నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని. నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని, ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు " చలం
Wednesday, December 28, 2011
Thursday, December 22, 2011
Wednesday, December 14, 2011
వనజ
గారు మీబ్లాగ్ ద్వార నా నాగాలాండ్ టూర్ విశేషాలు గురుకొచ్చాయి. లాస్ట్ ఇయర్ నేను మావారు కలిసి సరదాగా ఎటు వెళ్ళడం అనుకోని
ఇండియా స్వితెజేర్లాండ్ అంటారు కోహిమనిఅక్కడికి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి గోవతి అక్కడ్నునుచి దీమాపూర్ మళ్ళి అక్కడనుంచి
కారులో (టాక్సీలో) కోహిమాకి. నిజంచెప్పాలంటేఅక్కడి ప్రజలజీవనవిధానం మనతో పోలిస్తే చాలబిన్నం గవుంటుంది. అక్కడ
ప్రజలకి మేము హైదరాబాద్ నుంచి నాగాలాండ్ చూడటానికి వచ్చాం అంటేచాలవిస్తుపోయారు. ఇక్కడ
వాళ్ళు అయతే మీకు వేరేప్లేస్ దొరక లేదా అని ఎద్డవ కూడా చేసారు. కాని
మాకు మటుకు ఇలాంటి చోటుకు వెళ్లి వాళ్ళ జీవన్ విధానం చూడాలని అక్కడి ప్రకృతి అందాల వీక్షిచాలని అనుకున్నాము.
వాళ్ళు కూడా మనలని గురుంచి ఇతరులుకు తెలుసుఅని చాల ఆనందపడ్డారు.
అక్కడి తీసినకొన్ని చిత్రాలు.ముఖ్యమైనది war cemetery, అలాగే మేము వెళ్ళినప్పుడు
అక్కడ అంగామీ అనే తెగవారిది పండగ జరిగింది ఆ
ఫొటోలు మరియుఎంతో ప్రతిష్టకారమైన నాగ
డాన్సు
Friday, November 25, 2011
పోలిస్వర్గం
రేపు పోలిస్వర్గం! దీని గురుంచి ఒక కధ వుంది మా అమ్మగారు చెప్పారు.
స్త్రీల వ్రతకదల పుస్తకం లోకూడావుంది
అనగా అనగా ఒక ఊరులో,అన్ని కులాల వాళ్ళు నివసిస్తూ వుంటారు అందులో చాకలి కులం
వారు వుంటారు. పోలి అనే ఆవిడ ఎప్పుడు దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో కొలుస్తూ వుంటుంది.
మిగత తోటికోడళ్ళు ,అత్తగారు ఆమెని చిన్న చూపు చూస్తారు. ఎప్పటి
లాగే వచ్చే కార్తిక మాసం ఆఖరిరోజున నది కి వెళ్లి దీపాలు వెలిగించాలని అనుకుంటుంది. కాని అత్తగారు
మిగిలిన కోడళ్ళు ఆమెకి చెప్పకుండా నది దగ్గరకి వెళ్ళిపోతారు. ఆమెకి
వత్తులు, నెయ్యి మొదలయిన సంబరాలు ఉంచకుండా చేస్తారు.
అప్పుడు ఆమె దేవుణ్ణి తలచుకుంటూ ఉన్నవాటి తో తయారు చేసుకొని నది కి వెళ్లిదీపాలు వదులుతుంది.
అది చూసి దేవతలుఆమెని బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పుష్పకవిమానం లోవస్తారు.
అది చూసిఊరులో వాళ్ళు ఆమె అత్తా,తోటికోడళ్ళు ఆహ ఎంత భాగ్యం, ఎంతపుణ్యం కదా! మన
పోలి బొంది తో స్వర్గం కి వెళ్ళింది అని ఆమె గురుంచి వేనోళ్ళ పోగుడుకుంటారు.
అప్పటి నుంచి ప్రతి కార్తిక మాసం చివరరి
రోజున
" పొలమ్మ స్వర్గం అందరు చేస్తున్నారు"
వెళ్ళిపోయవా ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా ప్రియ నేస్తం
వెళ్ళిపోయవా ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా ప్రియ నే స్తం
మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం
ఏవి ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!
ఏది మామిడి చెట్టుకు కట్టిన ఊయల ? ఊగుతూ ఊగుతూ తెగిన ఊయలని వదలి వెళ్ళిపోయవా నేస్తం!
ఏటిలో చేపలా ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని ఏటి పాలు చేసావా నేస్తం
నువ్వు భౌతికం గ లేకపోయనా వో నేస్తం ! నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను పలకరిస్తూనే వున్నాయి
ఈ మట్టి వాసనలో నిన్ను నేను చూస్తున్నాను నేస్తం ఈ గాలిలో గుసగుసలో నీ పాట వింటున్నాను నేస్తం
ఆ ఏటి తరగల మీద నురుగులో నీ నవ్వు చూస్తున్నాను నేస్తం ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం
నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు నేస్తం నాతో నే వున్నావు !! నా వూపిరిలోనే లోనే వున్నావు నేస్తం!!
