మానసం విహంగలా ఎగిరిపోతోంది !  అనిర్వచనీయం ఆ అనుభూతి
అంతా ప్రేమమయం! అంతా   ఆనందమయం!
వెన్నెల!  వెన్నెలఎటు చూసిన కురిసే  వెన్నెల ధార



























3 comments:

  1. ఫల్గుణి గారూ, మీ లవిత బాగుంది, "ఆమె కన్నుల కాటుక నిసిని పోలి ఉంది, " అందమైన వర్ణన , మేడం నా బ్లాగ్ ని ఫాలో చేసిన మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. medam kavitha anna padaaniki ka ki badalu la padindi sorry.

    ReplyDelete
  3. ధన్యవాదాలు ఫాతిమా గారు!!!

    ReplyDelete