Wednesday, November 23, 2011
రచయిత్రి బీనాదేవి గారి తో పరిచయ కార్యక్రమం
రచయిత్రి బీనాదేవి గారి తో పరిచయ కార్యక్రమం చాల బావుంది
HYtv ఛానల్ లో ది బుక్ అనే సాహిత్యకార్యక్రమం
బహుశ పరిచయం చేసినవారి పేరులక్ష్మి గారు అని అనుకుంటునాను.
నా చిన్నప్పుడు ఆవిడ ' ఆంధ్రజ్యోతి' లో ఫుణ్యభూమి కళ్ళుతెరూ,అలాగే రాధమ్మ పెళ్లి ఆగిపోయింది' లాంటి పుస్తకాలూ చదివానుఇప్పుడుఆవిడ వ్యాసాలు నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారం గ నే వుంటాయి. మనసును హత్తుకునే లావుంటాయి.
బీనాదేవి అనేకలం పేరుతో జంటగా రచనలు చేసిన దంపతులు బి.నరసింగ రావు, బాలాత్రిపురసుందరీ దేవి. వీరునవలలతో పాటు, ఎన్నో కథలనూ రాశారు. నరసింగరావు గారి హఠాన్మరణం తర్వాత, సాహితీ లోకమంతా 'బీనాదేవిఅంటే బి.నరసింగ రావు గారే రాస్తారుఅని అపోహ పడ్డారు. తరువాత కానీ చాల మందికి తెలియలేదు ఆవిడే స్వయం గరాసారు తన సంకలనం'కథలు-కబుర్లు' ముందుమాటలో నేనే రచనలు చేస్తున్నాననీ బాలాత్రిపురసుందరి దేవిఆవిడఅసలు పేరు 'బీనాదేవి' పేరుతోనే ఈ పుస్తకాన్ని వెలువరించారావి
ఈ రోజు ది బుక్ అనే సాహిత్యకార్యక్రమం ద్వార ఆవిడ పరిచయం నిజం గ చాల అభినందనీయం.
Monday, November 21, 2011
జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): జ్ఞ్యాపకములు
జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): జ్ఞ్యాపకములు: జ్ఞ్యాపకములు ఆంధ్ర షెల్లీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన జ్ఞ్యాప కం అసలు జ్ఞ్యాపకాలు లేని జీవితాలు ...
Saturday, November 12, 2011
Tuesday, November 8, 2011
మన(????)కృష్ణ వంశి
ఏంటో ఆనందంగా
మా తమ్ముడి 20 వ పెళ్లి రోజు అని మన గోదావరి,మన గోంగూర,మన వంకాయ ఇంకా సరే ఎర్రటి మన ఆవకాయ మన ఘంటసాల గారు ,మన మాయాబజార్ తో సరి తూగే మన creative
కృష్ణ వంశి!!{ పాపమూ సమించు గాక) అనిమొగుడు సినిమాకి వెళ్ళాము
కానిఎందుకు వెళ్లమో తెలెయని ఒక అర్ధం కాని పిచ్చిమానసికస్థితికి లోను అయ్యి మేము మా చెప్పు తో మమ్మల్ని కొట్టుకొని లెంపలేసుకున్నాము ఇంకా జీవితం లో కృష్ణ వంశి సినిమాకి రాకూడదని ఒక
ఘోరమైన శపధం చేసుకున్నాము
తెలుగుతనం ,సంప్రదాయం. అంటూ ఆడియో ఫంక్షన్ రోజునమొగుడు అంటే అంటూ చాల పెద్ద మాటలు చెప్పిన
మన(????)కృష్ణ వంశి! అది లేదు కదా క్యాలెండరు గిరల్స్ సంప్రదాయనికి మాత్రం చాఆఆఆఆఆఆఆఆఆఆల
న్యాయం చేకూర్చాడు.రోజా,రాజేంద్రప్రసాద్,నరేష్ వీళ్ళుకూడా తమ
తమనెలవులు తప్పారు
దేవుడా ఎందుకు ఎందుకు ఎందుకు మనతెలుగు సినిమా మంచి డైరెక్టర్ లు అందరు తమ పేరు ని,
అస్తిత్వం కోల్పోతున్నారు? మొన్న బాపుగారు,నిన్న విశ్వనాధ్ గారు ఈ రోజు కృష్ణ వంశి
అమ్మతెలుగు సినిమా తల్లి నీకు గతించిన వైభవం మళ్ళి వచ్చేనా?
ఇదినిజం గ తెలుగు చిత్రసీమ మొత్తం ఆలోచించదగ్గ విషయం
Monday, September 12, 2011
వనజవనమాలి: రజనీగంధ
వనజవనమాలి: రజనీగంధ
వనజగారు! ఇది నా పాటఅన్నంత గొప్పగా ఫీల్ అయిపోతాను కాని నాలా ఆలోచించే మరొకరువున్నారు అన్నరు
అనిఈ పాట తో తెలిసిపోయింది ఈపాటనాకుఎంత ఇష్టం అంటే ఆ సినిమానిఆ పాట కోసమే సినిమా సిడి కొనాను దాదాపు
పదిఏళ్ళ క్రితమేకొనుకున్నాను.
మీ బ్లాగ్ లో రచనలు చాలబావున్నయి.
Thanks to internet. మీలాంటి
మంచి బ్లాగ్ మిత్రులను అందిస్తున్నదుకు
Monday, August 29, 2011
Tuesday, August 23, 2011
ఆమె పాట చెరకు తేనె తీపికన్న మధురం.!
ఆమెపాట చెరకు తేనేల తీపి కన్నా మధురం
ఆమె పాట కొత్తచిగుళ్ళు తిన్న మత్తకోకిల గానంకన్నా మధురం!
అందరుఆమె గాన రసఝారి లో ఓలలాడండి
S Janaki Golden Hitz. Log on
tohttp://www.muzigle.com/playlis
Saturday, August 20, 2011
మా పాపికొండల విహారయాత్ర
ఎప్పటినుంచో చూడాలనుకున్న పాపికొండల అందాలూ , ఆ కొండల మధ్య
నుంచి ప్రవహించే జీవనది గోదావరిని చూసే అద్భుతమైన అవకాశంవచ్చింది.నేను మా చిన్నమ్మాయి శుక్రవారం రాత్రి AP tourism వారి హైదరాబాద్-భద్రాచలం- పాపికొండల package tour basheerbagh లోని central reservation office దగ్గర బస్సులో ఎక్కడం తో మొదలయింది. మరునాడు ఉదయం 6.౩౦ కి భద్రాచలం లోని
AP tourism వారి GH (హరిత) లో దింపారు.అక్కడ తొందరగాస్నానపానాదులు కానిచ్చి రాములవారి గుడికి వెళ్ళాము. ఉచిత దర్సనం క్యూలో వుండగా ఎవరో vip ని ఆలయ మర్యాదల తో లోపలకి తీసుకొని
వెళ్లారు. మరి మా అమ్మాయి యూత్ కదా కొంచెం ఘాటు గ విమర్శించింది. వాళ్ళని కానీ
ఎవరు వింటారు మనగోడుని అక్కడ. నలుగురితో పాటు మనమును. అదిగో మా
అమ్మాయికి నచ్చవు ఇలాంటివి.
చక్కగా రాములవారిదర్సనం తరువాత భద్రాచలం లోని పర్ణశాల , పంచవటి లాంటి ప్రదేశాలు ఆ పక్కనే గోదావరి
చూసుకుంటూ మళ్లి GH వెళ్లి లంచ్ కానిచ్చి పాపికొండల కి ప్రయాణం అయ్యాము భద్రాచలం నుంచి సుమారు
60 కం దూరం లో పోచవరం వెళ్లి లాంచీ ఎక్కాము. ఈ మధ్యలో మా బస్సు లో ప్రయాణికుల కోసం
" కాంచన" అనెడి మహత్తర చిత్రరాజాన్ని వేసారు. ఈ సినిమాగురుంచి తరువాత మాట్లాడదాం. మాకు AP tourisim వారు ఏర్పాటు చేసిన లాంచీ లోమాతో పాటు tour operator cum guide Mr.స్వామి వచ్చారు
అతను అచ్చు వంశి సిన్మాల లోని పాత్ర పోలికలుతో వున్నాడు. అలా గోదావరి
అందాలూ చూ స్తూమా లాంచీ సాగి పోతోంది.దాదాపురెండుగంటల ప్రయాణం . మార్గ
మద్యం లో కొండలమీద చిన్నచిన్న గిరిజనగ్రామాలూ కనిపించాయి. మా guide చెప్పినట్లు వాళ్ళ జీవితం
లో మార్పులేదు. ఎంతదురదృష్టం అంటే వాళ్ళకి కరెంటు లేదు, బస్సు రైల్ సౌకర్యం అసలే
లేదు. పడవ తప్ప వేరే ఆధారం లేదు నిజం గ గుండె ని కలచివేసింది.
సరేఇంతలో మాస్వామిగారు మేము వెళ్ళే "bamboo resorts" వస్తున్నాయి
చూడండి అవిగో దూరం గ అని చెప్పారు. చాల థ్రిల్లింగ్ ఫీల్ అయ్యి నేను అయతే ఎక్కడో వేరే ప్రపంచం లోకి
వెళ్లి పోయాను.వాతావరణం చల్లగ ఓ మాదిరి వానజల్లుతో ఏంటో ఆహ్లాదం గ. నేను అయతే కొండ గాలి
తిరింగిది గుండె ఊసులాడినది పాటకూడా పాడుకున్నాను. అందరం లాంచీ దిగి మా resorts daggari ki
luggage మోసుకుంటూ ఇసకలోనడక మొత్తంకి చేరుకున్నాం అప్పుడు
టైం 6 అయ్యిది మా hut no 14 daggarki' చేఉకునే సరికి evening snacklu coffee lu ayyayi.
ఇప్పడే మొదలైంది అసలువిషయం ఇక్కడ temp toilets matrame ఉన్నాయి. పెర్మేంట్వి
పైన కొండ మీదకి వెళ్ళాలి . టైం ఆసలు గడవటం లేదు ఎవరు బయటికి huts లోంచి రావటం
లేదు. నిజం చెప్పాలంటే ( ఇసకతిన్నెల మీద పౌర్ణిమి నాడు చుట్టూ గోదావరి వెండి వెన్నెల అలా
నిలబడి చూడటం ఒక అపురూపమైన అనుభవం కదా అందరోఅలాగేఅనుకుంటాం. కానీ
నిలబడి చూడటం ఒక అపురూపమైన అనుభవం కదా అందరోఅలాగేఅనుకుంటాం. కానీ
మాకు అది మాత్రం చీకటిరాత్రి . హోరునవాన అక్కడ కరెంటు వుండదు ఓన్లీ ఒక generator vundi
adi raatri 11 పం వరకు . సరే ఈ లోపల ఎలాగో ఆ వానలో డిన్నర్ కానిచ్చం. బయట కూరుచోడానికి వాన వింత ఏమ్తిటంటే లోపల కూడ వాన. రాత్రి అంత అలా కురుస్తూనే వుంది. భయం ఎందుకంటె ఎక్కడ
గోదావరి పొంగి మా కుటిరాలన్నీకొట్టుకు పోతయమో . సిగ్నల్స్ లేవుసో ఫోన్లు పనిచెయ్యటం
లేదు. అయిన నాకునిద్రపట్టింది. కాని మా పెగ్గి పడుకోలేదు. తెల్లారేసరికి అందరు మాములు గా
రోజువారి కార్యక్రమలు మొదలుపెట్టేసారు. రాత్రి తాలూకుభయం చ్చిహ్న్నలు ఎక్కడ
లేవు. ఉపాహారాలు కానిచ్చి andaru 3 km దూరం JUNGLE WALK కి వెళ్ళాం, అక్కడ
ఒక కొండ వాగులో స్నానాలుచేసి కైకాల సత్యనారయణ గారు( ee resorts owner) ఇంటి దగ్గర fresh అప్ అయ్యి లంచ్ చేసుకొని తిరుగు ప్రయాణం లో పాపికొండల మలపు చూసి అది దాటితే
రాజమండ్రి కి వెళ్ళచ్చు. చాలఅందం గా వుంది. అడవి బాపిరాజు
గారి గేయం ఉప్పొంగి పోయంది గోదావరి! తానూ తెప్పున్న ఎగేసింది ,సరే బాపు గారి అందాల రాముడు ఇంకా వంశి
సినిమాల గురుంచిచెప్పక్కర్లేదు. ఇదండీ మా విహారయాత్ర విశేషాలు.
ఏదో సరదాగా మీ అందరి తోటి share చేస్కున్దామనివ్రాసాను
అండ
oka
vinnayi
ఆచ్చు
Sunday, July 31, 2011
“ఓం! అసతోమా సత్ గమయ తమసోమ జ్యోతిర్ గమయ!
“ఓం! అసతోమా సత్ గమయ తమసోమ జ్యోతిర్ గమయ!
http://purvaphalguni.wordpress.com
Wednesday, July 20, 2011
మధురగాయని జిక్కి
అందరు ఇష్ట్టపడే మధురగాయని జిక్కి "' జీవితమే సఫలము రాగసుధ భరితము ప్రేమకధ మధురము ఈజీవితమే సఫలము.........."
మరువలేని ఆ తీయని కంఠం మళ్ళి ఒక్కసారి అందరు వినండి
Wednesday, April 6, 2011
జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): తమసోమ జ్యోతిర్ గమయ!
జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): తమసోమ జ్యోతిర్ గమయ!: "నాలో కి నేను తొంగిచూసాను! అద్భ్తుతం మహద్బుతం! నాలో నేను ఎన్నడు చూడని ఈ మహాకాంతి చాల ప్రకాశం గా వుంది నాలోవిని..."
Wednesday, March 9, 2011
ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా నేస్తం!
వెళ్ళిపోయవా నేస్తం! వెళ్ళిపోయవా నేస్తం
మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం
ఏవి ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!
ఏది మామిడి చెట్టుకు కట్టిన ఊయల ? ఊగుతూ ఊగుతూ తెగిన ఊయలని వదలి వెళ్ళిపోయవా నేస్తం!
ఏటిలో చేపలా ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని ఏటి పాలు చేసావా నేస్తం
నువ్వు భౌతికం గ లేకపోయనా వో నేస్తం ! నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను పలకరిస్తూనే వున్నాయి
ఈ మట్టి వాసనలో నిన్ను నేను చూస్తున్నాను నేస్తం ఈ గాలిలో గుసగుసలో నీ పాట వింటున్నాను నేస్తం
ఆ ఏటి తరగల మీద నురుగులో నీ నవ్వు చూస్తున్నాను నేస్తం ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం
నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు నేస్తం నాతో నే వున్నావు !! నా వూపిరిలోనే లోనే వున్నావు నేస్తం!!
Tuesday, March 8, 2011
ఆవేదన
అమ్మాయి పుట్టింది! మహాలక్ష్మి అన్నారు!
అమ్మాయి బాగా చదవుతోంది! సాక్షాతూ చదువలసరస్వతి అన్నారు!
అమ్మాయి కి ఈడు వచ్చి పెళ్లి జరిగింది! సాక్షాతూ ఆదిదంపతులు అన్నారు!
ఇంతవరకు అమ్మాయిలో అన్ని దేవతలను చూసారు!
అప్పుడు ఆమె మౌన మూర్తి వినటమే తప్ప మాటలాడటం ఎరుగదు!
మరి నేడు అందరు ఆమెని రాక్షసి అని బరితెగెంచిదని!అంటున్నారు
కారణం ఇప్పుడు నోరు తెరచింది స్వతంత్ర జీవనం కావాలి అంటోది!
కారణం ఇప్పుడు నోరు తెరచింది స్వతంత్ర జీవనం కావాలి అంటోది!
తనకు మాతృత్వం ఇవ్వన్ని వివాహబంధం వద్దు అంది!
అదేపురాణాల స్త్రీలు ఏమి చేసిన తప్పు పట్టని సమాజం ! తనకి ఎందుకు
న్యాయము చెయ్యరూ అని అడిగింది! అమ్మతనం కావాలని కోరుకోవడం తప్పా అని ప్రశ్నించిది?
ఏదిన్యాయము ! ఏది ధర్మం అని అక్రోసించింది ఆ స్ర్తీ హృదయం!
ఎవరు ఆమెకి న్యాయము చెయ్యలేదు. వేరే దారి లేక మరణాన్ని ఆశ్రయించింది!
ఎవరు ఆమెకి న్యాయము చెయ్యలేదు. వేరే దారి లేక మరణాన్ని ఆశ్రయించింది!
మండుతున్న మనసుతోపాటు తనువు కూడా అగ్నికి ఆహుతి అయ్యింది!
ఆహ! నిజంగా నీవు సతివే సుమా అని అందరు వేనోళ్ళ పొగిడారు!
ఆమె మరణం తో మరింత దివ్యత్వాన్ని పొందింది అని ఆనందించారు!
అంతే కానీ ఆమె నిండునూరేళ్లు అర్ధం లేకుండా ముగిసాయని ఎవరు అనలేదు.
ఎవరు అర్ధం చేసుకుంటారు వో స్త్రీ నీ గుండె లోతుల బాధని,
ఎవరు అర్ధం చేసుకుంటారు తల్లీ నీ ఆవేదనని? ఎవరు? ఎవరు???
Saturday, February 26, 2011
జ్ఞ్యాపకములు
జ్ఞ్యాపకములు
ఆంధ్ర షెల్లీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన జ్ఞ్యాపకం
అసలు జ్ఞ్యాపకాలు లేని జీవితాలు మనం వుహించలేము. ఒక మనిషి జీవితంలో ఎన్నో,ఎన్నోన్నో జ్ఞ్యాపకాలు
నిజముగా అవన్నీ అక్షర నిక్షిప్తం చేస్తే కొన్ని లక్షల కోట్లలో పుస్తకాలూ ఉండేవేమో అన్న ఒక చిత్రమైన వుహ. అలాంటి మరపురాని అమూల్యం అయిన ఒక జ్ఞ్యాపకం
తొలి వియోగిని నేనే!
తొలి ప్రేయసిని నేనే!
ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!!! ....... అది తను సృష్టించుకున్న ప్రేయసి ఊర్వశి నుంచి
కవి!భావకవి!మనవాడు! మనతెలుగువాడు!ప్రపంచం మొత్తం గర్వించ తగిన మహానుభావుడు!!!!!!
అంతటి మహాకవిని నేను కలిసాను అని తలుచుకుంటే చాల గర్వం గా అనిపిస్తుంది.
ఎప్పుడో నా చిన్ననాటి సంగతి, చిన్నదే కానీ చాల గొప్పది అది ఈ నాటి సాహితి మిత్రులోతో పంచుకుందామని,
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ని నేను నా చిన్నతనంలో బహుశ నాకు పది ,పదకొండు సం ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ ఒక కాలేజీ ప్రినిసిపాల్ గారు వుండేవారు బహుసా P.R. College అనుకుంట ఆయన
పేరు కూడా సరిగా గుర్తు లేదు సీతారామరావు గారు అన్నట్లు లీలగాజ్ఞ్యాపకం. ,ఇక్కడ మానాన్నగారి గురించి కొంత చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష చాలవుండేది.మా నాన్నగారి గురువు పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం గురుంచి అందులో ఉద్యోగపర్వం గురుంచి తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వచ్చారు. అ విషయం మా నాన్నగారికి ముందే .చెప్పారు.నాన్నగారి తో పాటు నేను కూడా వెళ్ళాను , మా నాన్నగారు ఆయనకి నమస్కారం చేసారు నాకు లీలగా గుర్తు వుంది ఆయన రూపం తెల్లటి మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు. అంతే అంతకు మించి గుర్తు లేదు. కానీ అప్పటికే ఆ మహాకవి గొంతు మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు ,అలాగే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
అంతటి మహానుభావుడిని చూసాను అదే ఒక పెద్ద రివార్డ్ అని తరువాతతెలిసింది
ఇది నాకు ఒక అరుదయిన ఎంతో విలువయిన జ్ఞ్యాపకం.
Friday, February 25, 2011
. జ్ఞ్యాపకములు,వాగ్దేవి కి కోపం వచ్చింది,
.వాగ్దేవి కి కోపం వచ్చింది
అది బ్రహ్మ లోకం, బ్రహ్మ మాములుగా తన ధ్యానం లో వున్నాడు
.సరస్వతి దేవి బంగారు చాయ తో తెల్లటి వస్ర్తాలు ధరించి, పద్మాసనం లో కూర్చొని,వీణాపాణి,పుస్తక ధారిణి అయి నెమిలి,హంస పక్కనే వుండగా సామగానం చేస్తూ వుంటే మునులందరూ కూడా అ శారదాదేవిని కొనియాడుతూ కీర్తిస్తూ, సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి,విద్యారంభం కరిష్యామి అంటూ,జ్ఞాన్నాన్ని,తెలివిని,ము
వాక్కుని ప్రసాదించే అమ్మవు.ముగ్గరుమ్మల మూలపు అమ్మవ్వు ఆని వేనోళ్ళ ప్రస్టుతి చేయగా,
ఆ శారదాదేవి ప్రసన్నరాలు కాకా పోగా,చాల కోపం తో కన్నులు ఎర్రబారగా బ్రహ్మ వేపు చూస్తూ నాధా నేటి నుంచి నన్నుకొలవని ప్రజలందరినీ మూడులు గ ,వాక్సుద్ధి లేనివారిగా,తెలివిలేనివారిగా కమ్మనిశాపము ఇస్తున్నానని చెప్పింది. అందరు బ్ర్మహతో సహా తల్లి ఎందుకు నీ ఆగ్రహం ఈ సమస్తలోకాలు నీ కరుణ లేకుండా ముఖ్యం గ వాక్కు,తెలివి లేకపోతె అందరు అల్లాడిపోతారు తల్లి,కారణం లేకుండా ఆగ్రాహించకు అనగా.
"ఆవాగ్దేవిఇలా పలికింది! ఇది చూడండి ఆని భూలోకం లో ఒక నగరంలో ఆరోజు శుక్రవారం కావటం తో
అందరూ స్రీలు ఒక్క చోట చేరి లలితసహ్రసనామ పారాయణ మరియు లక్ష్నిస్తోత్రం ఇంకా వివిధ అష్థకములు చదివారు.దివ్యద్రిష్టితో అదిగో అని బ్రహ్మమొదలగు వారందరికీ చూపిస్తూ అందులో ఏ ఒక్కరైన నన్నుస్తుతించారా? అని ప్రశ్నవేసినది. లేదుకదా. వీరుందరూ విద్యవతులే అందరికి నేను కావాలి నా ద్వార వచ్చే చదువుకావాలి,వారివాస్వప్రయోజనా
అమ్మా వద్దూ వద్దూ , అంటూ పెద్దగా అరుస్తూ వుంటే మా వారువచ్చి ఏమోయి ఏమిటి అలా వద్దూ వద్దూ అంటూపలవరిస్తున్నావు అంటూనిద్రలేపారు.వెంటనే నాకొచ్చిన కలని ఆయనతో చెప్పాను, అప్పుడు అయన దానిదేముంది ఈవాళ నించి మీరందరు 'సరస్వతిదేవిని" కూడా పారాయణచెయ్యండి. ఎందుకు నీకుఆవిడ కలలో కనిపించిందో ఇది ఒక అందుకు మంచిదే అని అన్నారు. అదే మొన్న శ్రీవిద్య వాళ్ళఇంట్లో పారాయణరోజున పిల్లలు అడిగారు మమ్మీ చిన్నలిల్లలే సరస్వతిపూజ చెయ్యలా? మీరు చేయ్యక్కరలేదా అని. ఆ విషయంమనసులో వుండిపోయిదేమో! అది ఇలా కల రూపంలో వచ్చి వుంటుంది అని ,ఒకరకం గ ఇది మంచిదే మా
కళ్లు తెరిపించింది.తప్పకుండ ఈవాళ్ళనుంచి అందరం ఆ శారదదేవిని ఆ చదువుల తల్లిని కూడా కొలుస్తాం అనుకుంటూ దినచర్య ప్రారంబిచాను.
ఇది నమ్మండి నమ్మకపోండి కాని ఆ వాగ్దేవికి మాత్రం కోపం తెప్పించకండి!!!
ఇది నమ్మండి నమ్మకపోండి కాని ఆ వాగ్దేవికి మాత్రం కోపం తెప్పించకండి!!!
. జ్ఞ్యాపకములు
.
జ్ఞ్యాపకాలు లేని జీవితాలు మనం వుహించలేము. ఒక మనిషి జీవితంలో ఎన్నో,ఎన్నోన్నో జ్ఞ్యాపకాలు
నిజముగా అవన్నీ అక్షర నిక్షిప్తం చేస్తే కొన్ని లక్షల కోట్లలో పుస్తకాలూ ఉండేవేమో అన్న ఒక చిత్రమైన వుహ.
ఆ ఆలోచనలోంచి .కొన్ని జ్ఞ్యాపకాలు.
ఆంధ్ర షెల్లీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన అరుదయిన జ్ఞ్యాపకం
"ప్రేయసి, ప్రేయసి, ! ప్రియుడనే ప్రేయసి!
వేయి కన్నులు దాల్చి వెదుకుచున్ననే!
దేవులపల్లి వేకంట కృష్ణశాస్త్రి
అని ప్రేయసి ని వెదుకుచున్న కవి హృదయం అది
అంతటి మహాకవిని చూసిన నాకన్నులు ఎంత భాగ్యం చేసుకున్నాయో కదా!
అ నాటి సంగతి, చిన్నదే కానీ చాల గొప్పది ఈ నాటి సాహితి మిత్రులోతో అది పంచుకుందామని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ని నేను
నా చిన్నతనంలో బహుశ నాకు
పది ,పదకొండు సం ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ ఒక
నా చిన్నతనంలో బహుశ నాకు
పది ,పదకొండు సం ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ ఒక
కాలేజీ ప్రినిసిపాల్ గారు వుండేవారు పేరు సరిగా గుర్తు లేదు సీతారామరావు గారు అన్నట్లు జ్ఞ్యాపకం.
ఇప్పుడు ,ఇక్కడ మానాన్నగారి గురించి కొంత
చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష చాలవుండేది.మా నాన్నగారి గురువు పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం గురుంచి అందులో ఉద్యోగపర్వం గురుంచి తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వచ్చారు. అ విషయం మా నాన్నగారి
చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష చాలవుండేది.మా నాన్నగారి గురువు పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం గురుంచి అందులో ఉద్యోగపర్వం గురుంచి తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వచ్చారు. అ విషయం మా నాన్నగారి
కి ముందే .చెప్పారు.నాన్నగారి తో పాటు నేను కూడా వెళ్ళాను , మా నాన్నగారు
ఆయనకి నమస్కారం చేసారు నాకు లీలగా గుర్తు వుంది ఆయన రూపం తల్లటి
మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు. తెల్ల అంతే అంతకు మించి గుర్తు లేదు. కానీ అప్పటికే ఆ మహాకవి గొంతు మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు అంతే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు. తెల్ల అంతే అంతకు మించి గుర్తు లేదు. కానీ అప్పటికే ఆ మహాకవి గొంతు మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు అంతే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
అంతటి మహానుభావుడిని చూసాను అదే ఒక పెద్ద రివార్డ్ అని తరువాతతెలిసింది
ఇది నాకు ఒక అరుదయిన ఎంతో జ్ఞ్యాపకం .,విలువయిన జ్ఞ్యాపకం.
Monday, February 14, 2011
పుస్తకాలు చదవండి
పుస్తకాలు చదవండి
చదవండి! అవే మనతో చివరివరకు వుండే స్నేహితులు.ఎందుకంటే ఒక పుస్తకం చదివితే కలిగే అనుభూతి ని మాటలలో వర్ణించలేము.పుస్తకాలు కొని చదవలేని వారికి ఇప్పుడు ఇంకా సులువుయిన సాధనం ,కంప్యూటర్ ఇది లేని ఇల్లులేదుంటే అతిశయోక్తి కానేకాదు అందులో ఇంటర్నెట్ ఫసిలిటి కూడా ఉంటోంది.
మొన్న ఎవరోఅంటున్నారు కొంచెము కష్టమైన ఒక్కసారి దాని గురుంచి తెలుసుకొని అలవాటు పడితే ప్రపంచం అంతా మన
చేతిలో . ఉంటుందని.
ఆమాట అక్షరసత్యం.
అమ్మ ఆదిగురువు,తరువాత స్కూల్ లో పాఠాలు నేర్పిన గురువులు ,ఇంకా మిగిలిన జీవితం అంతా పుస్తకాలే గురువులు స్నేహితులు అన్నీను.
కొన్ని విషయాలు ప్రక్రుతి నేర్పిస్తే,మరికొన్ని పుస్తకాల ద్వార తెలిసుకోవచ్చు. ఇంగ్లిష్ నవలు చదివితే తెలియని విషయలు తెలుస్తాయి
నిజమే కానీ అంత ఇంగ్లిష్ అర్ధం కాకపోతే . ఎంతో మంది గొప్పగొప్ప పుస్తకాలనితెలుగులోకి అనువాదాలు(Translations) చేసారు.
అందులో ముఖ్యం గ మాలతి చందూర్ . ఆవిడ Translations చదివితే ప్రపంచం గురుంచి వారి జీవనసరళి అంతా తెలుస్తుంది.
ఆ పుస్తకాలు చదివితే మానసిక వికాసం కూడాపెరుగుతుంది.
పొత్తూరి విజయలక్ష్మి గారు అన్నట్లు నవ్వడంకోసం Laughing Club కివెళ్లక్కరలేదు. ఓ మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతిసం,పానుగంటి లక్ష్మి నరసింహం సారంగధర నాటక ప్రదర్సన,భమిడిపాటి రాధాకృష్ణ ,తెనాలి రామకృష్ణుడు
సమయస్పూర్తి కధలుఅలాగే దయిర్య సాహసాలతో కూడిన రాజుల కధాలు ఇలా ఎన్నో వున్నాయి
ఇంకా మనసార నవ్వుకునే హాస్య పుస్తకాలు చాలావున్నాయి. మన దగ్గర
ఎందఱో చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలని చొప్పదంటు ప్రశ్నలని అంటారు అవి Dr. మహీధర నళిని మోహన్ గారు పిల్లల కోసం రాసారు.
మనం ఒక విధముగా ఇంట్లో అన్ని ఉంచుకొని వీధిలో వెతుకుతున్నాం. ఎంతో విఙ్గానదాయక పుస్తకాలు రాసారు.
చందమామ కధలు సరేసరి. కాని ఇప్పుడు పిల్లలకి పుస్తకాల చదివే అంతా తీరికలేదు,ఓపికలేదు
ఇప్పుడు వాళ్ళు Face Book నే బాగా ఫాలో ఆవుతున్నారు. అందుకే చాలామంది దానిద్వారా నే వాళ్ళని ఆకట్టుకొని మంచి విషయాలు .నేర్పుతున్నారు
ఈ మధ్య ప్రవాసాంధ్రుల కోసం WEB MAGAZINES చాల వచ్చాయి దానిమూలంగా కూడా మనందరిలో చదవాలి అన్నఉత్సాహం .పెరిగింది . ఇది నిజంగా మంచి మార్పు చదువరులు ఎక్కువ ఐతే ,రాసేవాళ్ళు ఇంకాఇనుమడించిన ఉత్సాహం తో రాస్తారు.
.మొన్న నేను విశాలంధ్ర పబ్లికేషన్స్ కే వెడితే వాళ్ళుఅంటున్నారు. చదివే అలవాటు పోలేదు .ఇంకా పుస్తకాలు అలా ప్రింట్ చేసుతునేవున్నం.
!అఖిల భారత రచయిత్రుల మహా సభలు
అఖిల భారత రచయిత్రుల మహా సభలు
శుక్రవారం, మరియు శనివారం రవింద్రభారతి లో చాల చక్క గ ఎంతో సమయపాలన తో సాగాయి. నిజముగా ఇది అందరి సమష్టి విజయం
అందరు మహారచయత్రిలు పెద్ద వారు అయిపోయారు
కానీవారి వదనాలలో ఎంతో ఉత్సహంతో, ఇంకా ఏదో చెయ్యాలి అన్న తపన కనిపించింది.
అలాగే ఇపుడిప్పుడే రచానా ప్రపంచములో శరవేగముతో దూసుకుపోతున్న కొత్త తరము రచయిత్రుల సందడి కూడా చాల ఆనందం గ .అనిపించిది సాహితి ప్రియులకి.
అక్కడ అంతమంది రచయిత్రుల ని ఒక్కసారిగా
చూసేసరికి నా మది ఆనందోతో నిండిపోయంది,
సి. ఆనంద రాం, యుద్దనపూడి సులోచన రాణి,డి.కామేశ్వరి,నందుల సుశీల.DR
పరిమళసోమేశ్వర్,ఇంకో ఎందఱో చిన్నప్పటి నుంచి వీరందరినీ చూడాలనే కోరిక తీరింది
అది ఇద్దరూ ఒకే పేరుతొవున్న వర్ధమాన రచయిత్రు లు (భానుమతిల) ద్వారా .
బ్రహ్మ్మలోకం లో విరంచి ధ్యానం లో వుండగా శారదాదేవి నాధా నేను అఖిల భారత రచయిత్రుల మహా సభల భూలోకం వెళ్ళుతున్నాఅని ఒక లేఖ రాసి వచ్చినది". అది మొదలు విరించి ఆమె రాక కోసము ఎదురు చూడసాగాడు. సరస్వతిలేని బ్రహ్మ్మలోకం కళావిహినం కదా! కానీ ఈ రెండురోజులు సరస్వతిదేవి నిత్య సాహిత్యగోష్టులతో ఎంతో ఆనందబరిత ఆయనది. రెందోరోజులుమాత్రమేనా మరి రెండురోజులున్న బాగుండేది అని తలపోస్తూభులోకమును విడువలేక విడువలేక తనలోకమునకువెళ్ళినది
అది ఒక చిన్న కల్పనా వూహ మాత్రమే.
ఇలాంటి సభలు ఇంకా ఇంకా జరగాలని ఆశిస్తూ!!!!!
Subscribe to:
Posts (Atom)